»   » ప్రముఖ గేయ రచయిత వాలి కన్నుమూత

ప్రముఖ గేయ రచయిత వాలి కన్నుమూత

Posted By:
Subscribe to Filmibeat Telugu
Veteran lyricist Vaali died
చెన్నై : ప్రముఖ చలన చిత్ర గేయ రచయిత వాలి(81) గురువారం మరణించారు. గత కొంత కాలంగా శ్వాస సంబంధిత సమస్యతో తీవ్రంగా బాధపడుతున్న ఆయన్నుఇటీవల చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆయన ఈ రోజు తుది శ్వాస విడిచారు.

మంగళవారం రాత్రి ఆయన పరిస్థితి విషమించింది. దీంతో ఆయనను అత్యవసర చికిత్సా విభాగానికి బదిలీ చేశారు. వెంటిలేటర్ మీద ఆయనకు శ్వాస అందిస్తున్నారు. అయినా ఫలితం లేకపోయింది. ఈ విషయం తెలుసుకున్న ప్రముఖ సినీనటుడు కమలహాసన్‌, సంగీత దర్శకుడు ఏఆర్‌.రహ్మాన్‌లతో పాటు వాలి బంధువులు, సినీ ప్రముఖులు బుధవారం ఆస్పత్రికి చేరుకొని వాలిని పరామర్శించారు. డాక్టర్లు ఎంత ప్రయత్నించినప్పటికీ ఆయన ప్రాణాలు నిలువలేదు.

దాదాపు ఐదు దశాబ్దాలుగా సినీ రంగంలో కొనసాగుతున్న ఆయన ఇప్పటి వరకు పది వేలకు పైగా పాటలు రాసారు. తమిళ సినీ పరిశ్రమలో వాలి పాటలకు ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. గడిచిన ఐదు దశాబ్దాలుగా ఆయన చిత్ర పరిశ్రమకు ఆణిముత్యాలు లాంటి పాటలతో సేవలు అందిస్తూనే ఉన్నారు. ఆయనకు భారత ప్రభుత్వం పద్మ భూషణ్ అవార్డుతో సన్మానించింది.

English summary
Veteran poet and lyricist Vaali, who has been undergoing treatment in a private hospital in Chennai, died on Thursday. Vaali's health condition deteriorated further in the last few days and was kept on a ventilator and breathed his last on Thursday.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu