»   » ఆమే అదృష్ట నక్షత్రమా అందుకే మూడో సారి కూడా నయన తారేనట... ఈ కొత్త ట్విస్టులేమిటో

ఆమే అదృష్ట నక్షత్రమా అందుకే మూడో సారి కూడా నయన తారేనట... ఈ కొత్త ట్విస్టులేమిటో

Posted By:
Subscribe to Filmibeat Telugu

నయనతార పేరుకు తగ్గట్టే ఎప్పుడు చూసినా ఏ సినిమాలో చూసినా కొత్తగానే కనిపిస్తుంది. వెండితెరపై 12 ఏళ్లుగా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. కెరీర్ స్టార్ట్ చేసిన తక్కువ టైమ్‌లోనే నయనతార టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. 12 ఏళ్ల కెరీర్‌లో రెండుసార్లు లవ్‌లో ఫెయిల్ అయినా.. మళ్ళీ కెరీర్‌పై దృష్టిపెట్టి అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్‌గా ఇప్పటికీ టాప్‌ఛైర్‌లో కూర్చుంది. చాలా మంది హీరోయిన్స్ మాదిరి మోడలింగ్ రంగం నుంచి వచ్చి ఒక సినిమాలో మాత్రమే నటిద్దామనుకుని కెరీర్ స్టార్ట్ చేసి... నయన తక్కువ టైంలో 50 సినిమాలు పూర్తి చేసింది. అడుగుపెట్టిన ప్రతి లాంగ్వేజ్‌లోనూ క్రేజీ హీరోయిన్నే. తెలుగులోనే కాదు తమిళ, మలయాళంలో టాప్ హీరోయిన్‌గా నిలిచింది. ఇలా ఇన్ని భాషలను ఏలిన హీరోయిన్ ఈ మధ్యకాలంలో నయనే. కాంట్రవర్సీలతో కాపురం చేసినా.. ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు దట్స్ నయన్..

ఈ విషయాన్ని గమనించాడేమో అట్లి ఇప్పటికీ చేసింది రెండు చిత్రాలే అయినా అవి దర్శకుడిగా ఆయన్ని మంచి స్థానంలో కూర్చోబెట్టాయి. అట్లి తొలి చిత్రం రాజారాణిలో హీరోయిన్ గా చేసిన నయన్ నే అట్లి తన అదృష్ట తార గా భావిస్తున్నాడట. తదుపరి చిత్రం తెరిలో హీరోగా విజయ్‌ను హీరోగా ఎంచుకుని హీరోయిన్లుగా సమంత, ఎమీజాక్సన్‌లను ఎంపిక చేసుకున్నారు. ఆ చిత్రం ఘన విజయాన్ని సాధించినా,తన లక్కీ హీరోయిన్ నయనతారగానే భావిస్తున్నారని సమాచారం. ఎందుకంటే రాజారాణి చిత్ర షూటింగ్ తొలి సన్నివేశాన్ని నయనతారపైనే చిత్రీకరించారు. కాగా అట్లీ తన మూడో చిత్రానికి నయనతారనే ఎంచుకోవడం గమనార్హం. ఇళయదళపతి విజయ్ 61వ చిత్రాన్ని అట్లీ దర్శకత్వం వహించనున్నారు. ఇందులో సంచలనతార నయనతార నాయకిగా నటించనున్నారన్నది తాజా సమాచారం. ఈ చిత్రాన్ని శ్రీతేనాండాళ్ ఫిలింస్ సంస్థ భారీ ఎత్తున్న నిర్మించనుంది.

Vijay, Nayan and Atlee getting back together for Sri Thenandal Films

ఇందులో తన లక్కీ హీరోయిన్ నయనతారను చాలా కొత్త యాంగిల్‌లో మరింత యవ్వనంగా చూపించనున్నారట. అందుకోసం సరికొత్త లొకేషన్స్‌ను. ఢిపరెంట్ కాస్ట్యూమ్స్‌ను రెడీ చేయిస్తున్నారట. మరో విషయం ఏమిటంటే అట్లీ చిత్రంలో వినూత్నంగా కనిపించడానికి నయన్ తను అందాలకు మెరుగులు దిద్దుకునే ప్రయత్నాలకు రెడీ అవుతున్నారట. ఈ చిత్రం డిసెంబర్‌లో సెట్ పైకి వెళ్లనుంది.

అప్పటిలోగా తన అందాలను ద్విగిణీకృతం చేసుకోవడానికి కసరత్తులు మొదలెట్టారన్న టాక్ కోలీవుడ్‌లో వినిపొస్తోంది. కాగా ఈ చిత్రంతో ఇళయదళపతితో ముచ్చటగా మూడోసారి రొమాన్స్ చేయడానికి నయనతార సిద్ధం అవుతున్నారు. ఇంతకు ముందు విల్లు చిత్రంలో నాయకిగానూ, శివకాశి చిత్రంలో ఒక ప్రత్యేక పాత్రలోనూ విజయ్‌తో నయన్ జత కట్టారన్నది గమనార్హం.

English summary
Vijay, Nayan and Atlee getting back together for Sri Thenandal Films next the project is firming up and the team is getting ready for an official announcement during Diwali.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu