»   » లిప్‌లాక్స్‌తో దుమ్మురేపిన ఆదాశర్మ.. 10పైగా రీటేక్స్..

లిప్‌లాక్స్‌తో దుమ్మురేపిన ఆదాశర్మ.. 10పైగా రీటేక్స్..

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందిన హార్ట్ ఎటాక్ చిత్రం ద్వారా అందాల తార అదాశర్మ టాలీవుడ్‌లోకి ప్రవేశించింది. క్షణం చిత్రంలో ఆమె నటన విమర్శల ప్రశంసలందుకున్నది. అయితే టాలీవుడ్‌లో గానీ, బాలీవుడ్‌లో గానీ ఆదాశర్మ కెరీర్‌లో చెప్పుకో దగిన సక్సెస్ లభించలేదు. కానీ మార్చి 3న విడుదలకు సిద్ధమవుతున్న కమాండో2 చిత్రంపైనే ఆశలు పెట్టుకొన్నది.

విద్యుత్ బోల్డ్‌గా లిప్ లాక్ సీన్లు

విద్యుత్ బోల్డ్‌గా లిప్ లాక్ సీన్లు

కమాండో2 చిత్రంతో తన గ్రాఫ్ పెంచుకోవడం కోసం కొంత బోల్డ్‌గా నటించింది. హీరో విద్యుత్ జామ్వాల్‌తో లిప్ లాక్ సీన్లలో నటించి దుమ్మురేపింది. ఈ చిత్రం విజయం సాధిస్తే బాలీవుడ్‌లో అవకాశాలు వస్తాయని బలంగా నమ్ముతున్నది.

రొమాంటిక్ సీన్లతో యూనిట్‌కు కన్నుల పండుగ

రొమాంటిక్ సీన్లతో యూనిట్‌కు కన్నుల పండుగ

ఈ చిత్రం కోసం షూట్ చేసిన రొమాంటిక్ సన్నివేశాలు చిత్ర యూనిట్‌కు కన్నుల పండువగా మారాయట. అంతేకాకుండా ముద్దు సన్నివేశాల్లో నటించిన తర్వాత అదాశర్మ, విద్యుత్ పడి పడి నవ్వుకున్నారట. ఒక లిప్‌లాక్ కోసం 10 రీటెక్స్ తీసుకోవడం యూనిట్‌ను కూడా నవ్వుల్లో ముంచెత్తిందట.

లిప్ లాక్ కోసం ఆదాశర్మ 10 రీటేక్స్

లిప్ లాక్ కోసం ఆదాశర్మ 10 రీటేక్స్

ముద్దు సన్నివేశాలపై ఆదాశర్మ స్పందిస్తూ.. ఈ చిత్రం కోసం సంతకం చేసేటప్పుడు డైరెక్టర్ పూర్తిగా నమ్మాను. కథలో భాగంగా విద్యుత్‌ను సడెన్‌గా కిస్ పెట్టుకోవాల్సి వస్తుంది. అయితే సన్నివేశం సరిగా రాకపోవడంతో పది సార్లు ప్రయత్నించాల్సి వచ్చింది. ఒకవైపు చీకటి పడుతున్నది. సీన్ కంప్లీట్ కావడం లేదు. డైరెక్టర్ తొందరపెట్టాడు. దాంతో ఒకరి ముఖాలు ఒకరం చూసుకొని నవ్వుకున్నాం. తమ చుట్టు ఉన్నవారంతా నవ్వుతున్నారు. దాంతో అందర్ని సీరియస్‌గా ఉండాలని సూచించి ఎట్టకేలకు సీన్ కంప్లీట్ చేశాం అని తెలిపారు.

వాయిదాల తర్వాత ఎట్టకేలకు కమాండో2 రిలీజ్

వాయిదాల తర్వాత ఎట్టకేలకు కమాండో2 రిలీజ్

నోట్ల రద్దుతో తొలుత వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు రిలీజ్‌కు నోచుకొన్నది. దాదాపు రెండుసార్లు విడుదల వాయిదా పడ్డ ఈ సినిమా ఆదా శర్మ ఆశలను బ్రతికిస్తుందా అన్నది త్వరలోనే తేలిపోనుంది.

English summary
The crew of Commando 2 was in for some comic relief in the middle of an intense romantic scene. Actors Vidyut Jammwal and Adah Sharma burst into fits of laughter while shooting a kissing scene and took close to 10 retakes
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu