»   » మహేష్ వీరాభిమానులు రచ్చ రచ్చ ఇలా...(వీడియో)

మహేష్ వీరాభిమానులు రచ్చ రచ్చ ఇలా...(వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ హీరోలకు డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్న సంగతి తెలిసిందే. వారు తమ అభిమానాన్ని రకరకాల విధానాల్లో తెలియచేస్తూంటారు. ముఖ్యంగా సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత వీరు అభిమానాన్ని వ్యక్తం చేయటానికి ఓ వేదిక దొరికినట్లైంది. ఆ మధ్యన పవన్ అభిమానులు ఓ వీడియోని రిలీజ్ చేసినట్లుగానే ఇప్పుడు మహేష్ వీరాభిమానులు కొందరు తమ హీరోని ఉద్దేశించి ఓ ప్రత్యేక వీడియోని విడుదల చేసారు. మహేష్ ని పొడుగుతూ చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో సంచలనం క్రియేట్ చేస్తోంది. ఆ వీడియోని మీరు ఇక్కడ చూడవచ్చు.


మహేష్ తాజా చిత్రం విశేషాలకు వస్తే...

మహేష్ బాబు - ‘మిర్చి' ఫేం కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాలు మరియు రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. తాజాగా ఈ చిత్ర టీం యాక్షన్ ఎపిసోడ్ షూట్ లో బిజీగా ఉన్నారు. మహేష్ బాబుపై వచ్చే ఈ యాక్షన్ ఎపిసోడ్ ని హైదరాబాద్ అవుట్ స్కర్ట్స్ లో షూట్ చేస్తున్నారు. ఫైట్‌ మాస్టర్‌ అనల్‌ అరసు నేతృత్వంలో మహేష్‌బాబు, ప్రతినాయక బృందంపై పోరాట సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఇక ఇటీవలే ఈ చిత్ర టీం రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసింది. ఈ సినిమాని జూలై 17న రిలీజ్ చెయ్యడానికి సన్నాహలు చేస్తున్నారు. కుటుంబ అనుబంధాల నేపథ్యంలో సాగే కథల్లో ఇట్టే ఇమిడిపోతారు మహేష్‌. 'మురారి', 'దూకుడు', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రాలతో ఆ విషయం రుజువైంది. అలా మరోసారి ఇంటిల్లిపాదినీ అలరించేలా ఓ చిత్రం చేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఆ చిత్రాన్ని మైత్రీ మూవీస్‌ సంస్థ నిర్మిస్తోంది.

Video: Fans special tribute to Mahesh

మహేష్‌ సరసన శ్రుతి హాసన్‌ హీరోయిన్ గా నటిస్తోంది. భారీ హంగులతో రూపొందుతున్న ఆ పోరాటాలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని చిత్రబృందం చెబుతోంది. శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. రాజేంద్ర ప్రసాద్‌, జగపతిబాబు, సుకన్య, అలీ, వెన్నెల కిషోర్‌, సితార, తులసి తదితరులు నటిస్తున్నారు.

ఇంకా టైటిల్ ఇంకా ఖరారు కాని ఈ సినిమాకి ‘శ్రీ మంతుడు' అనే వర్కింగ్ టైటిల్ ప్రచారంలో ఉంది. త్వరలోనే ఈ సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేయనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.మహేష్ బాబుతో మొదటి సారి శృతి హాసన్ జోడీ కట్టిన ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ఫ్రాన్స్ లో ఉంటుందని సమాచారం.

English summary
Recently, some hardcore fans of Superstar Mahesh Babu have gone a step ahead of all and came up with a superb video tribute. from Mahesh's
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu