»   » నేను సినిమాల్లో కనిపించక పోవడానికి కారణం అదే: వేణు మాధవ్

నేను సినిమాల్లో కనిపించక పోవడానికి కారణం అదే: వేణు మాధవ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్లో స్టార్ కమెడియన్‌గా ఓ ఊపు ఊపిన వేణు మాధవ్... ఈ మధ్య వస్తున్న సినిమాల్లో అసలు కనిపించడమే. దానికి తోడు ఆయనకు రకరకాల రోగాలున్నాయని, ఆ మధ్య ఓ సారి చనిపోయాడని కూడా ప్రచారం జరిగింది. ఈ పరిణామాలపై వేణు మాధవ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు, సీఎం, గవర్నర్లకు కూడా కంప్లైంట్ చేసిన విషయం తెలిసిందే.

వేణు మాధవ్ చనిపోతే నేను ఎవర్ని? సాక్ష్యాలు చూపుతూ ఫైర్ (వీడియో)

తాజాగా ఓ ఇంటర్వ్యూలో వేణు మాధవ్ మాట్లాడుతూ... తాను ఈ మధ్య వస్తున్న సినిమాల్లో కనిపించక పోవడంపై, తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై, ప్రస్తుతం చేస్తున్న సినిమాలపై స్పందించారు.

కారణం అదే

కారణం అదే

తాను ఇప్పటి సినిమాల్లో పెద్దగా కనిపించక పోవడానికి కారణం.... మంచి పాత్రలు లేక పోవడమే అని, బూతు డైలాగ్‌లు ఉన్న కారణంగా కొన్ని సినిమాలను తాను పక్కనపెట్టానని, మరికొంత మంది తనను పక్కనపెట్టారని వేణు మాధవ్ తెలిపారు.

రచ్చ షూటింగ్ సమయంలో జరిగిన సంఘటన

రచ్చ షూటింగ్ సమయంలో జరిగిన సంఘటన

‘‘రచ్చ' షూటింగ్‌ సమయంలో వేరే షూటింగుకు కూడా కమిట్ అయ్యాను. రాత్రి భోజనం చేయకుండా ఓ సినిమా షూటింగ్‌కు వెళ్లి పని పూర్తి చేశాను. తర్వాతి రోజు ఉదయం టిఫిన్‌ కూడా చేయకుండా ‘రచ్చ' షూటింగులో పాల్గొన్నాను.. దాంతో ఒళ్లంతా వణుకుపుట్టి, కళ్లు తిరిగి పడిపోయాను. ఆసుపత్రిలో చేర్చారు. కానీ అనేక రోగాలున్నాయని ప్రచారం చేసారు. నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాట్లు వేణుమాధవ్ తెలిపారు.

చిరు, బాలయ్య కోసమే గుండు

చిరు, బాలయ్య కోసమే గుండు

చిరంజీవి ‘ఖైదీ నెం 150', బాలకృష్ణ 100వ మూవీ ‘గౌతమీపుత్ర శాతకర్ణి' హిట్‌ కావాలని తిరుపతి వెళ్లి గుండు కొట్టించుకున్నాను, ఈ రెండు సినిమాల్లోనూ నేను లేనని, వారిపై అభిమానంతోనే అలా చేసానని తెలిపారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కాటమరాయుడు, త్రివిక్రమ్‌ సినిమాలో నటిస్తున్నట్లు తెలిపారు.

వేణు మాధవ్ చనిపోతే నేను ఎవర్ని? సాక్ష్యాలు చూపుతూ ఫైర్ (వీడియో)

తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై వేణు మాధవ్ ఆ మధ్య కాస్త ఘాటుగానే స్పందించారు..... ఆ వీడియో కోసం క్లిక్ చేయండి.

English summary
Venu Madhav about nowadays movies. Venu Madhav is a comedy actor in Tollywood born near Kodad in the Nalgonda district of the erstwhile Andhra Pradesh state, now in Telangana. He has acted in many movies in Telugu, Tamil and Malayalam Languages.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more