Don't Miss!
- News
పవన్ కల్యాణ్ పర్యటనలో అపశృతి- అభిమాని దుర్మరణం: ముగ్గురికి తీవ్ర గాయాలు
- Sports
ICC ODI Rankings: కివీస్ క్లీన్ స్వీప్.. టీమిండియాదే అగ్రస్థానం! ఆసీస్ పనిబడితే..!
- Finance
Tata motors: ధరలు పెంచిన టాటా మోటార్స్.. ఆ వాహనాలపై తగ్గిన డిస్కౌంట్లు
- Lifestyle
వినడం కూడా ఒక కళ, మీకు పెళ్లైతే వినడం నేర్చుకోవాల్సిందే..
- Technology
ఇండియా సొంత మొబైల్ OS, BharOS ను మీ ఫోన్లో అప్డేట్ చేయవచ్చా? తెలుసుకోండి.
- Automobiles
గ్రాండ్ విటారా కోసం రీకాల్ ప్రకటించిన మారుతి సుజుకి.. కారణం ఏమిటంటే?
- Travel
రథసప్తమికి ముస్తాబవుతోన్న అరసవల్లి సూర్యదేవాలయం!
అది రాంగ్ క్వశ్చన్.. వాళ్లకు ఛాన్స్ ఇవ్వడానికి నేనెవర్ని.. విజయ్ దేవరకొండ!
Recommended Video

దర్శక నిర్మాతలకు టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరో. విజయ్ దేవరకొండ చిత్రాలకు యువత ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. విజయ్ దేవరకొండ క్రేజ్ ఒక్కసారిగా అర్జున్ రెడ్డి చిత్రంతో పెరిగింది. ఆ తర్వాత కూడా విజయ్ దేవరకొండ గీత గోవిందం, టాక్సీవాలా లాంటి విజయాలు అందుకున్నాడు. ప్రస్తుతం విజయ్ డియర్ కామ్రేడ్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని డెబ్యూ దర్శకుడు భరత్ కమ్మ తెరకెక్కిస్తున్నాడు. విజయ్ దేవరకొండ ఓ కార్యక్రమంలో కొత్త దర్శకుల గురించి చేసిన కామెంట్స్ పై ప్రశంసలు కురుస్తున్నాయి.

వరుసగా కొత్త దర్శకులతో
విజయ్ దేవరకొండ ఎక్కువగా డెబ్యూ దర్శకులతోనే సినిమా చేసేందుకు ఆసక్తి చూపుతున్నాడు.పెళ్లి చూపులు చిత్రంతో తరుణ్ భాస్కర్, అర్జున్ రెడ్డి చిత్రంతో సందీప్ వంగ, టాక్సీవాలా చిత్రంతో రాహుల్, ప్రస్తుతం తెరకెక్కుతున్న డియర్ కామ్రేడ్ చిత్రంతో భరత్ కమ్మ విజయ్ దేవరకొండ చిత్రాల ద్వారా దర్శకులుగా పరిచయమైనవారే. విజయ్ దేవరకొండ కొత్త దర్శకులతో చేసిన అన్ని ప్రయత్నాలు దాదాపుగా ఫలించాయి.

అది రాంగ్ క్వశ్చన్
ఇండస్ట్రీలో ఎక్కువగా కొత్త దర్శకులకు ఛాన్స్ ఇస్తున్నది మీరే కదా అనే ప్రశ్నకు విజయ్ దేవరకొండ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. అది రాంగ్ క్వశ్చన్. నేను ఛాన్స్ ఇవ్వడం ఏంటి.. వాళ్లకు ఛాన్స్ ఇవ్వడానికి నేను ఎవర్ని. వాళ్ళు మంచి కథతో వస్తున్నారు.. కాబట్టే సినిమా చేస్తున్నా. వాళ్లంతా నా కోసం కథ తీసుకుని వచ్చి సినిమా చేస్తున్నారు అంటే నేనే అదృష్టవంతుడిని అని విజయ్ దేవరకొండ తెలిపాడు. కొత్తవాళ్లే కావచ్చు కానీ వారిలో ప్రతిభ మెండుగా ఉంటుంది. నా తదుపరి చిత్రాలకు కూడా వారే దర్శకులుగా ఉండాలనే కోరిక నాకు ఉంటుందని విజయ్ తెలిపాడు.
విజయ్ దేవరకొండపై షాకింగ్ రూమర్... దిల్ రాజుతో ఆ ఇష్యూ నిజమేనా?

అభిమానుల నుంచి ప్రశంసలు
తన మాటల ద్వారా మరో మారు విజయ్ దేవరకొండ అభిమానుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు. క్రేజ్ ఉండి కూడా కొత్త దర్శకుల పట్ల విజయ్ దేవరకొండ ఎంతో గౌరవంతో వ్యవహరిస్తున్నాడని అంటున్నారు. ఇలాంటి హీరోలు ఉంటె టాలీవుడ్ లో మరికొంతమంది ప్రతిభకలిగిన యువ దర్శకులు వెలుగులోకి వస్తారని అభిమానులు అంటున్నారు.

తదుపరి చిత్రాలు
విజయ్ దేవరకొండ ప్రస్తుతం నటిస్తున్న డియర్ కామ్రేడ్ చిత్రాన్ని మైత్రి మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రం తర్వాత తాను క్రాంతి మాధవ్ దర్శత్వంలో నటించబోతున్నట్లు విజయ్ ఖరారు చేశాడు. క్రాంతి మాధవ్ తెరకెక్కించే ఈ చిత్రం తెలుగు తమిళ ద్విభాషా చిత్రంగా వస్తుందని సమాచారం. విజయ్ దేవరకొండ బాలీవడ్ ఎంట్రీ గురించి కూడా చాలా రోజులుగా ఆసక్తికర ప్రచారం జరుగుతోంది.