»   »  బిచ్చగాడువిజయ్ ఆంటోని విజువల్ ట్రీట్ ఇది: భేతాళుడు టీజర్ ఇదిగో (వీడియో)

బిచ్చగాడువిజయ్ ఆంటోని విజువల్ ట్రీట్ ఇది: భేతాళుడు టీజర్ ఇదిగో (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : బిచ్చగాడు చిత్రంతో లైమ్‌లైట్‌లోకి వచ్చిన విజయ్ ఆంటోని నటిస్తున్న తాజా చిత్రం 'సైతాన్'. ఎన్‌ఎన్‌ఎన్ క్రియేషన్స్ పతాకంపై తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు రైట్స్‌ను ఎస్.వేణుగోపాల్ చేజిక్కించుకున్నారు. ప్రదీప్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. తమిళంలో సైతాన్గా తెరకెక్కిన ఆ చిత్రం తెలుగులో భేతాళుడుగా విడుదలవుతోంది. ఈ చిత్రం టీజర్ ని విడుదల చేసారు. ఈ టీజర్ విజువల్ ట్రీట్ గా ఉండి అందరినీ ఆకట్టుకుంటోంది. ఆ టీజర్ ని మీరు ఇక్కడ చూడండి.

సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందించిన ఈ చిత్రంలో తాను సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా నటించానని హీరో విజయ్ ఆంటోని అన్నారు. బిచ్చగాడు హిట్ అయిన నేపథ్యంలో ఈ సినిమాపై సహజంగానే అంచనాలు అధికంగా ఉన్నాయన్నారు.

చిత్రం గూర్చి నిర్మాత వేణుగోపాల్ మాట్లాడుతూ, సైతాన్ షూటింగ్ పూర్తయిందని, త్వరలోనే ఆడియో విడుదల చేసి తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి చిత్రాన్ని విడుదల చేస్తామని తెలిపారు. అరుంధతి నాయర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి సంగీతం:విజయ్ ఆంటోని, కెమెరా:ప్రదీప్ కలిపురయత్, ఎడిటింగ్:వీర సెంథిల్, నిర్మాత:ఎస్.వేణుగోపాల్, దర్శకత్వం:ప్రదీకుమార్.

Vijay Anthony’s Saithan Teaser: Visual Treat

డాక్టర్ సలీమ్ - నకిలీ చిత్రాలు విజయ్ ఆంటోనీకి తెలుగు ప్రేక్షకుల్లో ఓ గుర్తింపును తెచ్చిపెట్టగా ఈమధ్య విడుదలైన బిచ్చగాడు ఆయనకి అగ్రపీఠం వేసి కూర్చోబెట్టింది. ఒక డబ్బింగ్ సినిమాగా ప్రేక్షకుల ముందుకొచ్చినా అది కనీ వినీ ఎరుగని రేంజ్ లో విజయం సాధించింది. ఆ సినిమాకి ఏకంగా 20కోట్లకిపైగా వసూళ్లొచ్చాయి. కేవలం 40 లక్షలకి నిర్మాతలు డబ్బింగ్ రైట్స్ కొన్నారు. అంటే ఆ సినిమాకి ఏస్థాయిలో లాభాలు తెచ్చిపెట్టిందో అర్థం చేసుకోవచ్చు.

ముఖ్యంగా విజయ్ ఆంటోనీ ఎంచుకొనే కథలపై దక్షిణాది పరిశ్రమలన్నీ పూర్తిస్థాయిలో నమ్మకాన్ని కనబరుస్తుంటాయి. నాలుగు భాషల్లోనూ మార్కెట్ ని క్రియేట్ చేసుకొన్నాడాయన. తదుపరి సైతాన్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వం వహించిన ఆ చిత్రం ఇప్పటికే అన్ని భాషల్లోనూ ఫ్యానీ రేట్లకి అమ్ముడిపోయింది. తెలుగు ఇండస్ట్రీ అయితే ఆ చిత్రం నుంచి అద్భుతాల్నే ఆశిస్తోంది. మరి రిజల్ట్ ఎలా ఉంటుందో తెలియాలంటే రిలీజ్ వరకు ఆగాల్సిందే.

English summary
Tamil actor Vijay Anthony's latest movie has been titled Bethaludu in Telugu has been directed by Pradeep Krishnamoorthy. The makers unveiled the first teaser of the film which has been visually stupendous throughout.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu