Don't Miss!
- Sports
IND vs NZ: స్టన్నింగ్ డెలివరీతో షేన్ వార్న్‌ను గుర్తు చేసిన కుల్దీప్ యాదవ్వీడియో
- News
ప్రధాని మోడీ వైస్రాయ్ అవుతారా? లేక గవర్నర్లను ఎత్తేస్తారా?: కేటీఆర్ విమర్శల దాడి
- Lifestyle
Vastu Tips: లక్ష్మీదేవి లాంటి చీపురు ఎప్పుడు కొనాలి, ఇంట్లో ఎక్కడ పెట్టాలో తెలుసా?
- Finance
household income: భారతీయ కుటుంబాలపై సర్వే.. ఆదాయం, పొదుపులు ఎంతో తెలుసా ?
- Technology
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- Automobiles
భారతీయ మార్కెట్లో Hero XOOM ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల: ప్రైస్, వేరియంట్స్ & కలర్ ఆప్సన్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
Indira Devi Death: మహేష్ తల్లికి విజయ్ దేవరకొండ నివాళి.. సూపర్ స్టార్ ను ఓదారుస్తూ ఎమోషనల్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మాతృమూర్తి ఇందిరా దేవి బుధవారం తెల్లవారుజామున కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆమె మృతితో ఒక్కసారిగా ఘట్టమనేని కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కొంతకాలం క్రితమే ఘట్టమనేని పెద్ద కుమారుడు రమేష్ బాబు మృతి చెందడం ఆ కుటుంబాన్ని తీరని విషాదంలోకి నెట్టేసింది. ఇక ఇప్పుడు మహేష్ బాబు తన తల్లిని కూడా కోల్పోవడం అందరిని కలచివేస్తుంది.
ఇక మహేష్ బాబుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మహేష్ బాబును ప్రత్యేకంగా ఓదార్చేందుకు ప్రముఖ సినీ తారలు కూడా వారి స్వగృహానికి వెళ్లారు. అయితే కొంతమంది యువ హీరోలు కూడా ప్రత్యేకంగా సూపర్ స్టార్ కృష్ణ ను కలుసుకున్నారు. ఇక టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ కూడా ఇందిరా దేవికి ప్రత్యేకంగా నివాళులు అర్పిస్తూ మహేష్ బాబు కలుసుకున్నారు. మహేష్ బాబును కౌగిలించుకొని ఎమోషనల్ అయిన విజయ్ దేవరకొండ తర్వాత ధైర్యం చెప్పారు.
Our @TheDeverakonda Paid Condolences To #IndiraDevi Garu 💔#MaheshBabu#vijaydeverakonda
— #sai!.. (@SAI5698) September 28, 2022
🥺❤ pic.twitter.com/F63T4udNF3
ఇక సూపర్ స్టార్ కృష్ణ కుర్చీలో కూర్చొని ఉండగా విజయ్ దేవరకొండ ఎంతో ఒదిగి ఆయనను కూడా పరమర్శించారు. అందుకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విజయ్ దేవరకొండకు మహేష్ బాబుకు మంచి సాన్నిహిత్యం ఉన్న విషయం తెలిసిందే. ఇక ఇదిరా దేవి మృతి పట్ల మరి కొంతమంది సినీ తారలు కూడా ప్రత్యేకంగా ఘట్టమనేని ఇంటికి చేరుకొని మహేష్ బాబును అలాగే సూపర్ స్టార్ కృష్ణ ను కలుసుకున్నారు.

ఇలాంటి కఠిన సమయంలో ఆ కుటుంబానికి దేవుడు ధైర్యం ఇవ్వాలి అని సోషల్ మీడియాలో మరి కొంతమంది కోరుకున్నారు. ఇక తల్లి మృతి పట్ల మహేష్ బాబు కూడా చాలా కంటతడి పెట్టుకోవడం అభిమానులను కూడా కలచివేస్తోంది. మహేష్ బాబు కూతురు సీతారా ఏడుస్తున్న ఒక వీడియో కూడా అందరిని కంటతడి పెట్టించింది. అలాగే మరి కొంతమంది సినీ తారలు అంత్యక్రియల అనంతరం మహేష్ బాబు సూపర్ స్టార్ కృష్ణను కూడా పరామర్శించడానికి రాబోతున్నారు.