»   » వెంకటేష్ చూసి,మ్యాజిక్ అని మెచ్చుకున్నాడు

వెంకటేష్ చూసి,మ్యాజిక్ అని మెచ్చుకున్నాడు

Written By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: దీపావళి కానుకగా ప్రేక్షకులకు కనువిందు చేసేందుకు వచ్చిన 'ప్రేమ్‌' థియేటర్లలో అందరినీ ఎంతో అలరిస్తున్నాడని టాలీవుడ్‌ నటుడు విక్టరీ వెంకటేశ్‌ అన్నారు. సల్మాన్‌ ఖాన్‌, సోనమ్‌ కపూర్‌ జంటగా నటించిన 'ప్రేమ్‌ రతన్‌ ధన్‌పాయో' గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే.


ఈ సినిమాని చూసిన అనంతరం వెంకటేశ్‌ సల్మాన్‌కి, సోనమ్‌ కపూర్‌కి అభినందనలు తెలిపారు. ప్రేమ్‌ మరోసారి తన మనసుదోచుకునే అభినయంతో అలరించాడు. ప్రేమ్‌, మైథిలి మధ్య కెమిస్ట్రీ బాగా పండింది... దర్శకుడు సూరజ్‌కి అభినందనలు అంటూ తన సందేశాన్ని ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా పోస్ట్‌ చేశారు.

Watched Prema Rathan Dhan Payo... Our Prem strikes again with his magical performance. The chemistry between Prem and...

Posted by Venkatesh Daggubati on 12 November 2015

సల్మాన్‌ ఖాన్‌, సోనమ్‌ కపూర్‌ జంటగా రూపొందిన 'ప్రేమ్‌ రతన్‌ ధన్‌పాయో' ప్రపంచ వ్యాప్తంగా 5,300 థియేటర్లలో గురువారం విడుదలైంది. భారత్‌లోనే 4,500పైగా థియేటర్లలో, ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో 800 థియేటర్లలో చిత్రం విడుదలైంది. ఈ చిత్రాన్ని తెలుగులో 'ప్రేమలీల' పేరుతో విడుదల చేశారు. తెలుగులో సల్మాన్‌ఖాన్‌కు రామ్‌చరణ్‌ డబ్బింగ్‌ విశేషం.

సల్మాన్‌కు ప్రేమ్‌ పేరుతో అదృష్టం కలిసొచ్చింది. బర్జాత్యాతో చేసిన చిత్రాలతో పాటు కొన్ని ఇతర చిత్రాల్లోనూ సల్మాన్‌ పాత్రకు ప్రేమ్‌ పేరు పెట్టారు. అవి దాదాపు విజయం సాధించాయి. ఇప్పుడు 'ప్రేమ్‌ రతన్‌..'తో సల్మాన్‌ 12వ సారి ప్రేమ్‌గా కనిపించాడు.

ఈ చిత్రంలో సల్మాన్ ద్విపాత్రాభినయం చేస్తూ కనిపించారు. చిత్రానికి భారీ స్దాయిలో ఓపినింగ్స్ వచ్చాయి. అయితే తొంభైల నాటి చిత్రంలా ఉందని బాలీవుడ్ లో విమర్శలు వస్తున్నాయి. అయితే సినిమా మాత్రం పూర్తి స్ధాయి కలర్ ఫుల్ గా ఉందని చెప్తున్నారు. రాజశ్రీ వారి హీరోయిన్ గా సోనమ్ అందంగా కనిపించినా నటనలో మాత్రం ఆ స్దాయి కనపరచలేదని చెప్తున్నారు.

venkatesh2

ఈ చిత్రం పాకిస్థాన్‌లోనూ విడుదలైంది. తెలుగులో 'ప్రేమలీల', తమిళంలో 'మెయ్‌ మరన్‌దాయో అన్బే' పేరిట తీసుకొచ్చారు. అమెరికన్‌ రచయిత మార్క్‌ ట్వెయిన్‌ రాసిన 'ది ప్రిన్స్‌ అండ్‌ ది పాపర్‌' కథ ఆధారంగా దీన్ని తెరకెక్కించినట్లు సమాచారం.

సుమారు రూ.80 కోట్ల బడ్జెట్‌తో 'ప్రేమ్‌ రతన్‌ ధన్‌ పాయో'ను తెరకెక్కించారు. విడుదలకు ముందే సంగీతం, శాటిలైట్‌ హక్కుల అమ్మకం ద్వారా రూ.57 కోట్లు ఆదాయం వచ్చింది. హిమేష్‌ రేష్మియా స్వరపరిచిన గీతాలకు మంచి స్పందన వస్తోంది. సంగీతం హక్కుల ద్వారా వచ్చిన ఆదాయంలో ఇప్పటివరకు ఈ చిత్రానిదే రికార్డు.

English summary
Venkatesh Daggubati Shared in FB:"Watched Prema Rathan Dhan Payo... Our Prem strikes again with his magical performance. The chemistry between Prem and Maithili is lovely. Sooraj Barjatya did it again. Emotional ride all the way. Congratulations to the entire team."
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu