»   » ఐసీయూ లో స్టార్ హీరో తండ్రి, అంతా పరామర్శలు,ఫోన్స్

ఐసీయూ లో స్టార్ హీరో తండ్రి, అంతా పరామర్శలు,ఫోన్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : ప్రముఖ తమిళ దర్శకుడు, హీరో విజయ్ తండ్రి ఎస్‌ఏ చంద్రశేఖర్ ఆస్పత్రిలో చేరారు. కేరళలోని కుమారకంలోని ఓ రిసార్ట్‌లో జారిపడటంతో చంద్రశేఖర్ తల, వెన్నెముక, మెడకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో చంద్రశేఖర్ చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రిలో చేరారు.

చంద్రశేఖర్ మెడకు తీవ్ర గాయమవడంతో అత్యవసరంగా ఆపరేషన్ చేసినట్లు ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. తన కొత్త సినిమా ప్రిపరేషన్‌లో భాగంగా చంద్రశేఖర్ కుమారకంలోని రిసార్ట్‌కు వెళ్లగా ఈ ఘటన చోటు చేసుకుంది.

Vijay's Father SA Chandrasekhar Undergoes Surgery After Suffering Head & Back Injuries From A Fall

ఆయన తన తాజా చిత్రం డిస్కషన్స్ నిమిత్తం కుమారకం వెళ్ళటం జరిగింది. ఇక ఈ సంఘటన నిన్న ఉదయం చోటు చేసుకుంది. టాయిలెట్ లో స్లిప్ అయి పడటంతో తలకు బాగా దెబ్బలు తగిలాయి. ఆయన వద్ద ఉన్న ఇద్దరు అసెస్టెంట్ డైరక్టర్స్ వెంటనే ఆయన్ను హాస్పటిల్ కు తీసుకు వెళ్లారు.

సర్జరీ అనంతరం ఆయన్ను డాక్టర్లు ఓ వారం పాటు ఎక్కడికి కదలకుండా రెస్ట్ తీసుకోమని చెప్పారు. అలాగే ఆయన చాలా స్పీడుగా రికవరి అవుతున్నారని , ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలియచేసారు.

ఈ 71 సంవత్సరాల దర్శకుడు త్వరలోనే హాస్పటిల్ నుంచి డిశ్చార్జ్ అవనున్నారు. ఇక ఆయన త్వరగా కోలుకోవాలని ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు, పెద్ద పెద్ద నిర్మాతల నుంచి ఫోన్స్ వస్తున్నాయని తెలుస్తోంది. విజయ్ తో ఉన్న అనుభంధంతో చాలా మంది ఆయన్ని పరామర్శిస్తున్నారు.

English summary
layathalapathy Vijay's father SA Chandrasekhar slipped and fell at a resort in Kumarakom on Wednesday (August 24) and had to immediately undergo a surgery at a private hospital here in Kerala.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu