For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  వీడియో: 'కత్తి' రీమేక్ గురించి వినాయిక్ హింట్..చిరు రియాక్షన్

  By Srikanya
  |

  హైదరాబాద్ : చిరంజీవి, వినాయిక్ కాంబినేషన్ లో త్వరలో తమిళ చిత్రం 'కత్తి' రీమేక్ రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని బ్రూస్ లీ ఆడియో పంక్షన్ స్టేజిపై వివివినాయిక్...చిరు ని ఉద్దేశించి మాట్లాడుతూ హింట్ ఇచ్చారు. దానికి చిరు కూడా నైస్ గా రియాక్షన్ ఇచ్చాడు. వినాయిక్ ఏమన్నాడో...చిరు ఎలా స్మైల్ ఇచ్చారో క్రింద వీడియో చూడండి.

  వినాయక్ మాట్లాడుతూ.. 'అన్నయ్యను చూడాలని ఇటీవల షూటింగుకు వెళ్లాను. కత్తిలా ఉన్నారు. ఈ ట్రైలర్ బాగుంది. రామ్ చరణ్ కాదు, రాయల్ చరణ్. కమిట్మెంట్, ఇచ్చిన మాట అలా ఉంటుంది. శ్రీనువైట్ల కామెడీ టైమింగ్ నాకు ఇష్టం. కోన, గోపిల ఆయన కాంబినేషన్ ఎప్పుడూ హిట్టే. సినిమా పెద్ద హిట్ అవుతుంది. నిర్మాత దానయ్య గారికి డబ్బులు వస్తాయని ఆశిస్తున్నారు' అన్నారు. వినాయక్ మాటలు బట్టి 'కత్తి' రీమేక్ ఖాయమే అనుకుంట.

  ఇక ....

  చిరంజీవి పునరాగమనం 'బ్రూస్లీ'తోనే ఖాయమైపోయింది. తనయుడు రామ్‌ చరణ్‌ నటిస్తున్న ఈ చిత్రంలో చిరు అతిథి పాత్రలో కనిపించనున్నారు. 'నాన్న 150వ చిత్రానికి ఇది టీజర్‌' అని చరణ్‌ అభిమానులకు చెప్పాడు. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు అసలు సినిమా సిద్ధమవుతోంది. తమిళంలో ఘన విజయం సాధించిన చిత్రం 'కత్తి'. విజయ్‌ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి మురుగదాస్‌ దర్శకుడు. ఇప్పుడీ చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేయనున్నారు. ఇందులో కథానాయకుడిగా చిరంజీవి నటిస్తారని విశ్వసనీయవర్గాల సమాచారం.

  VIDEO: V V Vinayak Hints At Kaththi Remake, Watch Chiranjeevi's Reaction

  వి.వి.వినాయక్‌కు దర్శకత్వ బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయి. చిరంజీవి, వినాయక్‌ మధ్య 'కత్తి'కి సంబంధించిన చర్చలు సాగుతున్నాయట. చిత్రానికి ఠాగూర్‌ మధు నిర్మాతగా వ్యవహరించనున్నారు. చిరంజీవి, వినాయక్‌, మధు కలయికలో ఇదివరకు 'ఠాగూర్‌' వచ్చింది. మురుగదాస్‌ తమిళంలో తీసిన 'రమణ'కి రీమేక్‌ అది. ఇప్పుడు మళ్లీ మురుగదాస్‌ కథతోనే ఈ ముగ్గురూ జట్టుకడుతుండటం విశేషం. చిరంజీవి ఇమేజ్‌, శైలికి తగ్గుట్టు తెలుగులో మార్పులు చేస్తున్నారట. ఈ నెలలోనే చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారట.

  అలాగే...

  చిరంజీవి కెమెరా ముందుకొచ్చేశారు. సుదీర్ఘ విరామం తరవాత తనలోని నటుడ్ని బయటకు తీసుకొచ్చారు. రామ్‌చరణ్‌ నటిస్తున్న ‘బ్రూస్లీ - ది ఫైటర్‌' చిత్రంలో చిరు అతిథి పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఆయా సన్నివేశాల్ని ఇటీవల హైదరాబాద్‌లో తెరకెక్కించారు. ‘బ్రూస్లీ'లో చిరు ఓ పోరాట దృశ్యంలో కనిపిస్తారు. దాదాపు మూడు నిమిషాల పాటు సాగే ఈ ఫైట్‌ చిత్రానికే చాలా కీలకమట.

  మరోవైపు చిరు కథానాయకుడిగా నటించే చిత్రం కోసం కసరత్తులు సాగుతున్నాయి. ఇప్పటికీ మెగా కాంపౌండ్‌లో రోజూ కథలు వింటున్నారని, త్వరలోనే దర్శకుడ్ని ఫైనల్‌ చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఈయేడాది చివర్లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తుంది. ‘‘నా సినిమాలో డాడీ భాగం పంచుకోవడం ఆనందంగా ఉంది. ఆయన తదుపరి చిత్రానికి ఇది టీజర్‌ మాత్రమే'' అని రామ్‌చరణ్‌ ఫేస్‌బుక్‌లో తన సందేశాన్ని పంపాడు. దాంతో చిరు కథానాయకుడిగా నటించే చిత్రానికి సంబంధించిన కసరత్తులు జరుగుతూనే ఉన్నాయన్న విషయం చెప్పకనే చెప్పాడు.

  English summary
  As we reported earlier, Chiranjeevi has zeroed on Tamil super hit, Kaththi remake for his comeback film and has offered the direction responsibilities to his closest aide, V V Vinayak. During the audio release of Ram Charan's Bruce Lee, V V Vinayak hinted at the much awaited project by describing Chiranjeevi's looks as 'Kaththi' (Sharp/Knife Like). Though Chiranjeevi enjoyed the comments, he was caught on camera hinting the director to cut the topic there.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X