»   » హైదరాబాద్‌లో విద్యా బాలన్, నాగార్జునతో కోరిక (ఫోటోలు)

హైదరాబాద్‌లో విద్యా బాలన్, నాగార్జునతో కోరిక (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : 'బాబీ జాసోష్' మూవీ ప్రమోషన్‌లో భాగంగా నటి విద్యా బాలన్ హైదరాబాద్ వచ్చింది. ఈ కార్యక్రమంలో హీరో ఆలీ ఫజుల్ కూడా పాల్గొన్నారు. ఈ చిత్రంలో విద్యా బాలన్ డిటెక్టివ్ పాత్ర పోషిస్తోంది. ఇందుకోసం సినిమాలో రకరకాల మారు వేషాలు వేయాల్సి వచ్చింది. అసలు మనం ఆమెను గుర్తించలేనంతగా ఈ మారు వేషాలు ఉన్నాయి.

సినిమా కోసం 122 గెటప్‌లు టెస్ట్ చేసారు. చివరగా 12 బెస్ట్ గెటప్‌లను ఎంపిక చేసారు. వివిధ గెటప్స్ వేయడం ఎంతో ఆసక్తికరంగా ఉందని, పుచ్చుపళ్లతో ఉన్న జ్యోతిష్యుడి వేషం కూడా తాను వేసానని, డిఫరెంటు లుక్‌తో ఎవరూ గుర్తు పట్టని విధంగా తన మారు వేషాలు ఉన్నాయని విద్యా బాలన్ తెలిపారు.

తెలుగులో అవకాశం వస్తే నాగార్జునతో కలిసి నటిస్తాను. ఆయనతో కలిసి 'మీలో ఎవరు కోటిశ్వరుడు' కార్యక్రమంలో పాల్గొన్నాను. ఆయనలో అందం, హుషారు ఏ మాత్రం తగ్గలేదని విద్యా బాలన్ చెప్పుకొచ్చారు.

స్లైడ్ షోలో ఫోటోలు, మరిన్ని వివరాలు

విద్యా బాలన్

విద్యా బాలన్

బాబీ జాసూస్ చిత్రం హైదరాబాద్ చెట్టూ సాగే కథ. ఇందులో విద్యా బాలన్ మొఘల్ పురాకు చెందిన అమ్మాయిగా కనిపిస్తుంది.

సరికొత్తగా

సరికొత్తగా


ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని విద్యా బాలన్ చెప్పుకొచ్చారు.

దర్శకత్వం

దర్శకత్వం

ఈచిత్రానికి సమర్ షేక్ దర్శకత్వం వహిస్తున్నారు. నాంపల్లి, కాచిగూడ, పంజాగుట్ట, సుల్తాన్ బజార్ ప్రాంతాల్లో ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ జరిగింది.

విడుదల తేదీ

విడుదల తేదీ

జులై 4వ తేదీన సినిమా విడుదల అవుతోంది.

English summary
Actress Vidya Balan, who will start city tours to promote her upcoming film wants to visit Hyderabad first as she strongly feels what Kolkata was to Kahaani, Hyderabad is to Bobby Jasoos.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu