»   »  బిగ్ బాస్ హౌస్ లోకి అర్జున్ రెడ్డి, సెకండ్ సీజన్ కి కూడా ఎన్టీఆరే: బిగ్ బాస్ లేటేస్ట్ అప్డేట్స్

బిగ్ బాస్ హౌస్ లోకి అర్జున్ రెడ్డి, సెకండ్ సీజన్ కి కూడా ఎన్టీఆరే: బిగ్ బాస్ లేటేస్ట్ అప్డేట్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగులో బిగ్ బాస్ షో అత్యధిక టీఆర్పీ రేటింగ్స్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ షో కు రోజు రోజుకు ప్రేక్షకాదరణ పెరుగుతూ వస్తుంది..ఇక ఎన్టీఆర్ వచ్చే శని , ఆది వారాల్లో అయితే అత్యధిక టి ఆర్పీ రేటింగ్ లు సాధిస్తుంది. ఇక ఈ షో కి మరింత గ్లామర్ తెచ్చేందుకు యాజమాన్యం బాలీవుడ్ తరహాలో ఆలోచిస్తుంది. సినిమా రిలీజ్ టైం లో తమ సినిమాలను ప్రమోట్ చేసుకునేందుకు ఈ షో ను వాడుకుంటున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ ఆకట్టుకున్నాడు

జూనియర్ ఎన్టీఆర్ ఆకట్టుకున్నాడు

మొదట ఈ షోపై ప్రేక్షకులు అంతలా ఆసక్తి కనబర్చలేదు. దీనికి కారణం లేకపోలేదు. బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌‌లో ఒకరిద్దరిని మినహాయిస్తే మిగిలినవారు పెద్ద పేరున్న సెలబ్రెటీస్ కాకపోవడమే ఇందుకు కారణం. అయితే మొదట్లో కాస్త అనాసక్తి చూపించిన ప్రేక్షకులను జూనియర్ ఎన్టీఆర్ తన మేనరిజంతో ఆకట్టుకున్నాడు.

టీఆర్పీ రేటింగ్ ఊహించని రీతిలో పెరిగింది

టీఆర్పీ రేటింగ్ ఊహించని రీతిలో పెరిగింది

తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించి.. ప్రేక్షకులను అలరించాడు. దీంతో టీఆర్పీ రేటింగ్ ఊహించని రీతిలో పెరిగింది. ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌లో మార్పులుచేర్పులు చేయడం, ఉన్న వారి తీరులో మార్పు రావడం కూడా షోకు బాగా కలిసొచ్చింది.

నేనే రాజు.. నేనే మంత్రి

నేనే రాజు.. నేనే మంత్రి

ఈ మధ్యన విడుదలైన రానా.. నేనే రాజు.. నేనే మంత్రి మూవీ ప్రమోషన్ కు పంచకట్టుతో వెళ్లారు రానా. ఆ తర్వాత ఆనందోబ్రహ్మ మూవీ ప్రమోషన్లో భాగంగా నటి తాప్సీ కూడా బిగ్ బాస్ ఇంటికి వెళ్లి రావటం తెలిసిందే.తాజాగా ఆ ఛాన్స్ అర్జున్ రెడ్డి చిత్ర హీరో విజయ్ దేవరకొండ బిగ్ బాస్ హౌస్ లో దర్శనం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

సినిమాను మరింత పాపులర్ చేయాలన్న ఆలోచన

సినిమాను మరింత పాపులర్ చేయాలన్న ఆలోచన

ఇప్పటికే ఈ చిత్రం పలు రకాలుగా వివాదాస్పదమై.. మీడియాలో వార్తల రూపంలో పదే పదే రావటంతో పాటు ఈ మూవీ మీద ఇప్పటికే కొంత ఆసక్తిని క్రియేట్ చేయగలిగారు. బిగ్ బాస్ షోలో కనిపించటం ద్వారా సినిమాను మరింత పాపులర్ చేయాలన్న ఆలోచనలో ఉన్న అర్జున్ రెడ్డి చిత్ర టీం..తమ హీరోను బిగ్ బాస్ ఇంటికి పంపుతున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే అర్జున్ రెడ్డి బిగ్ బాస్ ఇంట్లో సందడి చేసేందుకు ఫుణే వెళ్లినట్లుగా సమాచారం.

ఇంకో ప్లజెంట్ న్యూస్

ఇంకో ప్లజెంట్ న్యూస్

ఇదిలా ఉంటే ఇంకో ప్లజెంట్ న్యూస్ కూడా వినిపిస్తోంది జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించడం స్టార్ మాకు కలిసి రావడంతో సెకండ్ సీజన్‌కు కూడా జూనియర్ ఎన్టీఆర్‌నే హోస్ట్‌గా తీసుకోవాలని యాజమాన్యం నిర్ణయించిందట. ఇప్పటికే ఈ విషయంపై చానల్ యాజమాన్యం ఎన్టీఆర్‌తో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం.

సెకండ్ సీజన్

సెకండ్ సీజన్

సెకండ్ సీజన్ చేసేందుకు ఎన్టీఆర్ కూడా పచ్చ జెండా ఊపినట్లు తెలుస్తోంది. మీలో ఎవరు కోటీశ్వరుడు సెకండ్ సీజన్ విషయంలో నాగార్జునకు బదులుగా చిరంజీవిని హోస్ట్‌గా పెట్టారు. మరి బిగ్ బాస్ విషయంలో అలాంటి ప్రయోగం చేయడానికి చానల్ యాజమాన్యం ఎందుకు వెనుకడుగు వేస్తోందోనన్న చర్చ ప్రేక్షకుల్లో జోరుగా సాగుతోంది.

English summary
Vijay Devarakonda is not missing any opportunity to promote his upcoming film ‘Arjun Reddy’. he is now entering the Bigg Boss sets in Lonavala, Pune.
Please Wait while comments are loading...