»   » ‘బిచ్చగాడు’ హీరో నెక్ట్స్ ‘ఇంద్రసేన’... చిరంజీవితో లాంచ్!

‘బిచ్చగాడు’ హీరో నెక్ట్స్ ‘ఇంద్రసేన’... చిరంజీవితో లాంచ్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

'బిచ్చగాడు' సినిమాతో టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తమిళ నటుడు విజయ్ ఆంటోని త్వరలో 'ఇంద్రసేన' సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తమిళంలో 'అన్నాదురై' పేరుతో తెరకెక్కుతున్న చిత్రాన్ని తెలుగులో 'ఇంద్రసేన'గా రిలీజ్ చేయనున్నారు.

సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రిలీజ్ ప్లాన్ చేశారు. సెప్టెంబర్ 5న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేయనున్నారు. సి. శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న రాధిక శరత్ కుమార్ నిర్మాత.

రాధిక కోరిక మేరకు

రాధిక కోరిక మేరకు

తనకు అత్యంత ఆప్తురాలైన, తనతో పాటు ఎన్నో చిత్రాల్లో నటించిన రాధిక శరత్ కుమార్ నిర్మాత కావడంతో..... ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయాలని కోరగానే చిరంజీవి వెంటనే ఒకే చెప్పారట.

ఇంద్రసేన

ఇంద్రసేన

గతంలో చిరంజీవి నటించిన ‘ఇంద్ర' మూవీ ఎంత పెద్ద హిట్టయిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రంలో చిరంజీవి ఇంద్రసేనారెడ్డి పాత్రలో నటించారు. ఇపుడు విజయ్ ఆంటోనీ హీరోగా ‘ఇంద్రసేన' సినిమా వస్తుండటం, ఈ చిత్రం ఫస్ట్ లుక్ చిరంజీవి చేతుల మీదుగా రిలీజవుతుండటం చర్చనీయాంశం అయింది.

ద్విపాత్రాభినయం

ద్విపాత్రాభినయం

ఈ చిత్రంలో విజయ్ ఆంటోనీ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఒక పాత్రలో తాగుబోతుగా, మరో పాత్రలో టీచర్ గా విజయ్ ఆంటోనీ కనిపించబోతున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.

విజయ్ ఆంటోనీ ఎడిటింగ్

విజయ్ ఆంటోనీ ఎడిటింగ్

ఈ సినిమాకు ఎడిటింగ్ కూడా విజయ్ ఆంటోనీ చేస్తుండటం విశేషం. మ్యూజిక్ డైరెక్టర్ గా కోరీర్ మొదలు పెట్టి, తర్వాత హీరో, నిర్మాతగా తన సత్తా నిరూపించుకున్న విజయ్ ఆంటోనీ, ఇపుడు ఎడిటింగ్ లాంటివి చేస్తూ తాను ఆల్ రౌండర్ అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

English summary
Chiranjeevi to unveil the First Look Poster of Vijay Antony's Indrasena on 5th September, Vijay Antony foray into Editing.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu