»   » విజయ్ దేవరకొండ ‘టాక్సీవాలా’.... ఫస్ట్ గేర్ అదిరింది (టీజర్)

విజయ్ దేవరకొండ ‘టాక్సీవాలా’.... ఫస్ట్ గేర్ అదిరింది (టీజర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Taxiwaala First Gear : Vijay Deverakonda, Priyanka Jawalkar

పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి లాంటి హిట్ చిత్రాలతో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు విజయ్ దేవరకొండ. ఈ క్రేజీ స్టార్ ప్రస్తుతం జిఏ 2 మరియు యువి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న 'టాక్సీవాలా' చిత్రంలో నటిస్తున్నాడు. తాజాగా ఫస్ట్ గేర్ పేరుతో ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదలైంది.

ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ తన గత చిత్రాలకు భిన్నంగా డిఫరెంట్ యాటిట్యూడ్‌తో కనిపించబోతున్నాడు. ఎనర్జిటిక్ క్యారెక్టర్లో అభిమానుల్లో హుషారెత్తించనున్నాడు. తాజాగా విడుదలైన టీజర్ ఫ్యాన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

'టాక్సీవాలా' సినిమా ద్వారా రాహుల్ సంకృత్యాన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఎస్‌కె‌ఎన్ నిర్మాత‌. రెండు పెద్ద సంస్థలు కలిసి నిర్మిస్తున్న చిత్రం కావడంతో నిర్మాణ విలువల విషయంలో ఏ మాత్రం లోటు ఉండబోదని స్పష్టమవుతోంది.

విజయ్ దేవరకొండ అభిమానుల అంచనాలకు ఏ మాత్రం తీసుపోకుండా టాక్సీవాలా చిత్రం రూపుదిద్దుకుంటుందని, విజయ్ కెరియర్‌లో మరో మైలురాయిగా 'టాక్సీవాలా' ఉండబోతోందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. 

English summary
Taxiwaala First Gear on UV Creations. #Taxiwaala 2018 latest Telugu movie ft. Vijay Deverakonda, Priyanka Jawalkar and Malavika Nair. Jointly produced by UV Creations and GA2 Pictures. Music by Jakes Bejoy. Directed by Rahul Sankrityan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X