»   » డైరక్టర్ అవుతున్న తెలుగు కమిడియన్

డైరక్టర్ అవుతున్న తెలుగు కమిడియన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఆఫర్స్ లేక అవస్దలు పడుతున్న వేణు మాధవ్ తనను తాను నిరూపించుకోవటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు.ఆ మధ్యన ప్రేమాభిషేకం..వీడికి కాన్సర్ లేదు టైటిల్ తో చిత్రం నిర్మించిన వేణు మాధవ్ ఇప్పుడు దర్శకత్వంలోకి దూకబోతున్నట్లు సమాచారం.తన తోటి కమిడియన్స్ బిజీగా ఉంటూంటే తాను ఫేవడవుట్ అయిన లుక్ తో పరిశ్రమలో తిరగలేకే ఈ నిర్ణయానికి వచ్చినట్లు ఆయన సన్నిహితులు చెప్తున్నారు.అయితే నిర్మాతగా కాల్చుకున్న వేణు మాధవ్ అనవసరంగా డైరక్టర్ అయ్యి వచ్చే అడపా దడపా వేషాలను కూడా పోగొట్టుకునేలాగ ఉన్నాడని సీనియర్స్ అంటున్నారు.

ఇక హీరోగా వేణు మాధవ్ చేసిన భూకైలాస్,ప్రేమాభిషేకమే అతని కెరీర్ ని నాశనం చేసాయని,హీరోగా చేసాక వెనక్కి వెళ్ళి కమిడయన్ గా వేషాలు వేయటం కేవలం అలీకి మాత్రమే సాధ్యమైందని అంటున్నారు.వేణుమాదవ్ తానో స్టార్ హీరోగా ఊహించుకుని బిల్డప్ ఇవ్వటం వల్లనే స్టార్ హీరోలంతా అతన్ని తమ సినిమాల్లోలేకుండా ప్రక్కన పెట్టారని చెప్పుకుంటున్నారు.ఇక దర్శకత్వం కూడా చేసేస్తే దర్శకులకు కూడా విరోధమవుతాడని,హిట్ కాకపోతే ఇండస్ట్రీలో చాలా కష్టమని చెప్తున్నారు.అయినా వేణుమాధవ్ ఇవన్నీ లెక్క చేసే స్ధితిలో లేడంటున్నారు.

English summary
Venu Madhav is getting too big for his boots. There is a complaint that he is troubling small producers when it comes to the dubbing work. With Bhukailas getting him more popularity, Venu Madhav is supposed to be acting 'big' in the industry.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu