twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సినిమాల్లోకి రీ ఎంట్రీ.. రాజకీయాలకు గుడ్ బై..? విజయశాంతి క్లారిటీ

    |

    ఒకప్పుడు దక్షిణాదిలో లేడీ సూపర్ స్టార్ గా ఓ వెలుగు వెలిగింది విజయశాంతి. స్టార్ హీరోలందరి సరసన నటించడమే గాక అప్పట్లోనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసి రాములమ్మగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఆ తర్వాత కాలంలో రాజకీయ గడపతొక్కిన ఈమె సినిమాలకు దూరంగా 13 ఏళ్ళు గడిపింది. ఈ నేసథ్యంలో ఇక విజయశాంతి సినిమాలు చేయదనుకుంటున్న తరుణంలో మహేష్ 26 ద్వారా తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తుండటం సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ఈ మేరకు ఇక విజయశాంతి రాజకీయాలకు గుడ్ బై చెప్పినట్లేనా? అనే టాక్ వచ్చింది. మరి దీనిపై విజయశాంతి ఏమంటోంది? ఇందులో నిజమెంత? ఆ విశేషాలు చూద్దామా..

    మహేష్ బాబు 26

    మహేష్ బాబు 26


    మహర్షి సినిమాతో సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న మహేష్ బాబు.. తన 26 వ సినిమాను అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్నాడు. ఇటీవలే ప్రారంభమైన ఈ సినిమాకు 'సరిలేరు నీకెవ్వరు' అనే ఆసక్తికర టైటిల్ పెట్టారు. అయితే ఈ సినిమా ద్వారా విజయశాంతి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తుండటం జనాల్లో చర్చనీయాంశం అయింది.

    చిరు లాగే విజయశాంతి

    చిరు లాగే విజయశాంతి

    వెండితెరపై ఓ వెలుగు వెలిగిన మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లో అట్టర్ ప్లాప్ అయ్యారు. ఇదే బాటలో అంతగా కాకున్నా విజయశాంతి కూడా రాజకీయాల పరంగా కాస్త డల్ అయిందనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో మహేష్ సినిమాలో విజయశాంతి కీలక పాత్ర అని తెలియడంతో ఇక చిరు లాగే విజయశాంతి కూడా రాజకీయాలకు గుడ్ బై చెప్తుందనే టాక్ మొదలైంది.

    2014లో ఓడిపోయాక విజయశాంతి

    2014లో ఓడిపోయాక విజయశాంతి

    గడిచిన కొన్నేళ్లుగా ఆమె రాజకీయాల్లో కీలకంగా ఉంటున్న విజయశాంతి.. 2014లో ఓడిపోయాక నాలుగేళ్ల పాటు పొలిటికల్ స్క్రీన్ పై కనిపించలేదు. సడన్ గా 2019 ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ తరఫున హల్చల్ చేసినప్పటికీ ఫలితాలు చూస్తే ఆ పార్టీ తుస్సుమంది. దీంతో సైలెంట్ అయిన విజయశాంతి ఒక్కసారిగా వెండితెర బాట పట్టడం జనాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇక రాజకీయాల్లో విజయశాంతి కనుమరుగైనట్లే అంటున్నారంతా.

     విజయశాంతి క్లారిటీ..

    విజయశాంతి క్లారిటీ..

    అయితే తన రాజకీయ జీవితంపై వస్తున్న టాక్ గమనించిన రాములమ్మ ఈ టాక్ పై తన స్పందన తెలిపింది. తనకు 6 నెలల కిందటే సినిమా ఆఫర్ వచ్చిందని, అయితే ఆ సమయంలో స్టార్ క్యాంపెయినర్‌గా ఎన్నికల ప్రచారంలో ఉండడంతో తాను చేయనన్నానని.. ఇప్పుడు ఫ్రీ కావడంతోనే చేస్తున్నానని వివరణ ఇచ్చింది విజయశాంతి. సినిమాల్లోకి వస్తున్నంత మాత్రాన రాజకీయాలకు రామ్ రామ్ చెబుతానని భావించకూడదని విజయశాంతి పేర్కొనడం విశేషం.

    English summary
    Vijayashanti gives clarity on political life good by rumars. She said.. this is only re entry into the movies but not says good by for politics
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X