»   »  వేణు తొట్టెంపూడి దీపావళి

వేణు తొట్టెంపూడి దీపావళి

Posted By:
Subscribe to Filmibeat Telugu
వేణు హీరోగా ఎఎఎ పతాకంపై హరిబాబు దర్శకత్వంలో దీపావళి సినిమా గురువారం ప్రారంభమయింది. ఈ సినిమా హైదరబాద్ లోని యాత్రీ నివాస్ లో వేణు తొట్టెంపూడి కెమరా స్విచాన్ చేయగా ప్రారంభమయింది. హీరోగా వేణుకు ఇది 20వ చిత్రం కాగా ఈ చిత్రం వినోద భరితంగా సాగుతుందని నిర్మాత కృపాకర్ రెడ్డి ఈ సందర్భంగా చెప్పారు. ఈ సినిమాలో హీరోయిన్ గా మేఘా నాయర్ అనే కొత్త అమ్మాయి చేస్తుండగా ఆర్తీ అగర్వాల్ మరో హీరోయిన్ గా చేస్తోంది. సంగీతం రమణ ఓగేటి అందిస్తున్నారు. భానుచందర్, వినోద్ కుమార్, చలపతిరావు, బ్రహ్మనందం, ఆలీ, సత్యప్రకాష్, బ్రహ్మాజీ, జీవా, గుండు హనుమంతరావు, కొండవలస, ప్రభు, అనంత్, ఉమాచౌదరి తదితరులు నటిస్తున్నారు.

Read more about: venu deepavali
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X