twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'దమ్ము' లో ఎన్టీఆర్ బావగా ఆ కామిడీ హీరో

    By Srikanya
    |

    ఎన్టీఆర్ తాజా చిత్రం దమ్ములో కాస్టింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుని ప్రతీ పాత్రకూ మంచి పేరున్న వారిని తీసుకుంటున్నారు. తాజాగా ఈ చిత్రంలో ఎన్టీఆర్ బావగా .. కామిడీ హీరో వేణును ఒకే చేసినట్టు తెలస్తుంది. స్వయంవరం, చిరునవ్వుతో సినిమాలతో ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్న వేణు ఇప్పుడు రామా చారి చిత్రంతో రెడీ అవుతున్నారు. రెగ్యులర్ గా హీరో వేషాలు లేని వేణు..ఇప్పుడు దమ్ముతో క్యారక్టర్ ఆర్టిస్ట్ గా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నారు. ఇక తాత క్యారక్టర్ కు కోట శ్రీనివాసరావు కన్ ఫార్మ్ అయ్యారని తెలుస్తుంది. ఎన్టీఆర్ తల్లిగా ఈ సినిమాలో భానుప్రియ నటిస్తుంది. త్రిష హీరోయిన్ గా కన్ ఫర్మ్ చేసారు. రెండో హీరోయిన్ గా రాధ కూతురు కార్తీక అని తెలుస్తుంది. తాజాగా ప్రస్తుతం దమ్ము సినిమా షూటింగ్ హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియో లో జరుగుతుంది. కె.ఎస్ రామారావు నిర్మాణంలో బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పక్కా మాస్ మసాలా మూవీగా తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నారు.

    ఈ సినిమాలో స్క్రిప్ట్ పై సుమారు సంవత్సరం పాటు బోయపాటి కృషి చేశారని చెప్తున్నారు.బాలకృష్ణతో గత సంవత్సరం 'సింహా"లాంటి విజయవంతమైన చిత్రాన్ని అందించిన తర్వాత బోయపాటి శ్రీను చేస్తోన్న ఈ చిత్రం పట్ల ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. పక్కా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా బోయపాటి శ్రీను తనదైన శైలిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడని చెప్తున్నారు. అలాగే ఈ చిత్రానికి 'దమ్ము" అనే టైటిల్‌ని త్వరలో అధికారికంగా ఖరారు చేయనున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని ఎన్టీఆర్ మీడియా సమావేశంలో ధృవీకరించారు. ఈ చిత్రానికి సంబంధించిన మరో షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది. మార్చిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి యం.యం.కీరవాణి సంగీతాన్నందిస్తున్నారు.

    English summary
    Venu has bagged a big film, albeit not as the main lead. The now crest-fallen actor will essay the role of NTR's brother-in-law in Boyapati Srinu Dammu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X