»   » అదిరింది గురూ...అంటున్నారు, మీరు చూసారా (వీడియో)

అదిరింది గురూ...అంటున్నారు, మీరు చూసారా (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

వెంకటేష్‌ కెరీర్‌లో హిట్లు కొట్టిన చిత్రాల్ని లెక్క వేస్తే అందులో రీమేక్‌ కథలే ఎక్కువ ఉంటాయి. రీమేక్‌ కథల రారాజుగా పేరు తెచ్చుకున్న వెంకీ..దృష్టి బాలీవుడ్‌ చిత్రం 'సాలా ఖడూస్‌'పై పడింది. ఈ చిత్రాన్ని తెలుగులో 'గురు' పేరుతో విడుదల చేస్తున్నారు. 'గురు'లో వెంకీ లుక్‌ ఇది వరకే బయటకు వచ్చింది.

ఇప్పుడు దీపావళి సందర్భంగా మరో లుక్‌ని బయటపెట్టారు. ఇటీవలే పట్టాలెక్కిన ఈ చిత్రం షూటింగ్‌ చక చక సాగుతోంది. డిసెంబరులోగా ఈ చిత్రాన్ని సిద్ధం చేయాలని చిత్ర యూనిట్ ప్రణాళికలు రచించింది. తెలుగులో వెంకీ శైలికి తగ్గట్టు కొన్ని మార్పులు చేశామని, హిందీ సినిమా చూసిన వాళ్లకూ 'గురు' కొత్తగా కనిపిస్తాడని దర్శక,నిర్మాతలు చెప్తున్నారు.

English summary
Guru is the upcoming Telugu film written and directed by Sudha Kongara Prasad which features Daggubati Venkatesh in the lead role and Ritika Singh will be seen in a crucial role in Guru. It is an official remake of director’s own Tamil film Irudhi Suttru. Venkatesh will be seen as a boxer in the movie and his rugged look has been the talk of the T-Town.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu