»   » షాకవుతారు: రామ్ చరణ్ భార్యలో ఇంత స్టామినా ఉందా?

షాకవుతారు: రామ్ చరణ్ భార్యలో ఇంత స్టామినా ఉందా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

కొణిదెల ఉపాసన... మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణిగా, అపోలో హాస్పటల్స్ డైరెక్టర్‌గా మాత్రమే తెలుసు. అపోలో డైరెక్టర్‌గా వృత్తి పరంగా ఆమె ఎంత కష్టపడుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎంతో సుకుమారంగా కనిపించే ఆమెలో మనకు కనిపించని మరో కోణం కూడా ఉంది.

రామ్ చరణ్ సినిమాల కోసం శారీరకంగా ఎంత కష్టపడతారో అందరికీ తెలిసిందే. పెళ్లికి ముందు బాడీ ఫిట్‌నెస్ మీద అంతగా శ్రద్ధ చూపని ఉపాసన పెళ్లి తర్వాత చెర్రీని చూసి చాలా ఇన్స్‌స్పైర్ అయ్యారు. ప్రస్తుతం ఆమె ఏ స్థాయికి చేరుకున్నారంటే... ఆమె చేస్తున్న స్టంట్స్ చూసి చెర్రీ ఫ్యాన్స్ షాకయ్యేంతలా...

మిస్టర్-సి‌తో సమానంగా స్ట్రాంగ్ అవుతా

మిస్టర్-సి‌తో సమానంగా స్ట్రాంగ్ అవుతా

మిస్టర్-సి(రామ్ చరణ్)కి ఏమాత్రం తీసిపోకుండా పిట్ అండ్ స్ట్రాంగ్ గా తయారయ్యేందకు తాను కష్టపడుతున్నట్లు ఉపాసన చెప్పుకొచ్చారు.

విమర్శకుల నోరు మూయించింది

విమర్శకుల నోరు మూయించింది

పెళ్లైన కొత్తలో ఉపాసన మీద చాలా మంది విమర్శలు చేశారు. అపుడు ఆమె శరీరాకృతి రామ్ చరణ్‌కు సెట్టయ్యేలా ఉండక పోవడమే కారణం. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ఉపాసన చాలా కష్టపడి మంచి ఫిట్ నెస్ సాధించింది.

హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోకుండా

హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోకుండా

ప్రస్తుతం ఉపాసనను చూసిన వారంతా తమ అభిప్రాయాలు మార్చుకుంటున్నారు. ఆమె హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోకుండా ఉందని ప్రశంసలు గుప్పిస్తున్నారు.

డెవిల్ సర్య్కూట్

డెవిల్ సర్య్కూట్

డెవిల్ సర్య్కూట్ పేరుతో ఏర్పాటు చేసిన ఓ ప్రదేశంలో ఉపాసన చేస్తున్న విన్యాసాలు వీడియో రూపంలో విడుదల చేశారు

చాలా కఠినంగా

చాలా కఠినంగా


ఫిట్ నెస్ కోసం ఉపాసన ఎంత కష్టపడుతుందో ఈ వీడియో చూస్తే మీకే తెలుస్తోంది. సైనికులు, పోలీసులకు ఇచ్చినట్లుగా చాలా కఠినంగా ఫిట్ నెస్ శిక్షణ ఇస్తున్నారిక్కడ.

వీడియో

రామ్ చరణ్ భార్య ఉపాసనకు సంబంధించి ఫిట్ నెస్ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

English summary
Tollywood Mega Power Star Ram Charan's wife Upasana is very cautious of her health and fitness. Recently, she was seen doing amazing daredevil stunts with her coach.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu