»   » 14వేల అడుగుల ఎత్తు నుండి దూకిన రాశి ఖన్నా (వీడియో)

14వేల అడుగుల ఎత్తు నుండి దూకిన రాశి ఖన్నా (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్ రాశి ఖన్నా ఆట(అమెరికా తెలుగు అసోషియేషన్) వేడుకల్లో పాల్గొనేందుకు యూఎస్ఏ వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చికాగాల్లో ఉన్న ఆమె ఖాళీ సమయం దొరడంతో స్కై డైవింగుకు వెళ్లింది. రాశి ఖన్నా తన లైఫ్ అచీవ్మెంట్లలో ఒకటిగా పెట్టుకున్న లిస్టులో స్కైడైవింగ్ కూడా ఒకటి. ఇప్పటికి ఆ కోరిక తీరడంతో తన అనుభవాలను సోషల్ మీడియా అభిమానులతో పంచుకుంది.

రాశి ఖన్నా వాల్ పేపర్స్

తన స్కై డైవింగుకు సంబంధించిన వీడియోను రాశి ఖన్నా తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్టు చేసింది. 14000 అడుగుల ఎత్తు నుండి స్కై డైవింగ్ చేయడం ఎంతో ఎగ్జైటింగ్ గా ఉందని, చాలా హ్యాపీగా ఉందని రాశి ఖన్నా చెప్పుకొచ్చింది. ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

ఇటీవలే సుప్రీం మూవీతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న రాశి ఖన్నా...ప్రస్తుతం గోపీచంద్ హీరోగా తెరకెక్కుతున్న 'ఆక్సీజన్' సినిమాలో నటిస్తోంది. దీంతో పాటు రవితేజ హీరోగా తెరకెక్కే రాబిన్ హుడ్ అనే మరో సినిమాలో కూడా అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం.

English summary
Raashi Khanna had unlocked an achievement and its a green tick on sky diving from her bucket list. The actress, who wished to experience sky diving atleast once, had managed to do it in Chicago, during her trip to USA. Raashi was in USA to attend the ongoing Telugu NRI celebrations, ATA.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu