»   » చిరంజీవి నా కోసం పార్టీ అరేంజ్ చేసారు: విజయశాంతి

చిరంజీవి నా కోసం పార్టీ అరేంజ్ చేసారు: విజయశాంతి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: చిరంజీవి, విజయశాంతి ఒకప్పుడు తెలుగు తెరపై సక్సెస్‌ఫుల్ జోడీ. ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుందంటే అది సూపర్ డూపర్ హిట్టే. వీరి కాంబినేషన్లో సినిమా తీయడానికి అప్పట్లో దర్శక నిర్మాతలు పోటీ పడేవారు. వీరు కలిసి నటించిన సినిమా సినిమా విడుదలైతే బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షమే. వీరి కాంబినేషన్లో చాలెంజ్, స్వయం కృషి, గ్యాంగ్ లీడర్ లాంటి ఎన్నోహిట్ చిత్రాలు వచ్చాయి.

చిరంజీవి, విజయశాంతి కలిసి నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో ఒకటైన 'గ్యాంగ్ లీడర్' సినిమా రిలీజ్ అయ్యి పాతికేళ్లు పూర్తైంది. మే 9, 1991లో ఈ సినిమా రిలీజైంది ఈ సందర్భంగా ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన విజయశాంతి అప్పటి విషయాలను గుర్తు చేసకున్నారు.

Vijayashanti about Chiranjeevi dance

గ్యాంగ్ లీడర్ కోసం భద్రాచలం కొండ పాట షూటింగ్ చేస్తున్న సమయంలో 'కర్తవ్యం' చిత్రానికి తనకు ఉత్తమనటి అవార్డు వచ్చిందనే విషయం తెలిసింది, దీంతో ఆ సాయంత్రమే చిరంజీవి గారు పెద్ద పార్టీ అరేంజ్ చేసి చిరు ఫ్యామిలీతో పాటు గోవిందా - దివ్యభారతిలను కూడా పిలిచారని విజయశాంతి గుర్తు చేసుకున్నారు. హీరోయిన్లకు ఆయన ఎంతో గౌరవం ఇచ్చే వారు అని తెలిపరారు

దీంతో పాటు చిరంజీవి యాక్టింగ్, డాన్సింగ్ టాలెంట్ ను ప్రశంసించడంతో పాటు వ్యక్తిగతంగా కూడా చిరంజీవి ఎంత మంచి వారో వివరించారు. తెలుగు సినిమా రంగంలోని గొప్ప యాక్టర్లలో ఒకరు చిరంజీవి అని చెప్పి ఆమె....చిరంజీవికి కొన్ని విషయాల్లో సాటిరాగల వ్యక్తులు ఇప్పటికీ లేరని తెలిపారు. ఇప్పడు వస్తున్న స్టార్స్ కూడా డ్యాన్సులు బాగా చేస్తున్నారు.. అయితే స్టైల్ విషయంలో చిరంజీవి రేంజి మాత్రం ఎవరికీ రాలేదన్నారు.

English summary
Vijayashanti about Chiranjeevi dance in Gang Leader movie.Gang Leader is a 1991 Telugu crime film starring Chiranjeevi and Vijayashanti. Directed by Vijaya Bapineedu.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu