Don't Miss!
- Finance
Stock Market: ఒడిదొడుకుల్లో స్టాక్ మార్కెట్లు.. ఇక ఒక్కరోజే టైమ్.. జాగ్రత్త ట్రేడర్స్
- News
రాహుల్ పాదయాత్ర భారీ సక్సెస్- 191కి పెరిగిన కాంగ్రెస్ స్కోరు-పార్ట్ 2కు సన్నాహాలు ?
- Sports
INDvsNZ : ఇదేం ఆట? అంటూ.. హార్దిక్ పాండ్యాపై మండిపడుతున్న ఫ్యాన్స్..
- Automobiles
కుర్రకారుని ఉర్రూతలూగించే 'అల్ట్రావయోలెట్ F77 రీకాన్' రివ్యూ.. ఫుల్ డీటైల్స్
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
ఆనంద్‌కు 10/10 మార్కులు.. లైగర్ కోసం అమెరికాకు, మీదే బాధ్యత.. పుష్పక విమానం ప్రీరిలీజ్ ఈవెంట్‌లో విజయ్ ఎమోషనల్
యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటించిన కొత్త చిత్రం పుష్పక విమానం సినిమా నవంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సురేష్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్, ఫ్రీజ్ ఫ్రేమ్ ఫిలింస్ సంస్థలు ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాయి. పుష్పక విమానం చిత్రాన్ని నూతన దర్శకుడు దామోదర తెరకెక్కించారు. సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ సమర్పిస్తున్న ఈ మూవీని కింగ్ అఫ్ ది హిల్ ఎంటర్టైన్‌మెంట్, టాంగా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. గోవర్ధన్ రావు దేవరకొండ, విజయ్ మట్టపల్లి ,ప్రదీప్ ఎర్రబెల్లి ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా వైజాగ్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ..

కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించడానికే..
ప్రేక్షకులు, అభిమానులపై నమ్మకంతోనే కింగ్ ఆఫ్ ది హిల్ అనే నా సొంత బ్యానర్‌పై పుప్పక విమానం సినిమా తీశాను. పెళ్లి చూపులు సినిమా సమయంలోనే నేను, తరుణ్ భాస్కర్ ఎలాంటి ఇబ్బందులు పడ్డామో తెలుసు. అందుకే కొత్తగా వచ్చే దర్శకులు, నటులు ఇబ్బందులు పడకుండా వారి టాలెంట్‌ను ప్రోత్సహించడానికే నేను నిర్మాతగా మారాను అని విజయ్ దేవరకొండ అన్నారు.

నిర్మాతగా సినిమా తీయడం చాలా కష్టం
పుష్పక విమానం సినిమా రిలీజ్ సమయంలో నేను ఉండటం లేదు. లైగర్ సినిమా కోసం అమెరికాకు వెళ్తున్నాను. కాబట్టి ఈ సినిమాను మీరే నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లాలి. మీ మీద నమ్మకంతోనే నేను ఈ సినిమాను మీ ఊరికి తీసుకొచ్చాను. నిర్మాతగా సినిమా తీయడం చాలా కష్టంగా ఉంది. నా సినిమాలు, నా సినిమా ప్రమోషన్స్ చూసుకోవడానికే నేను ప్యాక్ అవుతున్నాను. సినిమా తీయడమనేది చాలా పెద్ద బాధ్యత. ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్లడం చాలా పెద్ద రెస్పాన్స్‌బిలిటీ అని విజయ్ దేవరకొండ పేర్కొన్నారు.

ఓవర్ కాన్ఫిడెన్స్‌తోనే అంటూ
నేను ఏ పని చేసిన కాన్ఫిడెన్స్‌తో చేస్తాను. పుష్పక విమానం సినిమాను అదే నమ్మకంతోను, అలాగే మీ మీద ఉన్న ఓవర్ కాన్ఫిడెన్స్‌తోనే నిర్మించాను. మనమంత కలిసి ఈ సినిమా విషయంలో ఆగ్ లగా దేంగే అంటూ అభిమానుల్లో విజయ్ దేవరకొండ జోష్‌ను పెంచే ప్రయత్నం చేశారు.

లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాలో నటించే సమయంలో
పుష్పక విమానం సినిమా భవిష్యత్‌కు సంబంధించిన క్రెడిట్ అంతా యువ టాలెంట్‌దే. ఈ సినిమా ఎక్సైటింగ్ కనబడటానికి కారణం ఈ సినిమాలోని యంగ్ టీమ్‌దే. డైరెక్టర్ సృజన్ నాకు 2012 నుంచి నాకు తెలుసు. నేను లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాలో నటించే సమయంలో సృజన్‌లోని టాలెంట్ గుర్తించాను. ఆ సమయంలో నీకు బ్రేక్ వస్తే. . నేను నీతో సినిమా చేయడానికి స్క్రిప్టు ఉందని సృజన్ చెప్పాడు. నీ రైటింగ్‌తో ఈ సినిమాను మరో లెవెల్ తీసుకెళ్లావు అని విజయ్ దేవరకొండ అన్నారు.

ఆనంద్ పెర్ఫార్మెన్స్‌కు 10/10
పుష్పక విమానం సినిమాలో భార్య లేచిపోయిన భర్తగా, టీచర్‌గా ఆనంద్ దేవరకొండ అద్బుతంగా నటించాడు. అతడికి 10/10 మార్కులు వేస్తాను. ముందు ఈ సినిమా కథ చెబితే.. భర్త, టీచర్‌గా నీవు ఎలా చేస్తావు.. ప్రేక్షకులు ఒప్పుకొంటారా అనే సందేహాలు వ్యక్తం చేశాను. కానీ సృజన్, ఆనంద్ దేవరకొండ బాగా కష్టపడి సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లాడు. ఈ సినిమాలో నటించినందుకు ఇటీవలే ఆనంద్‌కు రెమ్యునరేషన్ ఇచ్చా అని విజయ్ దేవరకొండ తెలిపారు.
Recommended Video

అందమైన ఇద్దరు హీరోయిన్ల గురించి
పుష్పక విమానంలో అందమైన హీరోయిన్లు గీత్, శాన్వీ మేఘన గురించి చెప్పుకోవాలి. సినిమా ట్రైలర్‌లో లేచిపోయిన అమ్మాయిగా గీత్ చూశారు. కానీ సినిమా చూస్తే ఆ అమ్మాయి గురించే ఆలోచిస్తాం. ఆమె ముద్దుగా నటించింది. సినిమాలో గీత్ అద్బుతంగా నటించింది. శాన్వీ మేఘన టాలెంట్ గురించి నేను చూశాను. ఆమె టాలెంట్‌కు తగినట్టుగా స్క్రిప్టులు రాయాలి అని విజయ్ దేవరకొండ ఎమోషనల్ అయ్యారు.