twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Venkatesh: 'ఓరి దేవుడా'కు వెంకటేష్ షాకింగ్ రెమ్యునరేషన్.. కేవలం 5 రోజులకే అన్ని కోట్లా!

    |

    టాలీవుడ్ ఇండస్ట్రీలో తరచుగా రీమేక్ సినిమాలు ఎంటర్టైన్ చేసేందుకు వస్తాయి. ఇటీవల వచ్చిన చిరంజీవి గాడ్ ఫాదర్ తో పాటు భీమ్లా నాయక్, గబ్బర్ సింగ్, వకీల్ సాబ్, గోపాల గోపాల తదితర చిత్రాలన్నీ రీమేక్ మూవీసే. ఇప్పుడు మరోసారి అలరించేందుకు ఓరి దేవుడా రూపంలో సినిమా వచ్చింది. 2020 సంవత్సరంలో వచ్చిన ఓ మై కడువలే సినిమాకు రీమేక్ గా ఓరి దేవుడాను చిత్రీకరించారు. ఒరిజినల్ చిత్రానికి దర్శకత్వం వహించిన అశ్వథ్ మారిముత్తునే ఈ తెలుగు చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. ఇక ఈ మూవీలో దేవుడిగా విక్టరీ వెంకటేష్ నటించిన విషయం తెలిసిందే. అందుకోసం వెంకటేష్ తీసుకున్న పారితోషికం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

    దేవుడిగా వెంకటేష్..

    దేవుడిగా వెంకటేష్..

    రొమాంటిక్ అండ్ కామెడీ చిత్రంగా వచ్చిన తమిళ రీమేక్ చిత్రం ఓరి దేవుడా. మాస్ కా దాస్ విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్, ఆశా భట్ తదితరులు నటించిన ఈ చిత్రం అక్టోబర్ 21న చాలా గ్రాండ్ గా విడుదలైంది. రిలీజైన తొలి రోజు నుంచే సినిమా మంచి టాక్ తో దూసుకుపోతోంది. అశ్వథ్ మారిముత్తు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఫ్యామిలీ హీరో వెంకటేష్ దేవుడిగా నటించారు. అయితే తమిళ చిత్రం ఓమై కడువలేలో అశోక్ సెల్వన్, గురు ఫేమ్ రితికా సింగ్ జంటగా నటించగా.. దేవుడి పాత్రలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి అలరించారు. అయితే కిరీటం, ట్రెడిషనల్ గెటప్ లో కాకుండా ఈ మూవీలో వెంకటేష్ స్టైలిష్ లాయర్ గా కనిపించారు.

    హాట్ టాపిక్ గా పారితోషికం..

    హాట్ టాపిక్ గా పారితోషికం..

    ఈ సినిమాలో వెంకటేష్ తనదైన శైలీలో కామెడీ పండిచారు. ఇంతకుముందు గోపాల గోపాల చిత్రంలో వెంకటేష్ మనిషి పాత్రలో నటిస్తే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ దేవుడిగా నటించిన విషయం తెలిసిందే. సినిమాలో ఆయన క్యారెక్టర్ బాగానే పండింది. అయితే ప్రస్తుతం వెంకటేష్ అందుకున్న పారితోషికం తెలుగు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాకు ఆయనతొ మొత్తంగా కేవలం ఐదు రోజులు మాత్రమే షూటింగ్ చేశారట. ఈ 5 రోజుల సినిమా చిత్రీకరణ కోసం వెంకటేష్ రూ. 3 కోట్లు అందుకున్నారని సమాచారం. వెంకటేష్ పని చేసిన రోజులతో పోల్చి చూస్తే ఈ రెమ్యునరేషన్ ఎక్కువ అని టాక్ వినిపిస్తోంది.

    నాన్ థియేట్రికల్ రైట్స్ తోనే..

    నాన్ థియేట్రికల్ రైట్స్ తోనే..


    పీవీపీ సినిమాస్ నిర్మించిన ఓరి దేవుడా చిత్రానికి రూ. 10 కోట్లు బడ్జెట్ అయినట్లు తెలుస్తోంది. ఈ బడ్జెట్ మొత్తాన్ని ఓరి దేవుడా నాన్ థియేట్రికల్ రైట్స్ తోనే కవర్ అయిందని టాక్ కూడా వినిపిస్తోంది. అలాగే ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపుగా రూ. 6 కోట్ల వరకు జరిగినట్లు సమాచారం. దీంతో రూ. 6.5 కోట్ల షేర్ బ్రేక్ ఈవెన్ లక్ష్యంగా ఏర్పడింది. ఇక వెంకటేష్ సినిమాల విషయానికొస్తే.. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ తో కలిసి కిసి కా భాయ్ కిసి కా జాన్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీలో జగపతి బాబు ఓ కీరోల్ చేస్తున్నారు. ప్రస్తుతం వెంకటేష్ ముంబైలో ఉన్నట్లు సమాచారం.

    Read more about: venkatesh
    English summary
    Tollywood Senior Hero Venkatesh Took Rs. 3 Cr For Five Days Shooting of Vishwak Sen Ori Devuda Movie
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X