»   » సినిమాని మాట్లాడించిన కలం ఆగిపోయింది :మాటల రచయిత కన్నుమూత

సినిమాని మాట్లాడించిన కలం ఆగిపోయింది :మాటల రచయిత కన్నుమూత

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఎంజీఆర్‌ నటించిన 16 చిత్రాలకు మాటలు రాసిన సీనియర్‌ రచయిత ఆర్‌కే.షణ్ముగం మంగళవారం రాత్రి కన్నుమూశారు. సీనియర్ రైటర్ ఆర్కే షణ్ముగం స్థానిక లాయిడ్స్‌రోడ్డులోని ఆయన నివాసగృహంలో మంగళవారం రాత్రి గుండెపోటుకు గురై మృతి చెందారు. ఆయన వయస్సు 87 సంవత్సరాలు.

ఎంజీఆర్‌ నటించిన ఆయిరత్తిల్‌ ఒరువన్‌, ముగరాశి, నినైత్తదై ముడిప్పవన్‌, సిరిత్తువాళవేండుమ్‌, రహస్యపోలీసు 115, పల్లాండు వాళగ వంటి హిట్‌ చిత్రాలకు ఆయన సంభాషణలు సమకూర్చారు. ఎంజీఆర్‌ చిత్రాలకు ఆస్థాన సంభాషణల రచయితగా పేరుగడించారు. శివాజీగణేశన్‌ నటించిన కప్పలోట్టియ తమిళన్‌ వంటి పలు చిత్రాలకు కూడా ఆయన సంభాషణలు అందించారు.

Veteran Script and dialogue writer R.K Shanmugam passes away

1980లో ఎంజీఆర్‌ చేతుల మీదుగా కళైమామణి అవార్డు కూడా అందుకున్నారు. ఎంజీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే షణ్ముగంకు లాయిడ్స్‌రోడ్డులోని ప్రభుత్వ క్వార్టర్స్‌లో ఓ ప్లాట్‌ను ఉచితంగా అందజేశారు. అక్కడే తన రిటైర్డ్ జీవితాన్ని గడిపిన ఈ తమిళ లెజెండరీ రచయిత కన్నుమూత తమిళ ఇండస్ట్రీలోని ప్రముఖులనీ, ఆయనతో అనుబందం ఉన్న నటులనీ దుఖం లో ముంచింది.

English summary
Veteran Script and dialogue writer R.K Shanmugam had been part of many iconic movies with the yesteryear stalwarts of Tamil film industry M.G.Ramachandran and Shivaji Ganesan. Shanmugam passed away due to a heart attack on Tuesday. He was 87
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu