»   » పవన్ ఫ్యాన్స్‌కు 'వెంకీ' బూస్టింగ్: సంక్రాంతికి 'అజ్ఞాతవాసి'లో కిర్రాక్ కామెడీ ట్రాక్(వీడియో)

పవన్ ఫ్యాన్స్‌కు 'వెంకీ' బూస్టింగ్: సంక్రాంతికి 'అజ్ఞాతవాసి'లో కిర్రాక్ కామెడీ ట్రాక్(వీడియో)

Subscribe to Filmibeat Telugu
'అజ్ఞాతవాసి'లో భారీ మార్పులు-చేర్పులు.. వెంకీ స్టిల్స్ అదిరిపోయాయి..!

మేనమామ పాత్ర అన్నారు.. కామెడీ మామూలుగా పేలదన్నారు. ఆ తర్వాత.. కాదు, కాదు యాక్షన్ సీన్ అన్నారు. సరే, ఏదో ఒకటి తెర పైనే సర్‌ప్రైజ్ చేస్తారులే అనుకున్నారు. కానీ.. తెరపై బొమ్మ పడి సినిమాలో ఒక్కో సీన్ అలా కదిలిపోతుంటే.. ఇంకెక్కడ 'వెంకీ'?.. ఎంతకీ రాడే?..

సినిమా అయ్యాక కానీ విషయం అర్థం కాలేదు. అసలు సినిమాలో వెంకీ సీన్స్ లేవని. ఇలా నిరాశపడ్డ అభిమానుల కోసం 'అజ్ఞాతవాసి' టీమ్ ఇప్పుడు ఆ సీన్స్ యాడ్ చేయబోతుందట..

తెరపై 'థౌజండ్ వాలా' పేలాల్సిందే: అజ్ఞాతవాసిలో మరో అజ్ఞాతవాసి.. ఊహించని గెటప్‌లో


 సంక్రాంతికి 'వెంకీ సీన్స్':

సంక్రాంతికి 'వెంకీ సీన్స్':

వెంకీ సీన్స్ తొలగించి తప్పు చేశామనుకున్నారో.. మరేమో తెలియదు గానీ మొత్తానికి సినిమాలో మళ్లీ ఆ సీన్స్ చేర్చబోతున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ప్రకటించడమే కాదు.. ఓ ఫన్నీ వీడియోను కూడా విడుదల చేసింది.


ఫన్నీ వీడియో:

ఫన్నీ వీడియో:

'అజ్ఞాతవాసి' టీమ్ తాజాగా విడుదల చేసిన వీడియో అభిమానులను ఆకట్టుకునేలా ఉంది. వీడియోలో పవన్‌.. వెంకీని ఉద్దేశిస్తూ.. 'గురువు గారూ..' అని పిలుస్తారు. వెంటనే 'గారు అక్కర్లేదమ్మా.. గురువు చాలు' అంటూ తనదైన టైమింగ్‌తో ఫన్నీగా బదులిస్తాడు వెంకీ.


 పవన్-వెంకీ కామెడీ ట్రాక్:

పవన్-వెంకీ కామెడీ ట్రాక్:

ఇక పవన్ 'నాకు కొంచెం తిక్కుంది..' అని డైలాగ్ అందుకోగానే.. మధ్యలో వెంకీ అందుకున్నారు. 'కానీ దానికో లెక్కుంది..' అంటూ ముగించారు. వీడియో చూస్తుంటే అభిమానులను ఆకట్టుకునే జోక్స్ ఇందులో చాలానే ఉన్నట్లున్నాయి.


 వెంకీ గట్టెక్కిస్తాడా?

వెంకీ గట్టెక్కిస్తాడా?

డివైడ్ టాక్ తో ఢీలా పడ్డ 'అజ్ఞాతవాసి'ని వెంకీ కామెడీ ట్రాక్ ఎంతమేర గట్టెక్కిస్తుందో చూడాలి. వెంకీ-పవన్ వీడియో అయితే రిలీజ్ చేశారు కానీ.. సినిమాలో వెంకీ సన్నివేశం ఎక్కడ చేరుస్తారనే దానిపై క్లారిటీ లేదు. ఏదేమైనా 'వెంకీ కామెడీ' తోడవుతుండటంతో 'అజ్ఞాతవాసి'పై అభిమానుల్లో కొంత ఉత్సాహం మొదలైంది.


ఓపెనింగ్స్ అదిరిపోయాయి:

డివైడ్ టాక్ వచ్చినప్పటికీ.. తొలి రోజు 'అజ్ఞాతవాసి' తెలుగు రాష్ట్రాల్లో రూ.29.36 కోట్ల షేర్ రాబట్టడం విశేషం. అలాగే ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.39.2 కోట్ల షేర్‌ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. బాహుబలి కాకుండా తొలిరోజు ఈ స్థాయిలో కలెక్షన్స్ వసూలు చేయడం ఈ సినిమాకే సాధ్యమైందంటున్నారు.


English summary
Agnyaathavasi team adding Venky's scenes to the film from sankranthi. Producers officially announced this on Friday.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X