»   » ప్రముఖ సిని నటి కనకం కన్నుమూత

ప్రముఖ సిని నటి కనకం కన్నుమూత

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ప్రముఖ సినీనటి కనకం కన్నుమూశారు. ఆమె కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, కృష్ణ, శోభన్‌బాబు సినిమాల్లో కనకం నటించారు. గృహప్రవేశం, గుణసుందరి కథ, కీలుగుర్రం, రక్షారేఖ, షావుకారు, పాతాళభైరవి, దాసి, లేత మనసులు, భక్త ప్రహ్లాద తదితర సినిమాల్లో కనకం నటించారు. కనకం మృతి పట్ల సినీరంగం దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. వన్ ఇండియా తెలుగు నివాళులు అర్పిస్తోంది.

టి.కనకం గా ప్రసిద్ధిచెందిన తెలుగు కనకం అలనాటి ప్రముఖ తెలుగు చలచిత్ర హాస్యనటి. చిత్రాలలో నటించకముందు ఆమె రంగస్థల నటి, ఆ తర్వాత కూడా నాటక ప్రదర్శనలిచ్చింది. ఆమె గాయని కూడా. ఈమె విజయవాడలో 1930లో అప్పారావు, సోళాపురమ్మ దంపతులకు కనకం జన్మించారు. 20.07.2015 రోజున మృతి చెందింది.

Veteran Telugu actress Kanakam passes away

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

కనకం జీవిత విశేషాలు...

ఆమె చిన్ననాటనే తండ్రి ఉద్యోగరీత్యా విజయవాడ వచ్చి స్థిరపడ్డారు. పురుషులే స్త్రీ పాత్రలను రంగస్థలం మీద అభినయించే ఆనాటి కాలంలో బళ్లారి రాఘవలాంటి మహానటులిచ్చిన ప్రోత్సాహంతో కొద్దిమంది నటీమణులు ముందుకొచ్చారు. అలాంటి వారిలో పురుషులతో సమానంగా పాటలూ, పద్యాలూ పాడి నిలిచిన కొద్దిమంది నటీనటులలో కనకం ఒకరు.

ఆ తర్వాత..

1948లో మద్రాసు ఆలిండియా రేడియో కనకం పాడిన జానపద గేయాలను ప్రసారం చేసి; శ్రోతలను రంజింపజేసింది. కీలుగుర్రం (1949), గుణసుందరి కథ (1949), షావుకారు (1950)లోని పాత్రలు ఆమెకు మంచి పేరును తెచ్చిపెట్టాయి. షావుకారు చిత్రంలో చాకలి రామి పాత్రను కనకం ధరించారామె. ఒక ప్రక్క చిత్రాలలో నటిస్తూనే మరోపక్క నాటకాల్లో కూడా పాత్రలు ధరించింది.

నాటకాలలో....

ఆమె కురుక్షేత్రం నాటకంలో కృష్ణ పాత్రను, పాండావోద్యోగంలో అర్జునుడు, కృష్ణ పాత్రలను, కృష్ణ తులాభారంలో నారదుడు, కృష్ణ పాత్రలను, రామాంజనేయ యుద్ధంలో రాముడి పాత్రను, చింతామణి నాటకంలో చింతామణి పాత్రను మరెన్నో ఇతర నాటకాలలో ఎన్నో ముఖ్యమైన పాత్రలను పోషించి ప్రేక్షకులను మెప్పించింది.

ఈమె నటకరంగంలో ప్రసిద్ధులైన పీసపాటి, షణ్ముఖి ఆంజనేయరాజు, రఘురామయ్య, నల్లా రామమూర్తి, రేలంగి వెంకట్రామయ్య, మాధవపెద్ది సత్యం మొదలైన వారందరి కలిసి నటించింది.

అవకాశాలు బాగా ఉన్న రోజుల్లో ఆమె విలాసవంతమైన జీవితం గడిపిన ఆమె .... తర్వాత అవకాశాలు తగ్గడంతో దుర్భరమైన జీవితం గడపవలసి వచ్చింది. ప్రస్తుతం ఆమె విజయవాడలో నివాసం ఉంటున్నారు.నాటకరంగంలో చేసిన కృషికిగాను తంగిరాల కృష్ణప్రసాద్ మెమోరియల్ అవార్డ్‌ను 2014లో లభించింది.

English summary
Veteran Telugu actress T Kanakam passed away in the early hours of Tuesday in Vijayawada.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu