»   » రాజమౌళి నా తండ్రి, సమంత మరదలు.... తాతయ్యపై ‘అర్జున్ రెడ్డి’ హీరో సెటైర్లు!

రాజమౌళి నా తండ్రి, సమంత మరదలు.... తాతయ్యపై ‘అర్జున్ రెడ్డి’ హీరో సెటైర్లు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

'అర్జున్ రెడ్డి' సినిమాపై కాంగ్రెస్ పార్టీ నేత వి.హనుమంతరావు కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా యువతను చెడగొట్టే విధంగా ఉందని, ఇలాంటి సినిమాలకు అనుమతి ఎలా ఇచ్చారంటూ ఆయన ఆగ్రహంగా ఉన్నారు.

అయితే ఇటీవల 'అర్జున్ రెడ్డి' సినిమా చూసిన మంత్రి కేటీఆర్.... విజయ్ దేవరకొండ రాక్ స్టార్ అని, సినిమా బావుందని మెచ్చుకున్నారు. దీంతో హనుమంతరావు ఫైర్ అయ్యారు. మంత్రి కేటీఆర్ కు హీరో విజయ్ దేవరకొండ బంధువు అవుతాడని, అందుకే, 'అర్జున్ రెడ్డి' సినిమా బాగుందంటూ ఆయన ప్రశంసించారని ఆరోపించారు.

ఘాటుగా స్పందించిన విజయ్ దేవరకొండ

ఘాటుగా స్పందించిన విజయ్ దేవరకొండ

వి.హనుమంతరావు తన సినిమా చూసి మెచ్చుకున్న కేటీఆర్‌ను ఉద్దేశించి కామెంట్ చేయడంతో హీరో విజయ్ దేవరకొండ ఘాటుగా స్పందించాడు. ‘తాతయ్యా చిల్' అనే యాష్ ట్యాగ్‌తో విహెచ్ మీద సెటైర్లు వేశారు.

అలా అయితే రాజమౌళి నాకు నాన్న అవుతారు

అలా అయితే రాజమౌళి నాకు నాన్న అవుతారు

డియర్ తాతయ్యా, అర్జున్ రెడ్డి' సినిమా బాగుందని కేటీఆర్ అనడం వల్లే ఆయనకు నాకు బంధువైతే..... నా సినిమా చూసి మెచ్చుకున్న ఎస్ఎస్ రాజమౌళి గారు నాకు నాన్న అవుతారు అంటూ విజయ్ కామెంట్ చేశారు. రానా దగ్గుబాటి, నాని, శర్వానంద్, వరుణ్ తేజ్ నా సోదరులు అవుతారు. నాకు సోదరీమణులు లేరు కాబట్టి, సమంతా, అనూ ఇమ్మానుయేల్, మెహ్రీన్ నాకు మరదళ్లు అవుతారు. ఐదు రోజుల్లో 5000 ప్రదర్శనలను హౌస్ ఫుల్ చేసిన నా స్టూడెంట్స్, పురుషులు, మహిళలు అందరూ నా కవలలు'' అవుతారంటూ కామెంట్ చేశారు.

ఆర్జీవీ ఎవరి తండ్రో...

ఆర్జీవీ ఎవరి తండ్రో...

ఆర్జీవి సార్ అయితే మన ఇద్దరిలో ఎవరి తండ్రో ఇంకా క్లారిటీ లేదు... ఈ విషయాన్ని మన ఇద్దరం కలిసి తేల్చుకుందాం, తాతయ్య చిల్ అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

విహెచ్ ఆందోళన

విహెచ్ ఆందోళన

‘అర్జున్ రెడ్డి' చిత్రంలో విపరీతంగా డ్రగ్స్ తీసుకోవడం చూపించారు. ర్యాగింగ్ చేసి పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ చేసిన సీన్లు ఉన్నాయి. ఇలాంటి అభ్యంతరకర సీన్లు చాలా ఉన్నాయి. ఇలాంటి వాటి వల్ల యువత చెడిపోతుందని విహెచ్ ఆనందోళన వ్యక్తం చేశారు.

కేటీఆర్ ఏంటిది?

కేటీఆర్ ఏంటిది?

‘అర్జున్ రెడ్డి' లాంటి సినిమాలను తప్పుబట్టడం పోయి... మంత్రి కేటీఆర్ లాంటి వారు సినిమాను సపోర్టు చేస్తూ కామెంట్స్ చేయడం ఏమిటి? ఒక మంత్రి స్థాయిలో ఉండి ఆయన యువతకు ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు? అని వీహెచ్ ప్రశ్నించారు.

సెన్సార్ బోర్డుకు, సీపీకి కంప్లయింట్

సెన్సార్ బోర్డుకు, సీపీకి కంప్లయింట్

‘అర్జున్ రెడ్డి' సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మంగళవారం ఆయన సెన్సార్ బోర్డుకు, నగర పోలీస్ కమీషనర్‌కు ఫిర్యాదు చేశారు. సీఎం కేసీఆర్ వెంటనే రంగంలోకి దిగి ఈ సినిమాపై తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

English summary
"According to your incredibly well thought out logic. If appreciating #ArjunReddy makes KTR my relative. Then SS Rajamouli garu is my father. Rana Daggubati Actor Nani Sharwanand Varun Tej are my brothers. Naku sisters ante feeling Ella untado teliyadu kabbati Samantha Ruth Prabhu Anu Emmanuel and Mehreen Pirzada na mardalu." Vijay Devarakonda said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu