»   » F**k ఏం మాట్లాడుతున్నావ్ రా: విజయ్ దేవరకొండ సంచలన స్పీచ్

F**k ఏం మాట్లాడుతున్నావ్ రా: విజయ్ దేవరకొండ సంచలన స్పీచ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

'పెళ్లి చూపులు' సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన విజయ్ దేవరకొండ ఈ నెల 25న 'అర్జున్ రెడ్డి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై విజయ్ చాలా కాన్ఫిడెంటుగా ఉన్నాడు. ఆ మధ్య అర్జున్ రెడ్డి ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో విజయ్ మాట్లాడుతూ సినిమా పెద్ద హిట్టవుతుందని వ్యాఖ్యానించారు. అతడి స్పీచ్ విన్నవారంతా .... ఇతడిలో ఓవర్‌కాన్ఫిడెంట్ కనిపిస్తోందని, నటుడుగా ఎదుగుతున్న సమయంలో ఇలాంటి యాటిట్యూడ్ పనికిరాదనే విమర్శలు సోషల్ మీడియాలో చేశారు.

Photo Gallery :  Arjun Reddy Pre Release Function


తాజాగా సోమవారం సాయంత్రం జరిగిన 'అర్జున్ రెడ్డి' ప్రీ రిలీజ్ ఫంక్షన్లో తనలో ఓవర్ కాన్ఫిడెంట్ ఉందని విమర్శలు చేసిన వారిపై..... తనదైన శైలిలో సెటైర్లు వేశారు విజయ్. ఈ ఫంక్షన్లో విజయ్ స్పీచ్ చాలా బోల్డ్‌గా ఎవరూ ఊహించని విధంగా సాగింది.


అంతేనా వాళ్ల బ్రతుకు? నా సినిమా ఉంది మీకు

అంతేనా వాళ్ల బ్రతుకు? నా సినిమా ఉంది మీకు

వాట్సాప్... వాట్సాప్ మై రౌడీ బాయ్స్ అండ్ గర్ల్స్... అంటూ విజయ్ తన స్పీచ్ మొదలు పెట్టారు. బీటెక్ స్టూడెంట్స్ చదవే నాలుగేళ్ల చదువుకు రఘువరన్ బీటెక్ ఇలా చాలా సినిమాలు ఉన్నాయి. మెడికల్ స్టూడెంట్స్ ఐదేళ్లు ఎంబీబీఎస్, తర్వాత రెండేళ్లు, తర్వాత మళ్లీ రెండేళ్లు స్పెషలైజేషన్ చేస్తే ప్రతి సినిమాలో ఓ డాక్టర్ అంకుల్ వచ్చి, కళ్లద్దాలు తీసి... ది పేషెంట్ ఈజ్ ఔటాఫ్ డేంజర్ అంటాడు. అంతేనా వాళ్ల బ్రతుకు. అందుకే మెడికల్ స్టూడెంట్ అందరి కోసం వచ్చేసింది ‘అర్జున్ రెడ్డి' అంటూ వారిని ఉత్సాహ పరిచే ప్రయత్నం చేశాడు.


Nani Praises Arjun Reddy @Theatrical Trailer Launch
క్రౌడ్ చూసి మురిసిపోయిన విజయ్

క్రౌడ్ చూసి మురిసిపోయిన విజయ్

ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు క్రౌడ్ బాగా రావడంతో విజయ్ మురిసిపోయాడు. అర్జున్ రెడ్డి టీజర్ ఎంత మందికి పిచ్చెక్కించింది? అర్జున్ రెడ్డి పాటలు ఎంత మందికి నచ్చాయి? అర్జున్ రెడ్డి ట్రైలర్ ఎంత మంది మైండ్ బ్లో చేసింది? అర్జున్ రెడ్డి ఫస్ట్ డే ఫస్ట్ షో గురించి ఎంత మంది వెయిటింగ్? ఆల్రెడీ టికెట్స్ ఎంత మంది బుక్ చేశారు? అని వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు.


సోషల్ మీడియాలో నాపై కంప్లయింట్స్

సోషల్ మీడియాలో నాపై కంప్లయింట్స్

ట్రైలర్ లాంచ్ సందర్భంగా నా మనసుకు అనిపించింది మాట్లాడాను. కానీ నేను అలా మాట్లాడింది కొంత మందికి నచ్చలేదట. కొంత మంది ఫీలయ్యారంట. సోషల్ మీడియాలో నాకు ఓవర్‌ కాన్ఫిడెంట్ అని కంప్లైంట్ చేశారు. దీంతో నా వెల్ విషర్స్ అరేయ్ విజయ్ ఎందుకు అలా మాట్లాడటం, జాగ్రత్తగా ఉండు అన్నారు. అసలు ఏమిటీ కంప్లయింట్స్ అని వెతికితే ‘టాక్ ఆఫ్ ది టౌన్, హీరో ఓవర్ కాన్ఫిడెంట్, ఎగ్జాజిరేషన్ అండ్ ఓవర్ కాన్ఫిడెంట్ ఫర్ నథింగ్, ఇట్స్ నాట్ నైస్ టు బి టూ అగ్రెసివ్ విత్ యువర్ స్టేట్మెంట్స్ వెన్ యు ఆర్ జస్ట్ ఎ బడ్డింగ్ యాక్టర్' ఇలా నన్ను వేసుకున్నారు.... అని విజయ్ దేవరకొండ తెలిపారు.


F**k అంటూ బూతులతో రిప్లై ఇచ్చిన విజయ్

F**k అంటూ బూతులతో రిప్లై ఇచ్చిన విజయ్

‘నా గురించి ఇలా ఫీలైన వారందరికీ, కంప్లయింట్ చేసిన వారందరికీ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా మీ అందరి ముందు ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. వారెవరికీ నేను క్షమాపణలు చెప్పాలనుకోవడం లేదు' అంటూ వారిపై బూతులు(F**k ) ప్రయోగించి సంచలన కామెంట్స్ చేశాడు విజయ్.


అరే... ఓవర్ కాన్ఫిడెంట్ ఏంది?

అరే... ఓవర్ కాన్ఫిడెంట్ ఏంది?

అరే... ఓవర్ కాన్పిడెంట్ ఏంది? ఒక యాక్టర్ కు తన సినిమా మీద కాన్ఫిడెంట్ లేక పోతే ఎలా? నా సినిమా మీద నాకు కాన్ఫిడెంట్ లేక పోతే ఇంకా ఎవరికి ఉంటది? నేనేమంటున్నా అంటే మీరు కూడా అసలు ఈ సొసైటీలో వంగి ఉండాలని అస్సలు చెప్పను. తల పైకెత్తి ఉండండి అని చెబుతాను. పుట్ యువర్ చిన్స్ అప్, నీ యమ్మ నేను జస్ట్ యాక్టర్‌ను మీరంతా ఇంజనీర్స్... ఎరోప్లేన్స్, టీవీలు తయారు చేస్తున్నారు, ఇల్లులు కడుతున్నారు. డాక్టర్లు లైఫ్ సేవ్ చేస్తున్నారు. గర్వంగా చెప్పండి మీ సత్తా ఏమిటో, మీరేంటో చూపండి అంటూ విజయ్ వ్యాఖ్యానించారు.


సెన్సార్ బోర్డుపై అలా చేసింది కాబట్టే నాకు కాలింది

సెన్సార్ బోర్డుపై అలా చేసింది కాబట్టే నాకు కాలింది

ప్రతి ఫిల్మ్ మేకర్‌కు సెన్సార్ బోర్డు అనేది ఓ పీడకల. అయితే మా సెన్సార్ బోర్డు వాళ్లు సినిమా చూడగానే ‘ఎ' సర్టిఫికెట్ ఇచ్చేశారు. అది నాకు ఓకే. కథ విన్నపుడే ఇది పిల్లలకు కాదు అనిపించింది. సినిమా షూటింగ్ చేస్తుంటే ఇది పక్కా పిల్లలకు కాదులే అనిపించింది. సెన్సార్ బోర్డు ‘ఎ' వెయ్యగానే థాంక్యూ సార్ అని చెప్పాలనిపించింది. కానీ నాకు ఎక్కడ కాలిందంటే ‘ఎ' సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత కొన్ని వర్డ్స్ మ్యూట్ చేయాలని అడిగారు. ఆ సిచ్యువేషన్లో మిగతా సీన్లలో ఏమున్నా తీసేస్తాం. కానీ ఓ ఇంపార్టెంట్ సీన్లో ఆ వర్డ్ వాడటం చాలా ఇంపార్టెంట్. అర్జున్ ప్రేమించిన అమ్మాయిపై ఎవరో అసభ్యంగా చేతులు వేస్తారు. నేను చెప్పాను... మన ఇంట్లో మన చెల్లెలు మీదనో, మన గర్ల్ ఫ్రెండ్ మీదనో ఎవరైనా కామెంట్ చేస్తేనే ఏం మాట్లాడుతున్నావురా ***** అంటాం. కానీ సెన్సార్ బోర్డు వాళ్లు ఆ వర్డ్ ఉంచడానికి ఒప్పుకోలేదు. అఫ్ కోర్స్ వాళ్లు పెద్ద వాళ్లు, వారికి తెలుసు ఏం ఉంచాలో, ఏం ఉంచకూడదో.....


