»   » ‘నోటా’...చూస్తే తేడాగా ఉంది, విజయ్ దేవరకొండను రాజకీయాల్లో లాగారా? (ఫస్ట్ లుక్)

‘నోటా’...చూస్తే తేడాగా ఉంది, విజయ్ దేవరకొండను రాజకీయాల్లో లాగారా? (ఫస్ట్ లుక్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

విజయ్ దేవరకొండ హీరోగా త్వరలో 'నోటా' అనే టైటిల్‌తో సినిమా రాబోతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ విడుదలైంది. ఇందులో ఇంక్‌ మార్క్‌ వేసి ఉన్న మధ్య వేలును చూపిస్తూ విజయ్‌ దేవరకొండ ఫోజు ఉండటం చర్చనీయాంశం అయింది.

ఇది పొలిటికల్ సినిమానా? లేక మరేదైనా? కొత్త కాన్సెప్టా? అనేది అర్థం కావడం లేదు. ఈ పోస్టర్ చూసిన వారికి చాలా డౌట్స్ వస్తున్నాయి. మిడిల్ ఫింగర్ అలా చూపించడం ఒక రంగా బూతుగా పరిగణిస్తారు. మరి ఈ సినిమా కాన్సెప్టు ఏమిటి? అనేది తెలియాల్సి ఉంది. కాగా... రాజకీయ నాయకుడైన హీరో తండ్రి, తన కొడుకును ఏ విధంగా రాజకీయాల్లోకి లాగాడు అన్న కథాంశంతో చిత్రం సాగుతుందనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.

Vijay Deverakonda’s upcoming bilingual film titled NOTA

ఇంక్ మార్కుబట్టి ఇది పొలిటికల్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని అర్థం చేసుకోవచ్చు. ఎన్నికల కోణంలో చూస్తే .... 'నోటా' (NOTA) అంటే 'ఈవీఎం'లో సూచించిన అభ్యర్థులనెవరినీ నేను ఎన్నుకోవడం లేదంటూ ఓటర్ తన అభిప్రాయాన్ని తెలియజేయడం.

Vijay Devarakonda Coming With A New Game

ఈ చిత్రానికి తమిళ దర్శకుడు ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. తమిళ నిర్మాత జ్ఞానవేల్ రాజా నిర్మాత. తెలుగుతో పాటు తమిళంలో ఈచిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో ఈ చిత్రంలో విజయ్ సరసన మెహ్రీన్ నటిస్తోంది. కీలక పాత్రల్లో సత్యరాజ్‌, నాజర్‌లు నటిస్తున్నారు. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

English summary
Vijay Deverakonda’s next with Anand Shankar titled ‘NOTA’. makers officially announced the news on Twitter. The first look poster has Vijay showing the finger.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu