For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  చిత్రంలో ఆశ్చర్యాలు...అద్బుతాలు ఇవే (‘పులి’ ప్రివ్యూ)

  By Srikanya
  |

  హైదరాబాద్ : పిల్లలు,పెద్దలను అలరించే సోషియో ఫాంటసీ చిత్రాలు తెలుగులో తక్కువే. అందుకేనేమో డబ్బింగ్ చిత్రమైనా పులికి ఇక్కడ మంచి క్రేజ్ వచ్చింది. దీనికి తోడు..శ్రీదేవి, హన్సిక, శృతి హాసన్,సుదీప్ వంటి తెలుగుకు పరిచయమున్న స్టార్స్ నటించటం కూడా సినిమాపై ఆసక్తిని పెంచేసింది. చాలా కాలం తర్వాత శ్రీదేవి నటించి,డబ్బింగ్ చెప్పిన చిత్రం తెలుగులో రిలీజ్ అవటం కూడా శ్రీదేవి అభిమానులకు ఆనందమే. ఇంతకీ ఈ సినిమా అభిమానుల అంచనాలను రీచ్ అవుతుందా లేదా అనేది తెలియాలంటే కొద్ది గంటల సేపు ఆగాల్సిందే.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  'ఇలయ తలబది' విజయ్‌.. ఈ పేరు వెనుక ప్రేక్షకుల్లో ఉన్న ఉత్సాహం, అభిమానుల్లో కేరింతలకు వెండితెరే సాక్ష్యం. స్క్రీన్‌పై ఈ పేరు పడగానే థియేటర్‌లో కూర్చున్న అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపవుతుందనడంలో సందేహం లేదు. అందర్నీ ఆకట్టుకునే మాస్‌ గుణం, వైవిధ్య నటన, తనదైన శైలి డైలాగులు, దుమ్మురేపే డాన్స్‌.. ఇవన్నీ విజయ్‌ సొంతమనే చెప్పాలి.

  ప్రేమ చిత్రాలు, మాస్‌ సినిమాలతో ఆకట్టుకున్న విజయ్‌ ప్రస్తుతం 'పులి'ద్వారా ఫాంటసీ అడుగులు వేస్తున్నారు. చాలా గ్యాప్‌ తర్వాత శ్రీదేవి ముఖ్యపాత్ర పోషించారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాను 'బాహుబలి', 'ఈగ' వంటి పలు చిత్రాలతో విజయ్‌ అభిమానులు పోలుస్తున్నారు. వైవిధ్యాల సమ్మేళనంగా రూపుదిద్దుకున్న ఈ సినిమాలోని ప్రత్యేకతలేంటో చూద్దాం.

  ఈ చిత్రంలో ఎన్నో విశేషాలు ఉన్నాయి..స్లైడ్ షోలో వాటిని చూద్దామా

  మార్పులు వద్దన్నాడు

  మార్పులు వద్దన్నాడు

  'ఈ సినిమాకు విజయే హీరో' అనుకునే శింబుదేవన్‌ కథను రాసుకున్నారట. ఆ తర్వాత విజయ్‌కి కథ వినిపించగా చాలా బాగుంది.. మార్పులేవీ చేయకండి. అన్ని పాత్రలూ అద్భుతంగా ఉన్నాయని అని చెప్పారు. ఇందులో ఇదివరకటి విజయ్‌ సినిమాల్లో వచ్చే పంచ్‌ డైలాగులకు ఏ మాత్రం కొదవ లేవని సమాచారం.

  హైలెట్ లలో ఇదొకటి

  హైలెట్ లలో ఇదొకటి

  చెన్నై ఆదిత్యరామ్‌ స్టూడియో ప్రాంగణంలో భారీ సెట్‌లు వేశారు. 'జింగిలియా..' పాట కోసం వేసిన సెట్‌లు సినిమాకు మరింత హైలెట్‌గా ఉంటాయని చిత్ర యూనిట్‌ చెబుతోంది. ఆ విషయాన్ని తెరపై చూస్తే స్పష్టమవుతుందంటున్నారు.

  అన్ని గ్రాఫిక్స్ షాట్స్

  అన్ని గ్రాఫిక్స్ షాట్స్

  గ్రాఫిక్స్‌ సన్నివేశాలకు కళా దర్శకుడు ముత్తురాజ్‌, ఇతర నిపుణులు కమలకన్నన్‌ తదితరులు పనిచేశారు. 'నాన్‌ఈ' సినిమాకు 1,200 గ్రాఫిక్‌ షాట్స్‌, 'మగధీర'లో 1,400, 'బాహుబలి'లో 2,000 గ్రాఫిక్‌ షాట్స్‌ ఉన్నాయి. అయితే 'పులి'లో ఏకంగా 2,400 గ్రాఫిక్‌ సన్నివేశాలు ఉన్నాయని చెబుతున్నారు కమలకన్నన్‌.

  వెంటనే శ్రీదేవి

  వెంటనే శ్రీదేవి

  'ఇంగ్లీష్‌ వింగ్లీష్‌' చిత్రం తర్వాత శ్రీదేవి పలు కథలు విన్నా నటించడానికి నిరాకరించారు. అయితే 'పులి' కథ వినగానే ఆమె ఒప్పుకున్నారు. ఈ సినిమా కోసం తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఆమే సొంతంగా డబ్బింగ్‌ చెప్పారు.

  శృతి అనారోగ్యంతో..

  శృతి అనారోగ్యంతో..

  చిత్ర హీరోయిన్ శ్రుతిహాసన్‌ అడవుల్లో చిత్రీకరణ జరుగుతున్నప్పుడు అనారోగ్యానికి గురయ్యారు. అయినప్పటికీ కొండలు ఎక్కే సన్నివేశాల్లో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా శ్రుతి నటించి చిత్రయూనిట్‌ మన్ననలు అందుకున్నారు.

  మూడు గంటలు పాటు..

  మూడు గంటలు పాటు..

  హన్సిక ఇందులో రాణిపాత్ర పోషిస్తున్నారు. ఆమెకు మేకప్‌ వేయడానికి దాదాపు మూడు గంటలు పట్టేదట. 9 గంటలకు చిత్రీకరణ ఆరంభమైతే.. ఆరు గంటలకల్లా ఆమె సెట్‌కు వచ్చి మేకప్‌ వేసుకుని రెడీగా ఉండేదట.

  కామిడీ కేక

  కామిడీ కేక

  తంబిరామయ్య, సత్యన్‌, రోబో శంకర్‌, ఇమాన్‌ అన్నాచ్చి.. హాస్య సన్నివేశాలను రసవత్తరంగా పండించినట్లు సమాచారం. ఇవి కాకుండా సినిమాలోని కొన్ని గ్రాఫిక్‌ మాయాజాలాలు కూడా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయని చెబుతున్నారు.

  వేరే జోనర్

  వేరే జోనర్

  'బాహుబలి'తో తమ 'పులి' చిత్రాన్ని పోల్చలేం. ఎందుకంటే ఇందులో యుద్ధ సన్నివేశాలు లేవు. ఇది వేరే జోనర్‌ చిత్రమని చెబుతోంది చిత్ర యూనిట్‌.

  హోం వర్క్..

  హోం వర్క్..

  ఈ సినిమా కోసం విజయ్‌ ముందురోజే డైలాగులు తీసుకెళ్లి హోంవర్క్‌ చేసేవారట. పోరాట సన్నివేశాల కోసం ఆయన ప్రత్యేకించి తర్ఫీదు పొందారు. ఇక కత్తిసాము కూడా ఇందుకోసం నేర్చుకున్నారు.

  నో అన్న సుదీప్ ...

  నో అన్న సుదీప్ ...

  'ఇక విలన్‌ పాత్రలు చేయను' అని చెప్పిన సుదీప్‌ ఈ సినిమా కథ విన్న వెంటనే విలన్‌గా నటించడానికి ఓకే చెప్పారు. 'పులి'లో ఆయన లోహంతో తయారు చేసిన దుస్తులు వేసుకున్నట్లు సమాచారం. తన పార్టు చిత్రీకరణ పూర్తయ్యేంత వరకు కూర్చోవడానికి కూడా కష్టంగా ఉండేదని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

  కేరళలలో..

  కేరళలలో..

  విజయ్‌, శ్రుతిహాసన్‌ పాడిన 'ఏండి.. ఏండి..' పాట థాయ్‌లాండ్‌, కేరళలోని పలు ప్రాంతాల్లో చిత్రీకరించారు.

  ఇదో సీక్రెట్

  ఇదో సీక్రెట్

  'భైరవ ద్వీపం' సినిమాలో మాదిరిగా ఇందులో కూడా విచిత్ర మరగుజ్జుల సన్నివేశాలు ఉన్నాయి. విజయ్‌ కూడా మరుగుజ్జులా నటించారని సమాచారం. అయితే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతోంది చిత్రయూనిట్

  గుడిసెలో బస

  గుడిసెలో బస

  తలకోన వంటి అడవి ప్రాంతాల్లో చిత్రీకరణ జరిగినప్పుడు విజయ్‌ అందరితోపాటు తాను కూడా ఓ సాధారణ గుడిసెలోనే బస చేశారట. ఆయన కోసం కొన్ని కిలోమీటర్ల దూరంలో ప్రత్యేక వసతి ఏర్పాట్లు చేసినప్పటికీ 'ఇక్కడే చాల'ని ఉండిపోయారని చిత్ర యూనిట్‌ చెబుతోంది.

  మొత్తం

  మొత్తం

  తమిళం, తెలుగు, హిందీ భాషల్లో మొత్తం 3,000 పైగా థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు సమాచారం. జపాన్‌, చైనాలోనూ ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

  ఎవరెవరు...

  ఎవరెవరు...

  బ్యానర్: ఎస్.వి.ఆర్. మీడియా
  నటీనటులు: విజయ్, హన్సిక, శ్రుతిహాసన్, శ్రీదేవి, సుధీప్, ప్రభు, తంబిరామయ్య, సత్యం, జూ.బాలయ్య, నరేన్, మధుమిత, అంజలీదేవి, గాయత్రి తదితరులు
  కెమెరా: నటరాజన్ సుబ్రహ్మణ్యం,
  ఎడిటింగ్: ఎ.శ్రీకర్‌ప్రసాద్,
  సంగీతం: దేవిశ్రీప్రసాద్
  నిర్మాతలు: సింబుతమీన్స్, పి.టి.సెల్వకుమార్,
  తెలుగు వెర్షన్: నిర్మాత సి.జె.శోభ
  రచన, దర్శకత్వం: శింబుదేవన్.
  రన్నింగ్ టైమ్ :154 నిముషాలు
  విడుదల తేదీ : 1 అక్టోబర్ 2015

  English summary
  Starring Ilayathalapathy Vijay, Sridevi, Sudeep, Hansika and Shruti Haasan in the lead, Puli is one of the most anticipated Tamil films of the year. Stay tuned to know if the movie has lived up to its expectations as a detailed review will be updated soon.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X