twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎస్ జానకి రిటైర్మెంట్: 28న మానసగంగోత్రిలో చివరి కచేరి

    ప్రముఖ సినీ నేపథ్య గాయని ఎస్ జానకి రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ నెల 28న చివరి కచేరి నిర్వహించనున్నారు. దాదాపు 65 ఏళ్ల పాటు జానకి తనకెరీర్ కొనసాగించారు. ఇప్పటి వరకు దాదాపు 50 వేలకుపైగా పాటలు పాడారు.

    By Bojja Kumar
    |

    నేపథ్య గాయనిగా దాదాపు 65 ఏళ్ల ప్రస్థానం, దాదాపు 50,000 పాటలు.... తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ, జర్మనీ, లాటిన్‌, జపనీస్‌, పంజాబీ పాటలు పాడిన అనుభవం. ఉత్తమ గాయనిగా 4 సార్లు జాతీయ పురస్కారం, 31 సార్లు వివిధ రాష్ట్రాల పురస్కారాలు.... ఇలా చెప్పుకుంటూ పోతే ప్రముఖ గాయని ఎస్. జానకి గురించి చాలా విషయాలే ఉన్నాయి.

    దాదాపు 65 సంవత్సరాల పాటు కెరీర్ కొనసాగించిన ఎస్ జానకి రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ నెల 28న మైసూలో ఆమె చివరి కచేరి జరుగనుంది. ఎస్.జానకి రిటైర్మెంట్ వేడుకలా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

    మానసగంగోత్రి మైదానంలో...

    మానసగంగోత్రి మైదానంలో...

    65 ఏళ్ల క్రితం మైసూరులో పాటలు పాడటం ప్రారంభించానని... తన చివరి కచేరిని కూడా అక్కడే ఇచ్చి, విశ్రాంతి తీసుకుంటానని చెప్పారు. ఈ నెల 28న మానసగంగోత్రి మైదానంలో తన చివరి కచేరి జరుగుతుందని ఎస్. జానకి మీడియాకు తెలిపారు.

    వయసు సహకరించకపోవడం వల్లే

    వయసు సహకరించకపోవడం వల్లే

    వయసు పెరుగుతుంటే పాడటం చాలా కష్టంగా మారిందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని ఎస్ జానకి తెలిపారు.

    ఎస్ జానకి గురించి..

    ఎస్ జానకి గురించి..

    జానకి గుంటూరు జిల్లా, రేపల్లె తాలూకా, పల్లపట్ల గ్రామములో శ్రీరామమూర్తి, సత్యవతి దంపతులకు జన్మించింది. జానకి తండ్రి శ్రీరామమూర్తి ఉపాధ్యాయుడు, ఆయుర్వేద వైద్యుడు. ఉద్యోగ రీత్యా ఈయన కరీంనగర్‌ జిల్లాలోని సిరిసిల్లలో ఉండేవాడు. చిన్నతనం నుంచి జానకి సంగీతం పట్ల ఎంతో మక్కువ చూపేది. తన మూడవ ఏట నుంచే అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం మొదలు పెట్టింది.

    ఎస్ జానకి సినీ ప్రస్తానం

    ఎస్ జానకి సినీ ప్రస్తానం

    నాదస్వరం విద్వాన్ పైడిస్వామి వద్ద సంగీతం నేర్చుకున్న జానకి తన 19వ ఏట మామయ్య సలహా మేరకు, చెన్నైలోని ఏవీయం స్టూడియోలో పాడటం ఆరంభించిన జానకి మద్రాసుకు మారింది. తొలినాళ్లలో ఏవీయం స్టూడియో గాయనిగా ఉండి, 1957లో టి.చలపతిరావు సంగీత దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం విధియిన్‌ విలాయత్తులో తన గాత్రాన్ని అందించడంలో సినీ ప్రస్థానం మొదలయ్యింది

     ఫ్యామిలీ

    ఫ్యామిలీ

    జానకి వి.రామ్‌ప్రసాద్‌ను వివాహమాడి చెన్నైలో స్థిరపడ్డారు. రామ్‌ప్రసాద్‌ 1990 లలో మరణించారు. ఈమెకు మురళీకృష్ణ అనే కుమారుడు ఉన్నారు.

    English summary
    Veteran Singer S Janaki Announces Her Retirement. Janaki said the final concert will be held in Manasagangotri Ground, Mysore on October 28.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X