అరవింద్ సార్ అంటూ ట్వీట్ చేసిన విజయ్ దేవరకొండ!
గత రాత్రి మహానటి చిత్ర యూనిట్ కు అల్లు అరవింద్ పార్టీ ఇచ్చారు. మహానటి చిత్ర సభ్యులందరినీ పిలిచి ఆయన సత్కరించారు. ఈ వేడుకకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా హాజరు కావడం విశేషం. మహానటి చిత్ర యూనిట్ లో అశ్విని దత్, కీర్తి సురేష్, విజయ్ దేవరకొండ, నాగ అశ్విన్ హాజరయ్యారు.

తమని పిలిచి పార్టీ ఇచ్చిన అల్లు అరవింద్ కు విజయ్ దేవరకొండ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశాడు. థాంక్యూ అరవింద్ సార్ అంటూ విజయ్ సోషల్ మీడియాలో స్పందించడం విశేషం. ఇండస్ట్రీని ఒక్కతాటిపై తీసుకుని వచ్చే ఇలాంటి కార్యక్రమాలు చేయడం మంచిదని అభిప్రాయ పడ్డాడు.
ఈ పార్టీలో దుల్కర్ సల్మాన్, సమంతని మిస్ అవుతున్నట్లు విజయ్ దేవరకొండ తెలిపాడు. మహానటి చిత్రం విడుదలై మంచి వసూళ్ళని సాధిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటించగా, జెమినీ గణేశన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ నటించాడు. సమంత, విజయ్ దేవరకొండ కీలక పాత్రల్లో మెరిశారు. మహానటి చిత్రానికి సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి.


Click it and Unblock the Notifications











