twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'గోపాల గోపాల' నిషేదించాలి: సెన్సార్ బోర్డుతో గొడవ

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, విక్టరీ వెంకటేష్ కాంబినేషనల్లో తెరకెక్కుతున్న ‘గోపాల గోపాల' చిత్రం ఈ సంక్రాంతికి విడుదలవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈచిత్రంపై విశ్వహిందూ పరిషత్ వారు సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు చేసారు. ఈ సినిమా పోస్టర్లు హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఫిర్యాదు చేసారు. ఈ సినిమాను నిషేదించాలంటూ సెన్సార్ బోర్డుతో విహెచ్ పి సభ్యులు వాగ్వివాదానికి దిగారు. ఈ సినిమాపై ఆందోళన కార్యక్రమాలు చేపట్టడానికి విహెచ్‌పి కార్యకర్తలు సిద్దమయ్యారు.

    జనవరి 14న సంక్రాంతి సందర్భంగా సినిమాను భారీ ఎత్తున విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బాలీవుడ్‌లో ఘనవిజయం సాధించిన 'ఓ మై గాడ్‌' చిత్రానికి రీమేక్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి కిషోర్‌కుమార్‌ పార్థసాని(డాలీ) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం నైజాం రైట్స్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు దక్కించుకున్నారు. ఎన్ఆర్ఏ బేసిస్ కింద రూ. 13.4 కోట్లకు ఆయన ఈ చిత్రాన్ని దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

    VHP complains against 'Gopala Gopala'

    అనూప్‌ రూబెన్స్‌ స్వరాలందిస్తున్నారు. శ్రియ హీరోయిన్. సురేష్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై సురేష్‌బాబు, శరత్‌మరార్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవుడంటే నమ్మకం లేని వ్యక్తి(వెంకటేష్) దుకాణం నడుపుతంటాడు. అందులో అమ్మేవేమిటో తెలుసా? దేవుడి బొమ్మలే! మాట్లాడితే దేవుడి అస్థిత్వాన్ని ప్రశ్నిస్తుంటాడు. అలాంటిది అతడి దుకాణం భూకంపం దాటికి నేలకూలియింది. అప్పుడు అతడేం చేశాడు? అనే అంశం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'గోపాల గోపాల'. వెంకటేష్‌, పవన్‌ కల్యాణ్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వెంకటేష్‌ సరసన శ్రియ నటిస్తోంది.

    English summary
    Taking serious note of denigration of Hindu deities and religious symbols, Vishwa Hindu Parishad(VHP) today demanded complete ban on screening of Film ‘Oh My God’.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X