మీరే నాకు డబ్బింగ్ చెప్పాలి

సెన్సార్ బోర్డు వారు నన్ను మ్యూట్ చేయగలరేమోగానీ, నా అభిమానులను, ప్రేక్షకులను కాదు..... థియేటర్లో ఆ సీన్ వచ్చినపుడు నన్ను మ్యూట్ చేసినపుడు మీ అందరూ నాకు డబ్బింగ్ చెప్పాలి. ఆర్ యూ రెడీ.....అంటూ ఆ బూతు పదాన్ని ప్రీ రిలీజ్ ఫంక్షన్లో అందరూ పలికేలా చేశాడు విజయ్. ఆ బూతు పదం ఇక్కడ వీడియోలో చూడండి.


మిమ్మల్ని ఎవడైనా ఏమైనా అంటే...

మిమ్మల్ని ఎవడైనా ఏమైనా అంటే...

మనతో, మీ అందరితో ఎవడైనా మీ వల్ల కాదురా, మీరేం పీకలేరురా, యూ కాంట్ డూ దిస్ అని ఉచిత సలహాలిస్తే ఏం మాట్లాడుతున్నావురావ్ రా ****** అని గట్టిగా కౌంటర్ ఇవ్వండి. మన చుట్టూ ఉన్న ఆడవారిని ఎవరైనా మ్యానర్స్ లేకుండా డిస్ రెస్పెక్ట్ చేస్తే ఏం మాట్లాడుతున్నావ్ రా *****, ఎవడ్రావాడు అని కడిగేయండి అంటూ విజయ్ తన అభిమానులకు సూచించారు.


వీడెవడ్రా అని గూగుల్ చేస్తారు

వీడెవడ్రా అని గూగుల్ చేస్తారు

సినిమాలో అర్జున్‌కు బెస్ట్ ఫ్రెండ్ బ్యాచ్ ఉంది. దాంట్లో నా క్లోజెస్ట్ ఫ్రెండ్ ఒకతడి పేరు శివ. శివ నాకు మూవీలో ఫస్ట్ ఇయర్ నుండి చాలా క్లోజ్ ఫ్రెండ్. అర్జున్ ప్రతి ప్రాబ్లంలో, అర్జున్ ప్రతి హ్యాపీనెస్‌లో, ప్రతి సీన్లో శివ అనే వాడు తోడుంటాడు. మనందరికీ అలాంటి ఫ్రెండ్ ఒకడు ఉంటాడు. చాలా బ్రలియంట్ పెర్ఫార్మెర్. సినిమా చూసిన తర్వాత వీడెవడ్రా అని మీరంతా గూగుల్ చేస్తారు. అతడి పేరు రాహుల్ రామకృష్ణ అని విజయ్ దేవర కొండ తెలిపారు.


విజయ్ దేవర కొండ పూర్తి స్పీచ్

విజయ్ దేవరకొండ పూర్తి స్పీచ్ చూడండి. విజయ్‌దేవర కొండ, షాలిని హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం 'అర్జున్‌ రెడ్డి'. సందీప్‌రెడ్డి వంగా దర్శకుడు. ప్రణయ్‌ రెడ్డి వంగా నిర్మాత. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుక హైదరాబాద్‌లో జరిగింది.English summary
Vijay Devarakonda Speech at 'Arjun Reddy' movie Audio Launch. 'Arjun Reddy' movie Starring Vijay Deverakonda, Shalini, Music Composed by Radhan, Directed by Sandeep Vanga and Produced by Pranay Vanga under the banner of Bhadrakali Pictures.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu