»   » భార్యతో కలిసి ఉదయ్ కిరణ్ పాట..(అరుదైన వీడియో)

భార్యతో కలిసి ఉదయ్ కిరణ్ పాట..(అరుదైన వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Video of Uday Kiran singing to his wife leaked
హైదరాబాద్: యంగ్ హీరో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య ఘటన తెలుగు సినిమా అభిమానులను దిగ్ర్భాంతికి గురి చేసిన సంగతి తెలిసిందే. కెరీర్ ప్రారంభంలోనే హాట్రిక్ విజయాలతో సినీ వినీలాకాశంలో తారా జువ్వలా ఎగిసిన ఉదయ్ కిరణ్....ఆ తర్వాత వరుస పరాజయాలతో వెనకబడిపోయాడు. ఈ క్రమంలో మానసికంగా కృంగిపోయి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

ఉదయ్ కిరణ్‌కు సంబంధించిన ఓ వీడియో ఇపుడు ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. భార్య విషిత, ఇతర కుటుంబ సభ్యులతో పాటపాడిన ఈ వీడియో ఇపుడు నెటిజన్లు ఆకట్టుకుంటోంది. ఈ వీడియో చూస్తూ పలువురు అభిమానులు ఉదయ్ కిరణ్ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు.

మరో వైపు ఉదయ్ కిరణ్ నటించిన ఆఖరి సినిమా విడుదలకు సిద్దమవుతోంది. ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన చివరి సినిమా 'చిత్రం చెప్పిన కథ'. 'నువ్వునేను' ఫేమ్ అనిత ప్రత్యేక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో డింపుల్, గరిమ, మదాలస శర్మ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. మున్నా చిత్ర నిర్మాత. మోహన్ ఏయల్లార్కే దర్శకుడు.

ఇటీవల ఈచిత్రం టీజర్ విడుదల చేసారు. ఈ నెల చివర్లో ఆడియో రిలీజ్ చేసి వచ్చే నెలలో విడుదలకు ప్లాన్ చేస్తున్నామని నిర్మాతలు తెలిపారు. ఈ సినిమా చక్కని ఎలిమెంట్స్ తో తెరకెక్కిన థ్రిల్లర్ మూవీ. మున్నాకాశీ సంగీతం ఇచ్చాడు అన్నారు. ఉదయ్ కిరణ్ మన అందరి మధ్య ఉన్నపుడు ఈ సినిమా విడుదలై ఉంటే కచ్చితంగా సినిమా హిట్టై అతనికి మంచి పేరు తీసుకొచ్చి ఉండేది నిర్శక నిర్మాతలు అంటున్నారు.

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/SZBjhJHPRXw?feature=player_detailpage" frameborder="0" allowfullscreen></iframe></center>

English summary
Video of Uday Kiran singing to his wife leaked. Recently released video shows the late actor, singing famous Hindi song, 'Kaun hai jo sapno main aya', and slyly serenading his wife, Vishita.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X