»   » ఐదు భాషల్లోనా....!? చిరు రీఎంట్రీకంటే భారీగా ఉన్నట్టుందే...

ఐదు భాషల్లోనా....!? చిరు రీఎంట్రీకంటే భారీగా ఉన్నట్టుందే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

విజయశాంతి గురించి ఈ రోజు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు "లేడీ అమితాబ్" అనిపిలిపించుకున్న ఏకైక నటి . హీరోల పక్కన గ్లామర్ హీరోయిన్ గా పలు సినిమాలలో నటించి .. ఆ తర్వాత తనే ఓ 'సూపర్ హీరో' స్థాయికి చేరిన నటి. ఆమె నటించిన పలు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కాసుల వర్షం కురిపించాయి. అలాంటి విజయశాంతి గత కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా వుంటున్నారు.టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రహీరోల సరసన నటించి మెప్పించిన హీరోయిన్లలో ఒకరు విజయశాంతి. ఒక్క అందమే కాకుండా హావభావాలు కూడా అద్భుతంగా పండిస్తూ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ముఖ్యంగా లేడీ ఒరియెంటెడ్ చిత్రాల్లో నటించి సూపర్ డూపర్ హిట్‌‌లు తన ఖాతాలో వేసుకుంది రాములమ్మ.

ఒక్క తెలుగు భాషలోనే కాకుండా తమిళ, మలయాళం, కన్నడ మరియు హిందీతో సహా ఏడు భాషల్లో 185పైగా సినిమాల్లో విజయశాంతి నటించి అభిమానులను మెప్పించింది. అందుకే ఆమెను 'లేడీ అమితాబ్'గా పిలుచుకుంటారు అభిమానులు. కొన్ని రోజుల తర్వాత సినిమాలు వరుసగా ప్లాప్ అవ్వడంతో రూటు మార్చిన రాములమ్మ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే రాజకీయాల్లో కూడా పెద్దగా రాణించలేకపోవడంతో మళ్లీ సినిమాల్లోకి యూటర్న్ తీసుకుంటున్నట్లుగా ఫిల్మ్‌‌నగర్‌‌లో పుకారు చక్కర్లు కొడుతోంది.

Vijayashanthi

ఇప్పుడు మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించడానికి ఆమె రెడీ అవుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఒక భారీ యాక్షన్ సినిమాతో ఆమె రీ ఎంట్రీ ఇవ్వనున్నట్టు సమాచారం. వార్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రాన్ని రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని ఏకకాలంలో ఐదు భాషల్లో తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.

అప్పట్లో లేడీ ఒరియెంటెడ్ సినిమాలు బాగా కాసులు కురిపించాయి. ఒకానొకకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలు చిరంజీవి, బాలయ్యల కంటే ఎక్కువే రెమ్యునరేషన్ తీసుకుందట. అయితే ఏ పాత్ర అయితే తనకు మంచిపేరు తెచ్చిపెట్టిందో అదే పాత్రతో.. యాక్షన్ సినిమాతో లేడీ అమితాబ్ రీఎంట్రీ ఇస్తున్నారని సమాచారం. ఈ సినిమా కూడా వార్ డ్రాప్‌‌లో ఉంటుందని తెలుస్తోంది. రాములమ్మ సినిమా ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తారని తెలిసింది. అయితే సినిమా డైరెక్టర్ ఎవరు.. అసలు సినిమా తీస్తున్నారా లేదా.. అన్న విషయంపై అటు రాములమ్మ గానీ డైరక్టర్లుగానీ ఇంత వరకూ స్పందించలేదు. మరి మున్ముందు ఏమైనా రాములమ్మ స్పందిస్తుందేమో వేచి చూడాల్సిందే !

English summary
As per known information, this senior actress Vijayashanthi return back to silver screen that too with a power pack script. Yes, Vijayashanthi planning to act in ‘Osey Ramulamma’ movie sequel or a War backdrpo Movie
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu