»   »  నాకు నచ్చిన నటుడు అతను: షాలినీ పాండే

నాకు నచ్చిన నటుడు అతను: షాలినీ పాండే

Posted By:
Subscribe to Filmibeat Telugu
Vijay devarakonda Next Movie Details Heresవిజయ్ దేవరకొండ నెక్స్ట్ మూవీ ఏంటో తెలుసా|

'అర్జున్‌రెడ్డి'తో ట్రెండ్ సెట్టింగ్ విజయం సాధించాడు విజయ్‌ దేవరకొండ. ఇప్పుడు ఆయన కొత్త సినిమా ఖారరైయింది గీతా ఆర్ట్స్‌ లో ఓ సినిమా చేస్తున్నాడు విజయ్. ఈ చిత్రానికి పరశురాం దర్శకత్వం. ఈ విషయాన్ని నిర్మాతలు ప్రకటించారు. ఓన‌మాలు, మ‌ళ్లీ మ‌ళ్లీ ఇది రానీ రోజు ద‌ర్శ‌కుడు క్రాంతిమాధ‌వ్ చెప్పిన క‌థ‌కూ విజ‌య్ ఒకే అనేశాడు. కె.ఎస్‌.రామారావు ఈ చిత్రానికి నిర్మాత‌. ఈ చిత్రానికి 'ఎన్నెన్నో అందాలు' అనే టైటిల్ ప‌రిశీలిస్తున్నారు.

ప్రేమ‌లో కొత్త కోణం

ప్రేమ‌లో కొత్త కోణం

మ‌ళ్లీ మ‌ళ్లీ ఇది రాని రోజులో ఓ స‌రికొత్త ల‌వ్ స్టోరీ చెప్పాడు క్రాంతి మాధ‌వ్‌. ఈసారీ... ప్రేమ‌లో కొత్త కోణం వెలికి తీసే ప్ర‌య‌త్నం చేస్తున్నాడ‌ట‌. 2018 ఫిబ్ర‌వ‌రి నుంచి ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ల‌నుంది.ఇలా విజయ్ తన కెరీర్ లో దూసుకు పోతూ ఉంటే అభిమానులూ అదే రేంజి లో పెరిగిపోతున్నారు విజయ్ కి.

షాలిని పాండే

షాలిని పాండే

ఇప్పుడు అందరికంటే ఒక స్పెషల్ ఫ్యాన్ కూడా తనకు నచ్చిన నటుడు విజయ్ దేవర కొండ అంటూ చెప్పింది. ఇంతకీ ఆమె ఎవరో కాదు అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలినీ. తనకు ఇష్టమైన నటుడు విజయ్‌ దేవరకొండ అని నటి షాలిని పాండే చెప్పింది. ఆమె బుధవారం ఓ మొబైల్‌ దుకాణాన్ని ప్రారంభించడానికి నెల్లూరు వెళ్ళి అక్కడ కొద్దిగా అస్వస్థతగా అనిపించి, ఆసుపత్రికి వెళ్లటం తో ఈ విషయం బాగా వైరల్‌ అయ్యింది.


ఒక వీడియో పోస్ట్ చేసింది

ఒక వీడియో పోస్ట్ చేసింది

కాగా తన ఆరోగ్యం గురించి షాలిని బుధవారం ఫేస్‌బుక్‌ లో ఒక వీడియో పోస్ట్ చేసింది. తనకు కొంచెం తలనొప్పి, జ్వరంగా ఉండి సాధారణ వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లినట్లు, అక్కడ మీడియా, ప్రజలకు కనపడకుండా కవర్‌ చేసుకున్నానని, దీనికి మించి ఇంకేమీ లేదని చెప్పిన షాలినీ. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగుందని చెప్పింది, అయితే మళ్ళీ కాసేపటికే ఈ వీడియోని తొలగించేసింది.


ఇష్టమైన నటుడు విజయ్‌ దేవరకొండ

ఇష్టమైన నటుడు విజయ్‌ దేవరకొండ

ఈ సందర్భంగా ఓ అభిమాని ‘‘మహానటి' చిత్రంలో నటిస్తున్నారా?' అని ప్రశ్నించారు. ‘అవును.. నటిస్తున్నా' అని షాలిని చెప్పారు. తన పాత్ర ఏదో ఇప్పుడే చెప్పనంది. కొన్ని సినిమాలకి సంతకం చేశానని, వివరాలను త్వరలోనే ప్రకటిస్తుందట ‘హైదరాబాద్‌కు వచ్చేస్తారా?' అని అడగగా ‘తెలియదు.. నేను ఉండేది ముంబయిలో'అనేసింది. ‘100% లవ్‌' తమిళ్‌ రీమేక్‌కు సంతకం చేశానని చెప్పారు. టాలీవుడ్‌లో తనకు ఇష్టమైన నటుడు విజయ్‌ దేవరకొండ అని చెప్పింది.English summary
Arjun Reddy heroine Shalini pande says her first hero Devarakonda Vijay is her Best actor .
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu