»   » డర్టీ పిక్చర్ కి ఎందుకు ఓకే చెప్పానంటే...విద్యాబాలన్

డర్టీ పిక్చర్ కి ఎందుకు ఓకే చెప్పానంటే...విద్యాబాలన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

సిల్క్ స్మిత జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందుతున్న డర్టీ పిక్చర్ లో విద్యా నటిస్తున్న విషయం తెలిసిందే. హోమ్లీ ఇమేజ్ సంపాదించుకున్న మీరు శృంగార తారగా నటించడానికి ఒప్పుకోవడానికి కారణం ఏంటి? అని విద్యా బాలన్ ని అడిగితే హోమ్లీ ఇమేజ్‌ని నేను కోరుకోలేదు. నేను చేసిన ప్రాతలు చూసి ప్రేక్షకులు ఆ ఇమేజ్ ఇచ్చారు. కానీ నాకు ఇమేజ్ ఛట్రంలో ఇరుక్కోవడం ఇష్టం లేదు. నటిగా నాలోని అన్ని కోణాలను ఆవిష్కరించు కోవాలనుకుంటున్నా. అందుకే డర్టీ పిక్చర్ కి ఓకే చెప్పా అని సమాధానమిచ్చింది. మిలన్‌ లుథ్రియా దర్శకత్వంలో రూపొందనున్నఈ 'ది డర్టీ పిక్చర్‌' చిత్రం కోసం ఆ మధ్య అలాగే పశ్చమ గోదావరి జిల్లా ఏలూరు వచ్చి వెళ్ళింది. దానకి కారణం చెపుతూ.. "నిజ జీవిత గాథల్ని తెరకెక్కించేటపుడు కొన్ని ప్లాబ్లంస్ ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. ముందుగానే వాటిని పరిష్కరించుకుంటే తర్వాత ఇబ్బందులు తగ్గుతాయి. ఆ ఆలోచనతోనే సిల్మ్ స్మిత కుటుంబ సభ్యులును, బంధువులను కలిసాం. వారి నుంచి వచ్చే అభ్యంతరాలు ఏమన్నా ఉంటే వాటిని పరిష్కరించటానకి ప్రయత్నిస్తాం. అలాగే వారందరినీ కలుసుకొని వారి నుంచి అనుమతి తీసుకున్నాకే ఈ పాత్ర చేయాలని నిర్ణయించుకొన్నాను అంది. ఇక ఈ చిత్రాన్ని ఏక్తాకపూర్ నిర్మిస్తోంది. అజయ్ దేవగన్ ఓ కీలకమైన పాత్రలో కనిపించనున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu