»   » సగం అదీ.., సగం ఇదీ...., ఏంది "గురూ" ఇదీ!??

సగం అదీ.., సగం ఇదీ...., ఏంది "గురూ" ఇదీ!??

Posted By:
Subscribe to Filmibeat Telugu

హీరోయిన్ పాత్రకు సంబంధించిన కొన్ని సన్నివేశాల్ని మళ్లీ తీయాల్సిన అవసరం లేకుండా.. ఒరిజినల్ నుంచి వాడుకోవాలని ముందే డిసైడయ్యారు.
బాబు బంగారంతో చాలా కాలం తర్వాత మాంచి జోష్ ఉన్న పాత్రతో వస్తాడనుకుంటే హిట్ కి దగ్గరిదాకా వచ్చి షర్ట్ కట్ లో పక్కకి వెళ్ళిపోయాడు విక్టరీ వెంకటేష్.. ఇలా లాభం లేదనుకున్నాడేమో ఈ సారి తనకు అచ్చొచ్చిన రీమేక్‌తో ప్రేక్షకులను పలకరించనున్నాడు. హిందీలో సూపర్ హిట్ అయిన మాధవన్ "సాలా ఖడూస్" ని ఎంచుకున్నాడు. మాధవన్ తో సాలా ఖడూస్ ని డైరెక్ట్ చేసిన సుధ కొంగర ప్రసాద్ తెలుగు రీమేక్‌కు కూడా దర్శకత్వం వహించనుంది. బాక్సింగ్ కోచ్ గా నటించనున్న వెంకీ కోసం "గురు" అనే టైటిల్ ని ఫిక్స్ చేసారు. మామూలుగానే ఫిట్నెస్ కి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే వెంకీ ఈ బాక్సింగ్ కోచ్ కి సరిగ్గా సరిపోయాడు.

ఒరిజినల్లో నటించిన రితికా సింగే ఇక్కడా అదే పాత్రలో కనిపిస్తుంది. ఎంతో టాలెంట్ ఉన్నా.. బాక్సింగ్ రాజకీయాల వల్ల ఛాంపియన్ కాలేకపోయిన కథానాయకుడు.. కోచ్ గా మారి మట్టిలో మాణిక్యాలను వెలికి తేవాలనుకుంటాడు. అలా ఓ పేద కుటుంబానికి చెందిన గడుసు పిల్లను ఛాంపియన్ చేయడానికి నడుం బిగిస్తాడు. తెలుగు వెర్షన్ వైజాగ్ బ్యాగ్రౌండ్లో సాగుతుందివెంకీ గురువుగా నటించే ఈ మూవీలో.. ఆయనకి శిష్యురాలిగా రితికా సింగ్ నటించనుంది. ఈ అమ్మాయికి ఇదే తొలి తెలుగు సినిమా కాగా.. ఒరిజినల్ వెర్షన్ లో కూడా ఈమే యాక్ట్ చేసింది. ఈ ఒక్క పాత్రతో హిందీ.. తమిళ్ తో పాటు తెలుగులోనూ రితికా సింగ్ అరంగేట్రం చేసేస్తుండడం విశేషం.

 venkatesh's new movie guru is not complete remake

వెంకీ గురువుగా నటించే ఈ మూవీలో.. ఆయనకి శిష్యురాలిగా ఒరిజినల్ లోనే నటించిన రితికా సింగ్ నటించనుంది. హిందీలో నే కాదు ఈ అమ్మాయికి తెలుగులో కూడా ఇదే మొదటి సినిమా. ఈ ఒక్క పాత్రతో హిందీ.. తమిళ్ తో పాటు తెలుగులోనూ రితికా సింగ్ అరంగేట్రం చేసేస్తుండడం విశేషం అంతా బాగనే ఉంది గానీ ఇక్కడొక మెలిక వింతగా ఉంది. అదేమిటంటే...తమిళంలో కీలక పాత్ర పోషించిన రితికానే తెలుగులోనూ అదే రోల్ చేస్తోంది.

ఐతే హీరోయిన్ పాత్రకు సంబంధించిన కొన్ని సన్నివేశాల్ని మళ్లీ తీయాల్సిన అవసరం లేకుండా.. ఒరిజినల్ నుంచి వాడుకోవాలని ముందే డిసైడయ్యారు. తమిళంలో ఈ చిత్రాన్ని నిర్మించిన వైనాట్ స్టూడియోసే తెలుగులోనూ ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఇబ్బందేమీ లేకపోయింది. తమిళ వెర్షన్ చెన్నై తీర ప్రాంతం నేపథ్యంలో సాగితే.. ఇక్కడ వైజాగ్ బ్యాక్ డ్రాప్ ను ఎంచుకున్నారు. హీరోయిన్ బాక్సింగ్ సాధనతో పాటు మరికొన్ని సన్నివేశాల్ని తెలుగులో వాడుకున్నా ఇబ్బందేమీ రాదని ఈ నిర్ణయం తీసుకున్నారట.

దాదాపు 15 నిమిషాల తమిళ ఫుటేజ్ ను తెలుగు కోసం వాడుకుంటున్నట్లు సమాచారం. అంటే సగం మూవీని పిక్చరైజ్ చేసి.. పాత వెర్షన్ ను కూడా కలిపి మొత్తం పార్ట్ కు కొత్తగా డబ్బింగ్ చెప్పించేస్తే సరిపోతుంది. ఇలా కొంత డబ్బింగ్.. కొంత రీమేక్ చేసేస్తారట. "నేటివిటీ" అన్న ప్రాబ్లెం తప్ప ఇంకే లోపమూ కనిపించదు అనుకుంటున్నారట... కానీ అసలు మొట్ట మొదట దెబ్బ పడేదే నేటివిటీ విషయం లో మన వాతావరణం కనిపించనప్పుడు వెంకీ హిందీలో చేసిన సినిమాని తెలుగులో డబ్ చేసుకొని చూస్తున్నట్టే ఉంటుంది. చూద్దాం మరి ఈ హాఫ్..హాఫ్..ఫుల్ కాన్సెప్ట్ వర్కౌట్ అవుతుందో లేదో... లేక కేవలం వెంకీ భుజాల మీదే సక్సెస్ ని ఎత్తుతారో... ఈ చిత్రాన్ని తెలుగమ్మాయే అయిన సుధ కొంగర రూపొందిస్తోంది. షూటింగ్ మొదలైన మూడు నెలల్లోనే ఈ చిత్రం ముగింపు దశకు వచ్చేసింది. వచ్చే ఏడాది జనవరి 26న 'గురు' ప్రేక్షకుల ముందుకొస్తుంది.

English summary
Industry buzz is that the director and producer who made the movie in Tamil are planning to shoot only the portions involving Venkatesh. Rest of the scenes that don"t require the presence of Venkatesh from the Tamil version will be added to the movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu