»   » కూల్ డ్రింక్స్, బీరుతో అభిషేకం చేసిన హీరో ఫ్యాన్స్

కూల్ డ్రింక్స్, బీరుతో అభిషేకం చేసిన హీరో ఫ్యాన్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రజనీకాంత్ అభిమానులు చేస్తున్న పాల వృధాపై ఇటీవల కోర్టులో ఇంజక్షన్ సూట్ దాఖలైంది. ఆయన సినిమా విడుదల సందర్భంగా పోస్టర్లను అభిషేకించడానికి వేల లీటర్ల పాలను వృథా చేస్తున్నారని, అలా చేయకుండా రజనీకాంత్‌కి, ఆయన అభిమానులకి ఆదేశాలు జారీ చేయాలని ఓ వ్యక్తి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ విషయంలో కోర్టు రజనీకాంత్‌కు నోటీసులు జారీ చేసింది.

రజనీకాంత్ తర్వాత తమిళనాడులో ఆ రేంజిలో ప్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ విజయ్. విజయ్ నటించిన 'తేరి' చిత్రం ఈ రోజు తమిళనాడు వ్యాప్తంగా విడుదలైంది. పాలాభిషేకంపై కోర్టు ఆదేశాలు ఉండటంతో......ఫ్యాన్స్ మరోలా ఆలోచించారు. విజయ్ పోస్టర్లకు కూల్ డ్రింక్స్ కోక్, థమ్సప్, పెప్సి లాంటి వాటితో అభిషేకం చేసారు. కొందరు బీర్లు, పెరుగు ప్యాకెట్లతో అభిషేకం చేయడానికి ప్రత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.

అభిమానం ఉండొచ్చు...వీరాభిమానం ఉండొచ్చు... కానీ అభిమానం పేరుతో అనవసర వృధా చేయడం ఎంత వరకు సబబు? తమ అభిమాన హీరో సినిమాలు విడుదలైనపుడు అభిమానులు సంబరాలు జరుపుకోడం, పెద్ద పెద్ద బేనర్లు, కటౌట్లు ఏర్పాటు చేయడంతో ఇలాంటి వృధా చేయడం కూడా ఎక్కువ అవుతోంది. ఇక తొలి రోజు, తొలి షో చూడాలని పోటీ పడ్డ అభిమానులు ఉదయం 8 గంటల షోకు ఒక్కోటి రూ. 700 పెట్టి టిక్కెట్ కొన్నట్లు సమాచారం.

Vijay's fans cool drinks Abhishekam

తెలుగులో 'పోలీస్'గా రిలీజ్

"తెరి" చిత్రం తెలుగులో "పోలీసోడు" అనే టైటిల్ తో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసారు. తేరి చిత్రానికి పోలీసోడు అనే టైటిల్ ను పెడితే బాగుంటుంది అని నిర్ణయించింది నిర్మాత కలయిపులి ఎస్ థాను. దిల్ రాజు గారు ఈ చిత్రాన్ని తెలుగు లో కేవలం విడుదల మాత్రమే చేస్తున్నారు.

అయితే, కొన్ని పోలీస్ సంఘాలు దిల్ రాజు గారిని కలిసి, ఈ టైటిల్ పై అభ్యంతరం తెలపటం తో, అయన ఈ విషయాన్నీ నిర్మాత కలయిపులి ఎస్ థాను కు వివరించారు. ఎవరి మనోభావాలు దెబ్బ తినకూడదు అనే ఉద్దేశం తో ఈ టైటిల్ ను పోలీస్ గా మరుస్తున్నట్టు ఈ చిత్రాన్ని తెలుగు లో విడుదల చేస్తున్న దిల్ రాజు తెలిపారు. ఈ చిత్రం ఏప్రిల్ 15 న తెలుగు రాష్ట్రాలలో "పోలీస్" పేరు తో గ్రాండ్ గా విడుదల అవుతుంది. .

ఈ చిత్రానికి ఇప్పటికే సెన్సార్ బోర్డు U సర్టిఫికేట్ ను ఇచ్చింది. భారీ వ్యయం తో, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని అట్లి తెరకెక్కించారు.

Vijay's fans cool drinks Abhishekam

విజయ్ , సమాంత, అమీ జాక్సన్, ప్రభు, రాధిక, మహేంద్రన్ వంటి ప్రముఖ నటులు ఈ చిత్రం లో ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు

దర్శకత్వం - స్క్రీన్ప్లే - అట్లి .ఫోటోగ్రఫీ - జార్జ్ సి విలియమ్స్ . ఎడిటర్ -అన్తోనీ రుబెన్ . సంగీతం - జి . వి . ప్రకాష్ కుమార్. ఎగ్జిక్యుటివ్ ప్రొడ్యూసర్ : సతీష్ , సహా నిర్మాతలు - శిరీష్ , లక్ష్మణ్. నిర్మాతలు - రాజు , కలయిపులి ఎస్ థాను.

English summary
Ilayathalapathy Vijay's much awaited movie Theri has finally hit the screens. Vijay's fans cool drinks Abhishekam on Theri posters.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu