»   » రండిరా...! ఫేక్ బాబులకు విజయ్ దేవరకొండ షాకింగ్ ట్వీట్

రండిరా...! ఫేక్ బాబులకు విజయ్ దేవరకొండ షాకింగ్ ట్వీట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

'అర్జన్ రెడ్డి' సినిమాతో సంచలన విజయం అందుకున్న విజయ్ దేవరకొండ ఇప్పటి వరకు ఫేస్‌బుక్ ద్వారా మాత్రమే అభిమానులతో టచ్‌లో ఉండేవాడు. తాజాగా ఈ స్టార్ ట్విట్టర్ ఖాతా ఓపెన్ చేశాడు. వాస్తవానికి విజయ్‌కి ట్విట్టర్ ఖాతా ఓపెన్ చేయడం ఇష్టం లేదు. అయితే తన పేరుతో చాలా మంది ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

విజయ్ దేవరకొండ తన తొలి ట్వీటే ఫేక్ అకౌంట్ గాళ్లను టార్గెట్ చేస్తూ పెట్టాడు. ఆ పోస్టు చూస్తే మీరూ షాకవ్వాల్సిందే. ఒకరకంగా చెప్పాలంటే అది డబల్ మీనింగ్ బూతు. మరి ఫేక్ అకౌంట్స్ క్లోజ్ కావాలంటే ఆ మాత్రం పంచ్ పడాల్సిందే.


విజయ్ దేవరకొండ తొలి ట్వీట్

ఫేక్ అకౌంట్లను టార్గెట్ చేస్తూ విజయ్ దేవరకొండ చేసిన పోస్టు ఇదే. ఇది చూసిన తర్వాత ఫేక్ అకౌంట్లు తోకముడవటం ఖాయంగా కనిపిస్తోంది.


గుత్తాజ్వాలా రెస్పాన్స్...

ఫేక్ అకౌంట్స్ ను ఉద్దేశించి విజయ్ దేవరకొండ చేసిన ట్వీట్ చూసి ప్రముఖ బాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా పై విధంగా కామెంట్ పెట్టారు.


అభిమానులు

అభిమానులు

‘ట్విటర్'లో ఖాతా తెరిచినందుకు అభినందించిన అభిమానులు, ముఖ్యంగా, ‘అర్జున్ రెడ్డి' సినిమా ప్రస్తావన తీసుకువచ్చారు. ఈ సినిమాలో విజయ్ నటన అద్భుతంగా ఉందని ప్రశంసించారు.


తాతయ్య ప్రస్తావన

తాతయ్య ప్రస్తావన

‘అర్జున్ రెడ్డి' చిత్రం విషయమై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు (వీహెచ్) విమర్శలు చేస్తున్న నేపథ్యంలో అభిమానుల్లో ఒకరు ‘ట్విటర్' ఖాతా ఎందుకు భయ్యా ‘తాతయ్య' కోసమా?? తాతయ్యా చిల్' అంటూ పోస్ట్ చేయడం గమనార్హం.English summary
Vijay Devarakonda joined twitter. His official twitter handle is DVijaySai. He started off his twitter journey with a tweet 'To all the fake accounts" and posted a classic GIF.. an obscene gesture from his latest film 'Arjun Reddy aimed at all the fake account holders in his name.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu