»   » రామానాయుడు అనారోగ్యంపై వెంకటేష్ స్పందన

రామానాయుడు అనారోగ్యంపై వెంకటేష్ స్పందన

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద: ప్రముఖ తెలుగు నిర్మాత, మూవీ మోఘల్ డి.రామానాయుడు క్యాన్సర్‌తో బాధ పడుతున్నట్లు గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై ఆయన తనయుడు వెంకటేష్ స్పందిస్తూ నాన్నకు ఇపుడు బాగానే ఉంది. ఆయన మనసంతా సినిమాలపైనే ఉంది. వైజాగ్ లో స్టూడియో డెవలప్ చేసే విషయమై ఆయన ప్రతి రోజు అన్నయ్యతో మాట్లాడుతుంటారు' అని ఆంగ్ల పత్రికకు వివరించారు.

Veteran Producer Ramanaidu Ill

రామానాయుడికి 13 ఏళ్ల క్రితం ప్రొస్టేట్ క్యాన్సర్ సోకినట్లు తెలుస్తోంది. అప్పట్లో ఆయన చికిత్స తీసుకున్నారు. అయితే ఇపుడు మళ్లీ సమస్య ఏర్పడిందని తెలుస్తోంది. ఇంగ్లీషు మందులతో శరీరంపై తీవ్రమైన ప్రభావం పడుతుండటంతో హోమియో, ఆయుర్వేద చికిత్స వైపు ఆయన కుటుంబ సభ్యులు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

కాగా....రామానాయుడుకి ప్రముఖ తెలుగు నటుడు, డాక్టర్ రాజశేఖర్ ఆధ్వర్యంలో వైద్య చికిత్సలు జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంలో నిజా నిజాలు తెలియాల్సి ఉంది.

English summary
Veteran producer, Daggubati patriarch, founder of grand old Suresh Productions Ramanaidu is said to be fallen sick.
Please Wait while comments are loading...