For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  షాకింగ్ : తెలుగులో డబ్బింగ్ చెప్పటానికే కోటి తీసుకుంటోంది

  By Srikanya
  |

  హైదరాబాద్ : అతిలోక సుందరిగా భారత సినీ పరిశ్రమను తన అంద చెందాలతో ఆకట్టుకున్న తమిళపొన్ను శ్రీదేవి. చాలా గ్యాప్‌ తర్వాత ప్రస్తుతం తమిళంలో 'పులి' చిత్రంలో కీలకపాత్ర పోషించారు. విజయ్‌ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఆమె రాణిగా నటించారు. హన్సిక, శ్రుతిహాసన్‌, సుదీప్‌ తదితరులు నటించారు. ఇటీవలే ఈ సినిమా పాటల విడుదల కార్యక్రమం ఘనంగా జరిగింది. తెలుగులోనూ ఇదే పేరిట విడుదలవుతోంది. తమిళంలో మాత్రమే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపధ్యంలో తెలుగులోనూ ఆమె డబ్బింగ్ చెప్తోందని సమాచారం. తెలుగు డబ్బింగ్ నిమిత్తం ఆమె కోటి రూపాయలు వసూలు చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు.

  ఇదిలా ఉండగా నటి శ్రీదేవి దాదాపు 20 ఏళ్ల తర్వాత తమిళంలో నటిస్తున్న సినిమా కావడం విశేషం. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే... ఈ సినిమాకు ఆమే స్వయాన డబ్బింగ్‌ చెప్పారు. గతంలో తన చివరి సినిమాల్లోనే డబ్బింగ్‌ చెప్పడం మానుకున్నారు శ్రీదేవి. అయితే ఇప్పుడు 25 ఏళ్ల తర్వాత మళ్లీ గళమెత్తారు. ఇందుకోసం ఆమె చెన్నైలోనే కొన్ని రోజుల పాటు బస చేశారు. రాణిగా ఓ ప్రాంతాన్ని శాసిస్తున్న శ్రీదేవి... తన అహంకారంతో ప్రజలను నానా అవస్థలపాలు చేయగా... కథానాయకుడు విజయ్‌ ఎలా అడ్డుకుని.. గద్దెనెక్కారన్నదే చిత్ర కథ అన్నట్లు కోడంబాక్కం వర్గాలు గుసగుసలాడుతున్నాయి. వీలైనంత త్వరలో విడుదల కోసం సన్నాహాలు చేస్తున్నారు.

  ఇక 'పులి' చిత్రంతో శ్రీదేవి చాలా కాలం తర్వాత తెలుగులోకి వస్తోంది. ఆమె అభిమానులందరూ దాంతో చాలా ఆనందంగా ఉన్నారు. అంతేకాక ఇప్పుడు ఆమె మరో మంచి నిర్ణయం తీసుకున్నారు. అదేమిటంటే...తెలుగు వెర్షన్ కు గానూ ఆమే స్వయంగా డబ్బింగ్ చెప్తానని చెప్పారు. దాంతో తెలుగు వెర్షన్ తీసుకున్న నిర్మాతలు చాలా ఆనందం ఫీల్ అవుతున్నారు. తెలుగు వెర్షన్ రైట్స్ ని శోభారాణి 12 కోట్లుకు తీసుకున్నారు.

  Vijay's Puli: One Crore For Sridevi Telugu Voice?

  చిత్రం వివరాల్లోకి వస్తే...

  'కత్తి' చిత్రంతో తమిళనాడులో బాక్సాఫీస్ రికార్డుల్ని సృష్టించిన ఇళయదళపతి విజయ్ లేటెస్ట్‌గా శింబుదేవన్ దర్శకత్వంలో ఎస్ కె టి స్టూడియోస్ బ్యానర్‌పై శింబు తమీన్స్, పి టి సెల్వకుమార్ నిర్మాతగా నిర్మిస్తున్న పులి చిత్రం భారీ బడ్జెట్, హై టెక్నికల్ వాల్యూస్‌తో తెరకెక్కింది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. తెలుగులో చిత్రాని ఎస్ వి ఆర్ మీడియా బ్యానర్‌పై సి జె శోభ విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం మొదట సెప్టెంబర్ 17న విడుదల చేద్దామనుకున్నారు. అయితే సీజీ గ్రాఫిక్స్ లేటవటంతో అక్టోబర్ 1 కు ఈ విడుదల తేదీని ముందుకు తోసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు త్వరలోనే అఫీషియల్ గా ప్రకటన వచ్చే అవకాసం ఉంది.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  ఇళయ దళపతి విజయ్ మాట్లాడుతూ.... 'నాకు చాల రోజులుగా తీరని కోరిక తీరింది. ఒక హిస్టరికల్ బేస్‌డ్ చిత్రంలో నటించాలి. అందులో కమర్షియల్ ఎలిమెంట్స్ ఏవీ మిస్ కాకుండా ఉండాలని కోరిక ఉండేది. ఈ పులి చిత్రంతో ఆ కోరిక తీరిపోయింది. పులి కడుపున పులే పుడుతుందనే విధంగా కమల్ తనయ శృతిహాసన్ ఈ చిత్రంలో అభినయం చేసింది. అలాగే ముంబాయ్ నుంచి దక్షిణాదికి ఇచ్చిన శృతిహాసన్, హన్సిక, ఇద్దరూ పోటీ పడి నటించారు. శ్రీదేవి గారు ఈ చిత్రంలో కీలక పాత్ర లో నటించారు. ఆవిడ దాదాపు 27ఎళ్లు తరువాత నా చిత్రంలో నటించినందుకు థ్యాంక్స్ చేప్పుతున్నాను. దర్శకుడు చింబుదేవన్ చేసిన కొత్త ప్రయత్నమే ఈ చిత్రం అన్నారు.

  శ్రీదేవి మాట్లాడుతూ.... తమిళ్‌నాడు నాకు ఎప్పుడు నాకు అమ్మగారిల్లే ఎప్పటికీ మరిచిపోను. చాల ఎళ్లు తరువాత తమిళంలో నేను చేస్తున్న చిత్రం ఇది. విజయ్ ఒక ప్రొఫెషనల్ హీరో. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే హీరో. మంచి టీమ్ వర్క్ తో చేశాను. ఎంటైర్ టీమ్‌కి ఆల్ ది బెస్ట్ అన్నారు.

  దర్శకుడు చింబుదేవన్ మాట్లాడుతూ.... విజయ్ కథ వినగానే ఇది అన్నీ వర్గాల ప్రేక్షకులకు నచ్చే చిత్రం అవుతుంది. తప్పకుండా మనం కలసి చిత్రం చేస్తున్నాం అన్నారు. అప్పటి నుండి నన్ను ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకు పోయారు. నిర్మాతలు ఈ చిత్రం కోసం డబ్బులు ఖర్చు పెట్టడమే కాదు, కో డైరెక్టర్స్‌గా పని చేశారు. శ్రీదేవి, సుదీప్ విలక్షణమైన పాత్రలు పోషించారు. లవ్,యాక్షన్, ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ చిత్రంలో సరికొత్త విజయ్ కనిపిస్తారు అన్నారు.

  నిర్మాతలు శిబు తమీన్స్‌, పి.టి.సెల్వకుమార్‌ మాట్లాడుతూ ‘‘మా ‘పులి' చిత్రానికి సంబంధించిన టీజర్‌ ఒక్కరోజులోనే 20 లక్షల హిట్స్‌ సాధించి కొత్త రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. పి.కె. చిత్రాన్ని మించిన స్థాయిలో ఈ చిత్రం టీజర్‌కి హిట్స్‌ రావడం ఆనందంగా వుంది. ఈ టీజర్‌ని చూసి విజయ్‌ తమకు అందించిన బర్త్‌డే గిఫ్ట్‌గా ఫీల్‌ అయ్యారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రంలో శ్రీదేవిగారు రాణీ సౌమ్యాదేవి క్యారెక్టర్‌లో చాలా అద్భుతంగా నటించారు. ‘పులి' చిత్రం విజయ్‌ కెరీర్‌లో మరో సెన్సేషనల్‌ మూవీ అవుతుంది'' అన్నారు.

  విజయ్‌, శృతి హాసన్‌, హన్సిక, శ్రీదేవి, కన్నడ స్టార్‌ సుదీప్‌, ప్రభు, తంబి రామయ్య, సత్యన్‌, జూనియర్‌ బాలయ్య, నరేన్‌, జో మల్లూరి, మధుమిత, అంజలీదేవి, గాయత్రితో పాటు 40 మంది ప్రముఖ తారాగణం నటిస్తున్న ఈ త్రిభాషా చిత్రాన్ని ఎస్‌.కె.టి. స్టూడియోస్‌ బేనర్‌పై శింబు దేవన్‌ దర్శకత్వంలో శిబు తమీన్స్‌, పి.టి.సెల్వకుమార్‌ నిర్మిస్తున్నారు.

  English summary
  Reportedly, Sridevi who is playing the role of a Queen in 'Puli' will dub her voice for the Telugu version. However for Telugu dubbing, she's likely to get an extra payment. Some sources indicated that Sri has demanded nearly 1 crore rupees to dub for Telugu version. Shoba Rani's SVR Media acquired the theatrical rights of 'Puli' Telugu version shelling out an whooping Rs 12 crore.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X