పూరి- విజయ్ దేవరకొండ మూవీ లేటెస్ట్ అప్‌డేట్.. ముంబైలో మొదలెట్టిన ఛార్మి

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో రాబోతున్న కొత్త సినిమా షూటింగ్ ప్రారంభమైంది. గత కొంతకాలంగా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్న పూరి, ఛార్మి తాజాగా చిత్ర షూటింగ్ మొదలు పెట్టేశారు.

ఈ రోజు (జనవరి 20) ఈ సినిమా షూటింగ్ ముంబైలో ప్రారంభమైంది. మొదటి షాట్ విజయదేవరకొండపై చిత్రీకరించారు. ఈ షాట్‌కి ఛార్మి క్లాప్ కొట్టగా, పూరి దర్శకత్వం వహించారు. ఈ మేరకు ఈ విషయాన్ని తెలుపుతూ చిత్ర ప్రారంభోత్సవానికి సంబంధించిన పిక్స్ షేర్ చేసింది చిత్రయూనిట్. ఈ సినిమాకు ఫైటర్ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు టాక్ నడుస్తోంది.

 Vijay Deverakonda- Puri Jagannadh Movie started

ధర్మ ప్రొడక్షన్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ సంయుక్త సమర్పణలో ఈ సినిమా తెరకెక్కనుంది. కారం జోహార్ నిర్మాణంలో భారీ ఎత్తున ఈ సినిమాను ఫ్యాన్ ఇండియా లెవెల్‌లో రూపొందించనున్నారు. ఇస్మార్ట్ శంకర్ లాంటి సక్సెస్ తరువాత చేస్తోన్న పూరి చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెట్టుకున్నారు ప్రేక్షకులు.

బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుందని, ఇందులో బాక్సర్‌గా విజయ్ దేవరకొండ నటిస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. దీనిపై అఫీషియల్ సమాచారం బయటకు రాకముందే ఈ సినిమా పూరి కెరీర్‌లో వచ్చిన ఓ సినిమాకు సీక్వల్ అనే మరో సమాచారం కూడా షికారు చేస్తోంది. త్వరలో చిత్రానికి సంబంధించిన నటీనటుల వివరాలు ప్రకటించనున్నారు మేకర్స్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X