»   » ‘సుల్తాన్’ మూవీ రీమేక్‌లో వెంకటేష్, హీరోయిన్ ఎవరంటే...

‘సుల్తాన్’ మూవీ రీమేక్‌లో వెంకటేష్, హీరోయిన్ ఎవరంటే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగులో అగ్రహీరోగా వెలుగొందిన వెంకటేష్ ప్రస్తుతం తన వయసు, బాడీ లాంగ్వేజ్‌కు సూటయ్య పాత్రలు ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో ఆయన రీమేక్ సినిమాల వైపు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో ఆయన చేసిన దృశ్యం, గురు సినిమాలు మంచి సక్సెస్ సాధించాయి.

తాజాగా వెంకటేష్ మరో రీమేక్ చిత్రానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. హిందీలో బ్లాక్ బస్టర్ హిట్ అయి వందల కోట్లు వసూలు చేసిన 'సుల్తాన్' రీమేక్ లో ఆయన చేయనున్నట్లు సమాచారం. హిందీలో సల్మాన్ ఖాన్ పోషించి కుస్తీ యోధుడి పాత్రలో వెంకీ నటిస్తారని తెలుస్తోంది.

సుల్తాన్

సుల్తాన్

కుస్తీ గేమ్ ఆధారంగా తెరకెక్కిన ‘సుల్తాన్' మూవీ బాలీవుడ్లో భారీ విజయం సాధించింది. అక్కడ ఈ చిత్రం రూ. 500 కోట్లు వసూలు చేసింది. సల్మాన్ ఖాన్ కెరీర్లోనే ఈ చిత్రం భారీ హిట్. ఈ సినిమా కథ, క్యారెక్టర్ తనకు పర్ఫెక్టుగా సరిపోతుందని భావిస్తునారు వెంకీ.

సొంత బేనర్లోనే..

సొంత బేనర్లోనే..

ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లోనే నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రం మినిమమ్ గ్యారంటీ సినిమా కావడం వల్ల నిర్మాత సురేష్ బాబు ఈ చిత్ర నిర్మాణ బాధ్యతలు చేపటటేందుకు సిద్ధంగా ఉన్నారట.

రితికా సింగ్ హీరోయిన్

రితికా సింగ్ హీరోయిన్

ఇంతకు ముందు వెంకటేష్, రితికా సింగ్ కాంబినేషన్లో వచ్చిన 'గురు' సినిమా సక్సెస్ సాధించింది. ఈ చిత్రంలో హీరోయిన్ గా రితికా సింగ్ నటించింది. మళ్లీ ఈవిడనే ‘సుల్తాన్' రీమేక్ లో తీసుకోనున్నట్లు సమాచారం.

కారణం అదే..

కారణం అదే..

రితికా సింగ్‌ను మరోసారి ఎంపిక చేయడానికి కారణం.... ఆమె మాజీ బాక్సర్ కావడమే. ‘సుల్తాన్' మూవీలో రెజ్లర్ గా నటించిన అనుష్క వర్మ పాత్రలో రితికా సింగ్ కనిపించే అవకాశం ఉంది. ఈ సినిమాకు సంబంధించిన వివరాలు అఫీషియల్‌గా వెల్లడికావాల్సి ఉంది.

దర్శకుడు ఎవరు?

దర్శకుడు ఎవరు?

గురు' సినిమా కోసం బాక్సింగ్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకున్న వెంకటేష్ ఇప్పుడు ‘సుల్తాన్' రీమేక్ మూవీ కోసం రెజ్లింగ్‌లో కూడా శిక్షణ తీసుకుంటున్నాడట. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్లనుంది. ఎవరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుందనే విషయంపై ప్రస్తుతానికి క్లారిటీ లేదు. త్వరలోనే ఈ చిత్రంపై ఓ ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

English summary
According to the latest reports, Victory Venkatesh is interested in remaking Sultan in Telugu. Apparently, Venkatesh liked the film very much and had evinced interest in buying its Telugu rights.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu