»   » రిలీజ్ ఏప్రిల్ లో వద్దనుకుంటున్నారు

రిలీజ్ ఏప్రిల్ లో వద్దనుకుంటున్నారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: తమిళ పవర్ స్టార్ విజయ్‌ యాబై తోమ్మిదవ చిత్రం 'థేరి'. ఈ సినిమాకి అట్లీ దర్శకత్వం చేస్తున్నారు. ఈసినిమా దాదాపు షుటింగ్ అంతా పూర్తే చేసుకున్నాట్టు సమాచారం. ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ వర్క పూర్తయింది. ఫస్ట్ హాఫ్ కు సంభందించిన వర్క్ ఇప్పటికే పూర్తైంది. సెకండ్ హాఫ్ పోస్ట్ ప్రొడక్షన్ జనవరి నుండి ప్రారంభం అవుతుంది ఈ సినిమా వాస్తవానికి 2016 ఏప్రిల్ నాటికి ఈ సినిమా రిలీజ్ కావలసిఉంది. కాకపోతే ఇది మే గాని, జూన్ లో గాని విడుదల కావోచ్చని సమాచారం.

ఈ సినిమాలో విజయ్‌ మళ్లీ పోలీసు అధికారిగా నటిస్తున్నట్లు సమాచారం. ఇటీవల ఫస్ట్‌లుక్‌ను దర్శకుడు అట్లీ విడుదల చేశారు. దీనికి మంచి స్పందన కూడా లభించింది. ఇందుతో మూడు గెటప్‌లలో కనిపించాడు విజయ్‌.

ఈ చిత్రం తెలుగు వెర్షన్ కు గానూ మెరుపు అనే టైటిల్ పెట్టారుని సమాచారం. ఈ మెరుపు టైటిల్ ని గతంలో రామ్ చరణ్, తమిళ దర్శకుడు ధరణి కాంబినేషన్ లో ప్రారంభమై ఆగిపోయిన చిత్రానిది కావటం విశేషం.

Vijay's Thery may or june for release.

ఇక ఈ చిత్రంతో ప్రముఖ సినీ నటి మీనా కూతురు నైనిక వెండి తెరకు పరిచయం కాబోతోంది.కాగా, సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీస్‌లో తనకంటూ ఓ స్టార్ డమ్‌ని క్రియేట్ చేసుకున్న హీరోయిన్ సమంత ఈ సినిమాలో తల్లిగా నటిస్తోంది. ఇంతకు ముందు సమంత మనం తెలుగు సినిమాలో తల్లి పాత్రలో నటించింది.

ఈసారి మరో హీరోయిన్ కూతురికి తల్లిగా నటించబోతోంది.హీరోయిన్‌గా టాప్ ప్లేస్‌లో ఉన్న సమయంలో తల్లి పాత్ర ద్వారా సాహసం చేసిన తర్వాత మళ్లీ వెండితెరపై తల్లి పాత్రను చేయకూడదని అనుకుందట. కానీ ఇప్పుడు ఆ నిర్ణయాన్ని మార్చుకుని కోలీవుడ్ సినిమాలో తల్లి పాత్రలో నటిస్తోంది.

English summary
Vijay's Theri might not release in April 2016, but might swoop into theatres all over the world in late May or early June.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu