»   » చెప్పుతో కొట్టేదాన్ని, వ్యభిచారి కంటే చండాలం: శ్రీరెడ్డిపై సీనియర్ నటి ఫైర్

చెప్పుతో కొట్టేదాన్ని, వ్యభిచారి కంటే చండాలం: శ్రీరెడ్డిపై సీనియర్ నటి ఫైర్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Veteran Actress Jayasheela Fires On Sri Reddy

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ముందు అర్దనగ్న ప్రదర్శనకు దిగిన నటి శ్రీరెడ్డిపై ఇండస్ట్రీలోని అన్ని వర్గాల నుండి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఆమె చేసిన పనిని అందరూ ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. ఆమెది దిగజారుడు చర్యగా అభివర్ణిస్తున్నారు. ప్రముఖ సినీయర్ తెలుగు నటి జయశీల శ్రీరెడ్డిపై మండి పడ్డారు. ఆడదంటేనే అసహ్యం వేసేలా ఆమె ప్రవర్తించిందని జయశీల ఫైర్ అయ్యారు.

 మాకు సినిమా అంటే దైవం

మాకు సినిమా అంటే దైవం

టాలీవుడ్లో మేము వచ్చిన సమయంలో మాకు సినిమా అంటే దైవం. కళామతల్లిగా ఇండస్ట్రీని ఆరాధించాము. దర్శకుడిని తండ్రిగా, నిర్మాతను తల్లిగా భావించాము. శ్రీరెడ్డి చెప్పినట్లు ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ జరుగలేదు... అని జయశీల తెలిపారు.

 తెలుగు వారు ఎందుకు ఊరుకుంటున్నారు?

తెలుగు వారు ఎందుకు ఊరుకుంటున్నారు?

అసలు ఎవరండీ ఈ శ్రీరెడ్డి.. ఎప్పుడొచ్చింది ఇండస్ట్రీకి.. ఆ అమ్మాయి ముఖం మేము ఎప్పుడూ చూడలేదు. ఈ మధ్య పది రోజులుగా శ్రీరెడ్డి అంటూ హడావుడి జరుగుతోంది. నిన్న అర్ద నగ్నంగా కూర్చుంది. ఆమె అలా చేస్తుంటే తెలుగు వారంతా ఎందుకు ఊరుకున్నారో నాకు అర్థం కాలేదు... అని జయశీల అసహనం వ్యక్తం చేశారు.

లాగి చెప్పిచ్చుకుని కొట్టేదాన్ని

లాగి చెప్పిచ్చుకుని కొట్టేదాన్ని

నిన్న ఆ దారిలో వెళుతుంటే షూటింగ్ అనుకున్నాను.... శ్రీరెడ్డి ఇలా చేస్తుందని తెలిసి ఉంటే లాగి చెప్పిచ్చుకుని కొట్టేదాన్ని. అలా కూర్చోవడం ఏమిటి? అసలు ఆమె వయసు ఎంత? పుట్టు పూర్వోత్తరాలు ఏమిటి? సినిమా ఫీల్డుకు ఎప్పుడు వచ్చిందో కూడా తెలియదు. అందరినీ బయటకు తీస్తోంది. ఇండస్ట్రీ అంటే ఏమనుకుంటోంది? ఇండస్ట్రీ అంటే కళామతల్లి, తెలుగు తల్లి, మన అమ్మ... అమ్మ బిడ్డలను అలా చేస్తుందా? ఏం మాట్లాడుతోంది. ఛీ ఛీ ఆడదంటేనే అసహ్యం వేసేలా చేస్తోంది.... అని జయశీల అన్నారు.

 ఆమెకు వేషాలు ఇస్తే తెలుగు జాతికే అవమానం

ఆమెకు వేషాలు ఇస్తే తెలుగు జాతికే అవమానం

చక్కగా కుటుంబాలు చూసుకుంటున్న డైరెక్టర్ల పేర్లను తీసుకొచ్చింది, వాళ్ల ఫ్యామిలీకి రేపు ఏదైనా అయితే ఎవరు బాధ్యులు? ఆమెకేమైనా మెంటలా? దీని వల్ల పబ్లిసిటీ వచ్చేసి వేషాలు వచ్చేస్తాయనే ఆలోచనా? ఆమెకు ఎవరైనా వేషాలు ఇస్తే తెలుగు జాతికే అవమానం... అని జయశీల ఆగ్రహం వ్యక్తం చేశారు.

 నువ్వు ఏదో చూపించి ఉంటావ్, అందుకే పిలుస్తున్నారేమో?

నువ్వు ఏదో చూపించి ఉంటావ్, అందుకే పిలుస్తున్నారేమో?

అవకాశాలు రావాలంటే నువ్వు కష్టపడు, టాలెంటుతో సంపాదించు, నాలుగు సినిమా ఆఫీసులకు వెళ్లి నా పరిస్థితి ఇది, నాకు వేషం ఇవ్వండి, తెలుగు వారిని ఎందుకు తక్కువ చేస్తున్నారు? తెలుగు వారు అనే అభిమానంతో మంచి వేషాలు ఇవ్వండి అని అడగాలే కానీ.... ప్రొడ్యూసర్ అన్నాడు, డైరెక్టర్ అన్నాడు, వాడు పిలిచాడు, వీడు పిలిచాడు... నీలో తప్పుంటేనే కదా పిలుస్తారు. నువ్వు ఏదో చూపించి ఉంటావ్, అందుకే నిన్ను పిలుస్తున్నారేమో? అందరూ అలా అంటే ఊరుకుంటారా? చెప్పుతెగిపోద్ది.... అంటూ శ్రీరెడ్డిపై జయశీల ఫైర్ అయ్యారు.

 వ్యభిచారికంటే చండాలంగా...

వ్యభిచారికంటే చండాలంగా...

శ్రీరెడ్డి పేరు వింటేనే అసహ్యం వేస్తోంది. పచ్చిగా చెప్పాలంటే వ్యభిచారి కూడా తన కడుపుకోసమో, పిల్లలను పోషించుకోవడానికి చేస్తుందే తప్ప ఇలా పబ్లిగ్గా ఎవరికీ తన దేహాన్ని చూపించుకోదు. ఈ అమ్మాయి వ్యభిచారం కంటే చాలా చండాలంగా పబ్లిక్‌లో నగ్నంగా నిలుచుంది. ఇలా చేస్తే వేషాలు ఇవ్వక పోగా ఆమె మొహం ఎవరూ చూడటానికి కూడా ఇష్టపడరు.... అని జయశీల అన్నారు.

 అక్కడైతే కోసి ఉప్పు కారం పెడతారు

అక్కడైతే కోసి ఉప్పు కారం పెడతారు

ఇదే సంఘటన చెన్నైలో జరిగిందంటే ముక్కలు ముక్కలుగా కోసి ఉప్పు కారం పెడతారు. అక్కడి ఆడియన్స్ అస్సలు ఒప్పుకోరు. వేషాలు రావాలంటే ఈ పద్దతిలో వెళ్లాలా? కష్టపడాలి, టాలెంటు ఉండాలి. దాంతో పాటు అదృష్టం కూడా ఉండాలి. అంతే కానీ పడుకుంటే వేషాలు వస్తాయని అసహ్యంగా చెప్పడం ఆమోదించదగ్గ విషయం కాదు అని జయశీల అన్నారు.

English summary
Veteran Actress Jayasheela fire on Sri Reddynude show behaviour. After this incident The MAA (Movie Artistes Association) has made it clear that it will not accept the membership application of actress Sri Reddy, and also said actors who work with her will be suspended from the association.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X