»   »  మారుతి సైలెంట్ గా అమ్మేసాడు

మారుతి సైలెంట్ గా అమ్మేసాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : వెంకటేష్ సోలోగా సినిమా చేసి చాలా కాలం అయ్యింది. 'దృశ్యం' తర్వత మరే సినిమా చెయ్యలేదు. ప్రస్తుతం మారుతి డైరక్షన్ లో 'బాబు బంగారం' (వర్కంగ్ టైటిల్) సినిమా చేస్తున్నారు వెంకటేష్. ఈ సినిమా షూటింగ్ సైలెంట్ గా, స్పీడ్ గా సాగిపోతోంది. అదే విధంగా బిజినెస్ సైతం చాలా ఊపుగా , స్పీడుగా ,సైలెంట్ గా జరుగుపోతోందని సమాచారం.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు సంబందించి ఉత్తరాంధ్ర బిజినెస్ జరిగిపోయిందని, దీనికి ఓ మంచి ఫ్యాన్సీ ఎమౌంట్ తో భారతి పిక్చర్స్ కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది.

Venkatesh's Babu Bangaram Uttarandhra rights sold

నయనతార లీడ్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమా మంచి హిట్ అవుతుందని, గతంలో వెంకటేష్, నయనతారా కాంబినేషన్ లో వచ్చిన లక్ష్మి, తులసి సినిమాలు సూపరు హిట్ అవ్వడంతో ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే మంచి హిట్స్ తో ముందుకు దూసుకుపోతున్న డైరక్టర్ మారుతి ఈ ఫ్యామిలి సినిమాతో ఏ రేంజిలో మాయా చెస్తాడో అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు.

. ఎస్‌. రాధాకృష్ణ సమర్పణలో సితార ఎంటర్‌టైనమెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ విషయాన్ని నాగవంశీ తెలియజేస్తూ ‘‘ఇదివరకు ‘లక్ష్మీ', ‘తులసి' చిత్రాలతో హిట్‌ పెయిర్‌గా పేరు తెచ్చుకున్న వెంకటేశ్, నయనతార మరోసారి మా చిత్రంలో జంటగా నటిస్తుండటం ఆనందంగా ఉంది.

Venkatesh's Babu Bangaram Uttarandhra rights sold

ఇటీవల మారుతి చెప్పిన కథ మాకు, వెంకటేష్ గారికి బాగా నచ్చింది. వారి కాంబినేషన్ సినిమా అనగానే షూటింగ్‌ ప్రారంభానికి ముందుగానే క్రేజ్‌ వచ్చింది. ఇది మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ అవుతుంది.

తెలుగులో ‘రన్ రాజా రన్', ‘జిల్‌' సినిమాలకు పనిచేసిన జిబ్రాన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ఎస్‌.వివేక్‌ ఆనంద్‌, కూర్పు: ఉద్దవ్‌, సమర్పణ: ఎస్‌.రాధాకృష్ణ ఈ చిత్రానికి బాబు బంగారం అనే టైటిల్‌ ఫైనల్ చేయాల్సి ఉన్నా ఆ చిత్రాన్ని 2016 వేసవిలో ప్రేక్షకుల ముందుకు తెస్తాం'' అని చెప్పారు.

English summary
The Uttarandhra rights of the Venkatesh's ‘Babu Bangaram’ movie were already sold out. Bharath Pictures bagged the rights by paying a fancy amount.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu