»   »  చనిపోయినట్లు ప్రచారం: పోలీసులను ఆశ్రయించిన వేణు మాధవ్

చనిపోయినట్లు ప్రచారం: పోలీసులను ఆశ్రయించిన వేణు మాధవ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ తెలుగు కమెడియన్ వేణు మాధవ్ మంగళవారం తాను చనిపోయినట్లు జరుగుతున్న ప్రచారంపై పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఓ తెలుగు న్యూస్ ఛానల్ తో పాటు కొన్ని వెబ్ సైట్లలో తాను చనిపోయినట్లు ప్రచారం చేస్తుండటంతో షాకైన ఆయన పోలీసులకు ఫిర్యాదు చేసారు.

తనపై ఎవరో కుట్రపూరితంగా ఇలాంటి ప్రచారం చేస్తున్నారని.... నిజా నిజాలు నిర్దారించుకోకుండా ఈ విషయాన్ని కొన్ని ఛానల్స్ గుడ్డిగా ప్రచారం చేయడంపై ఆయన తీవ్ర అసహనంతో ఉన్నారు.

తాను చనిపోయినట్లు జరుగుతున్న ప్రచారం చూసి తీవ్రమైన మనో వేదనకు గురయ్యానని, ఇందుకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వేణు మాధవ్ పోలీసులను కోరారు.

Venu Madhav police complaint

సోషల్ మీడియా బాగా పాపులర్ అయిన తర్వాత..... ఇలాంటి విషయాలు చాలా స్పీడుగా స్ప్రెడ్ అవుతున్నాయి. కొందరు కావాలని ఇలాంటి తప్పుడు పోస్టులు చేయడం, నిజా నిజాలు నిర్దారించుకోకుండా అందరూ దాని షేర్ చేస్తుండటం లాంటివి చేస్తున్నారు.

రెండు రోజుల క్రితం తమిళ కమెడియన్ సెంథిల్ కూడా ఇలాంటి పరిస్థితే ఎదుర్కొన్నారు. తాను చనిపోయినట్లు మీడియాలో ప్రచారం జరుగడంతో షాకైన ఆయన మీడియా ముందుకు వచ్చి తాను బ్రతికే ఉన్నానని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇపుడు అలాంటి పరిస్థితే వేణు మాధవ్ కు ఎదురైంది.

Read more about: venu madhav tollywood
English summary
Tollywood comedian Venu Madhav police complaint about death rumors.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu